Delhi hikes VAT on petrol, diesel amid corona crisis ఇంధన ధరలకు రక్కలు.. డీజిల్ పై వ్యాట్ పెంపు..

Petrol diesel prices see big hike in delhi today after increase in vat

petrol price, diesel price, petrol, diesel, petrol pumps, petrol pumps near me, coronavirus,VAT,Value Added Tax, delhi news

After being stable for about 50 days, the price of diesel went up by 7.10 a litre in Delhi and that of petrol by 1.67 per litre today after the Delhi government increased value added tax (VAT) on the two auto fuels.

ఇంధన ధరలకు రక్కలు.. డీజిల్ పై వ్యాట్ పెంపు..

Posted: 05/05/2020 01:04 PM IST
Petrol diesel prices see big hike in delhi today after increase in vat

సుమారు యాభై రోజులుగా నిలకడగా వున్న ఇంధన ధరలకు ఇవాళ ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి, మరీ ముఖ్యంగా డీజిల్ ధరలు అకస్మికంగా భగ్గుమన్నాయి, స్థిరంగా కొనసాగుతున్న ఇంధన ధరలపై ఇవాళ ఢిల్లీ ప్రభుత్వం వ్యాట్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ రోజు ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.1.67, డీజిల్ ధర ఒక్కసారిగా రూ.7.10 పెరిగింది. దీంతో ఢిల్లీలో నిన్నటివరకు రూ. 69.59గా ఉన్న లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.71.26గా ఉంది. నిన్నటి వరకు డీజిల్ ధర రూ .62.29గా ఉండగా, ఇప్పుడు రూ.69.29కు చేరింది.

మరోవైపు, ముంబైలో పెట్రోల్‌ లీటరు ధర రూ.76.31, డీజిల్ ధర రూ. 66.21గా ఉన్నాయి. కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.73.30, డీజిల్ ధర రూ. 65.62 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ.3.26 పెరగడంతో లీటరు పెట్రోలు ధర రూ. 75.54,  డీజిల్ ధర రూ.68.22గా ఉంది. ఇక హర్యానా, నాగాలాండ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్, అమరావతిలో పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పుల్లేవు. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.73.97, లీటరు డీజిల్ ధర రూ. 67.82గా ఉంది. అమరావతిలో పెట్రోల్ ధర లీటరు రూ.74.61 ఉండగా, డీజిల్ ధర  రూ. 68.52గా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles