Top Hizbul commander trapped in Kashmir encounter భారత భద్రతా బలగాల ప్రతీకారం.. హిజ్బుల్ టాప్ కమాండర్ హతం

Top hizbul commander riyaz naikoo killed in encounter in j k s pulwama

kashmir encounter, awantipora, riyaz naikoo, riyaz naikoo encounter, riyaz naikoo trapped, Beighpora, jammu and kashmir, hizbul mujahideen, reyaz naikoo, army kashmir

A top Hizbul Mujahideen commander has been trapped by security forces in an ongoing encounter in South Kashmir’s Awantipora, officials said on Wednesday morning. A terrorist was killed in another gunbattle in Pulwama district

భారత భద్రతా బలగాల ప్రతీకారం.. హిజ్బుల్ టాప్ కమాండర్ హతం

Posted: 05/06/2020 01:18 PM IST
Top hizbul commander riyaz naikoo killed in encounter in j k s pulwama

భారత బలగాలు ముగ్గురు వీరజవాన్ల మరణాలకు ప్రతీకారం తీర్చుకున్నారు. ఇది సాధరణ ప్రతీకారం కాదు.. ఏకంగా భారత భద్రతా బలగాలన్నీ విజయగర్వంలో మునిగే ప్రతీకారం. మూడు రోజుల క్రితం కశ్మీర్ లోని హంద్వారాలో ముష్కరుల కాల్పుల్లో అమరులైన మన వీరజనాన్ల ప్రాణత్యాగానికి భారత సేనలు ఘననివాళి గటించేదిశగాసాగుతోంది. ఇవాళ జిల్లాలో జరిగిన సుదీర్ఘ ఎన్ కౌంటర్లో హిజ్బుల్‌ ముజహిదీన్‌ ఆపరేషనల్‌ కమాండర్‌ రియాజ్‌ నైకూ హతమార్చాయి బలగాలు.

నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ చీఫ్‌ రియాజ్‌ నైకూ ఎనిమిదేళ్లుగా భద్రతా దళాల కన్నుగప్పి తిరుగుతున్నాడు. రంజాన్‌ సందర్భంగా తన స్వగ్రామానికి వచ్చి తన తల్లిదండ్రులను పరామర్శించేందుకు వచ్చాడన్న సమాచారం అందుకున్నభద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి రియాజ్ ను మట్టుబెట్టాయి. ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌, జమ్ముకశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో రియాజ్ హతమయ్యాడు. మంగళవారం రాత్రి నుంచి భద్రతా బలగాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టి బీగ్ బోరా గ్రామాన్ని జల్లెడ పడుతుండగా ప్రారంభమైన ఎన్ కౌంటర్‌ ఇవాళ మధ్యాహ్నం వరకూ కొనసాగింది.

భారత భద్రతా బలగాలపై దొంగచాటుగా విరుచుకుపడే ఉగ్రవాదులు.. అదే కశ్మీర్లో నక్కారన్న సమాచారంతో ముష్కరులపై భద్రతాబలగాలు ఉక్కుపాదంమోపుతూ.. విరుచుకుపడటంతో రిజాయ్ నైకూ హతమయ్యాడు, అందులో భాగంగా గత రెండు రోజులుగా నిరాటంకంగా భారీ ఆపరేషన్లు చేపట్టింది. ఇప్పటికే పుల్వామా జిల్లా షార్షలీలో ఇద్దరు ముష్కరుల్ని బలగాలు మట్టుబెట్టాయి. బేగ్‌పురాలోని తన ఇంటిలో రియాజ్‌ నైకూ ఉన్నాడనే సమాచారంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు 40 కిలోల ఐఈడీతో ఇంటిని పేల్చివేశాయి.  

ఉపాధ్యాయుడిగా పనిచేసిన రియాజ్‌ 33 ఏళ్ల వయసులో ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు. కరడుగట్టిన ఉగ్రవాది హిజ్బుల్‌ కమాండర్‌ బుర్హాన్‌ వానీ హతమైన తర్వాత ఆ బాధ్యతల్ని రియాజ్‌ తీసుకున్నాడు. కాశ్మీర్ లోయలో యువకుల్ని ఉగ్రవాదం వైపు ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. రియాజ్‌ను హతమార్చడం..  బలగాలకు పెద్ద విజయం. రియాజ్ మరణంతో లోయలో ఉగ్రకార్యకలాపాలను బలహీనపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే, హంద్వారా ఎన్ కౌంటర్లో జరిగిన ప్రాణనష్టానికి ప్రతీకారం తీర్చుకున్నట్ల అయ్యింది, ఉగ్రవాద కార్యకలాపాలకు ధీటుగా ప్రతీకారం ఇస్తామని దాయాధి పాక్ కు గట్టి సమాధానం చెప్పినట్లైందని భద్రతా బలగాలు పేర్కోన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles