Italy claims world's first Covid-19 vaccine: Report కరోనా వాక్సీన్ రెడీ అంటున్న ఇటలీ

Italian scientists claim to have developed world s first covid 19 vaccine

corona vaccine, vaccine for corona, coronavirus vaccine news, Italy news, coronavirus vaccine, Italy vaccine, Italy COVID vaccine, Italy vaccine coronavirus, Coronavirus, Coronavirus COVID-19, coronavirus vaccine in india, PM Modi, CM KCR, Biological E Ltd, Shanta Biotech, India, Italy

Italian researchers on Wednesday claimed that they have successfully developed a vaccine that can help contain the novel coronavirus that causes COVID-19. According to a report, the new vaccine is likely to work on the SARS-CoV-2 virus that has spread rapidly across the globe.

బిగ్ బ్రేకింగ్: కరోనా వాక్సీన్ రెడీ అంటున్న ఇటలీ

Posted: 05/06/2020 02:07 PM IST
Italian scientists claim to have developed world s first covid 19 vaccine

మానవాళిపై త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తున్న క‌రోనావైరస్ పై యుద్దం చేయడంలో ఇటలీ ముందంజలో వుంది. కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకునేలోగా జరగరాని నష్టం ఇటలీకి కూడా ముంచేసింది. అయినా మొక్కవోని ధైర్యంతో కరోనా వ్యాప్తిని నిరోధించడంలో ముందడుగు వేసింది. అదెలా అంటారా.? కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఇటలీ విజయవంతంగా వ్యాక్సిన్ రూపోందించింది. అయితే ఈ వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్ వేసవి కాలం ముగిసిన తరువాత ప్రారంభిస్తామని ఈ మేరకు ఇటలీ శాస్త్రవేత్తలు పేర్కోన్నారు.

ప్ర‌పంచం మొత్తం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న వాక్సీన్ ను తాము అభివృద్ధి చేసిన‌ట్లు ఇట‌లీ పరిశోధకులు ప్ర‌క‌టించారు. మాన‌వుల‌పై ఈ వ్యాక్సిన్ ప‌నిచేస్తుంద‌ని తాము చేసిన ప‌రిశోధ‌న‌ల్లో తేలింద‌ని పేర్కొన్నారు. దీని ద్వారా ఉత్ప‌త్తి అయిన యాంటీబాడీస్ క‌రోనాపై పోరాడి అంతం చేస్తుంద‌ని వివ‌రించారు. రోమ్‌లోని స్ప‌ల్లంజానీ హాస్పిట‌ల్‌లో ఇప్ప‌టికే ఎలుక‌ల‌పై ఈ వ్యాక్సిన్ ప్ర‌యోగించామ‌పూైని తెలిపారు. ట‌కీస్ అనే సంస్థ జ‌రిపిన ఈ ప‌రిశోధ‌న‌ల్లో వ్యాక్సిన్ ఎలుక‌ల‌పై విజయవంతం అయిన‌ట్లు సీఈవో ఆరిసీచియో వెల్ల‌డించారు.

ఎలుకల్లో క‌రోనాను నిరోధించే యాంటీబాడీస్ ఉత్ప‌త్తి అయిన‌ట్లు క‌నుగొన్నామ‌ని తెలిపారు. వ్యాక్సిన్ త‌యారీలో ఇది కీల‌క ముంద‌డుగు అని, మాన‌వుల‌పై అతి త్వ‌ర‌లోనే ప్ర‌యోగాలు చేస్తామ‌ని వివ‌రించారు. అమెరిక‌న్ ఔష‌ధ సంస్థ‌తో క‌లిసి మ‌రిన్ని పరిశోధ‌న‌లు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఇక కోవిడ్‌-19 కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా 2,53,974 మంది ప్రాణాలు కోల్పోయారు. క‌రోనా రక్క‌సిని అంతమొందించేందుకు ప‌లు దేశాలు ఇప్ప‌టికే వ్యాక్సిన్ త‌యారీలో ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనాపై పోరాడ‌టానికి 70 వ్యాక్సిన్లు అభివృద్ధి చేయ‌గా, వాటిలో కేవ‌లం ఐదు మాత్ర‌మే మాన‌వుల‌పై ట్ర‌య‌ల్స్ కోసం అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles