ప్రపంచవ్యాప్తంగా లక్షలాధి మంది ప్రాణాలను బలిగొంటున్న కరోనా వైరస్ మహమ్మారి జడలు అణిచేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న శాస్త్రవేత్తలకు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారాడు తనదైన శైలిలో ఓ సూచన చేశారు. మందులేని ఈ వ్యాధికి వ్యాక్సిన్ కొనుగోనేందుకు శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు తీవ్రంగా పరిశోధనలు చేస్తున్న నేపథ్యంలో గరికపాటి నరసింహారావు సూచన చేయడం విశేషం. కరోనాలాంటి వ్యాధి గురించి ‘యోగా వశిష్టం’లో చెప్పారని అందుకు సంబంధించిన వివరాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
‘‘కరోనాలాంటి వ్యాధుల గురించి ‘యోగవశిష్టం’లో ప్రమాణం ఉంది. అది 32వేల శ్లోకాల గ్రంథం. శ్రీరాముడికి వశిష్ఠుడు చేసిన బోధ. అందులో ఉత్పత్తి ప్రకరణంలో 69సర్గలో విశూచిక అనే వ్యాధి వ్యాపిస్తుందని అప్పట్లో చెప్పారు. ‘దుర్భోజన’, ‘దురారంభ:’ ‘మూర్ఖ’ ‘దుశ్చిత్యేష్టే’ అని స్పష్టంగా చెప్పబడి ఉంది. రకరకాల జంతు మాంసాలను తినడాన్ని దుర్భోజనం అంటారు. దుష్ట సంకల్పలాలు కలిగి యుద్ధాలొచ్చినప్పుడు ఎలాగైనా మనం గెలిచి తీరాలని కొందరు ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్లు జీవాయుధాలు ప్రయోగించాలనే దుష్ట సంకల్పాలు కలిగి ఉంటారు. వాళ్ల దగ్గర మొదలై, మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసే అవకాశం ఉందని యోగ వశిష్టంలో కొన్ని వేల ఏళ్ల కిందట చెప్పారు’’
‘‘కొన్నిసార్లు వ్యాధి సోకినప్పుడు లక్షణాలు ఉన్నాయా లేదా? అన్నది గుర్తించడం కష్టం.. సగుణం.. విగుణం జైవజనమాసాదైషచి అని చెప్పిన యోగ వశిష్టంలో పరిష్కారం చెప్పారు. మందు, మంత్రం రెండూ ఉన్నాయి. మందుగా ఏం చెప్పారంటే..? ‘ఆతురం చెంతయేత్ చంద్రేరసాయన హృదిస్థితం అంజనా మరణంయుక్తం ముక్తం సర్వాధి విభ్రమైః’ దీనికి సంబంధించిన వ్యాధి నుంచి బయటపడాలంటే ‘చంద్రేరసాయన హృదిస్థితం’ అంటే చంద్ర సంబంధమైన వస్తువులు దీనికి మందుగా పనికొస్తాయట’’
‘‘నాకు తెలిసి, నవరత్నాల్లో ముత్యాలు చంద్రునికి సంబంధించింది. నవధాన్యాలలో ఒకటి చంద్రుడికి సంబంధించింది. ఈ చంద్ర సంబంధం పదార్థాలతో వాటి నుంచి తయారైన రసాయనాలతో దీనికి మందు దొరకవచ్చు. నేను తెలుగు భాషలో మాత్రమే పండితుడిని, వైద్యానికి సంబంధించిన విషయాలు నాకు తెలియవు. వైద్యులు, పరిశోధకులకు ఇదే నా నమస్కారం. చంద్ర సంబంధ వస్తువులతో మందు తయారు చేసే అవకాశం ఉందేమో భారతీయ తత్వ చింతనతో ఒక్కసారి ఆలోచించండి. ప్రయోగం చేయడంలో ఎలాంటి తప్పూ లేదని నా అభిప్రాయం మాత్రమే’’ అని చెప్పుకొచ్చారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more