Coronavirus deaths continue to drop in New York లాక్ డౌన్ ఫలితం: న్యూయార్క్ లో తగ్గిన కోవిడ్ మరణాలు..

Coronavirus deaths continue to drop in new york as lockdown continues

coronavirus, New York Governor, Andrew Cuomo, coronavirus deaths in new york, coronavirus US, wet market, bats, Donald Trump, Republicans, China, WHO, COVID-19, bioweapon, coronavirus cases, COVID-19 pandemic, corona virus America, coronavirus newyork, coronavirus updates, coronavirus breakout, coronavirus spread, Crime

New York’s daily coronavirus death toll continued to drop on Sunday as health officials urged people to continue to follow social distancing orders. The daily coronavirus death rate has continued to fall in New York, hitting its lowest point in over two weeks. New York Governor Andrew Cuomo announced 504 died of Covid-19 over the past 24 hours

లాక్ డౌన్ ఫలితం: న్యూయార్క్ లో తగ్గిన కోవిడ్ మరణాలు..

Posted: 04/20/2020 10:35 AM IST
Coronavirus deaths continue to drop in new york as lockdown continues

కరోనా వైరస్ యావత్తు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎప్పుడు ఈ రాకాసి కాలగర్భంలో కలసిపోతుందా.. అని ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నారు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు అగ్రదేశాలతో పాటు అభివద్ది చెందుతున్న దేశాలన్నీ ఎప్పుడు ఈ మహమ్మారి అంతం చెందుతుందా.? అని వేచిచూస్తున్నాయి. చైనాలోని వూహాన్ నగరంలో జన్మించి.. అగ్రరాజ్యం అమెరికాకు వలస వచ్చిన ఈ మహమ్మారి ఏకంగా అగ్రరాజ్యంాన్ని కాకావికళం చేస్తోంది. మరీ ముఖ్యంగా న్యూయార్క్‌ నగరంలో మరణమృదంగాన్ని మ్రోగిస్తోంది.

ను ఊపేసిన కరోనా వైరస్ కొంత నెమ్మదించింది. వైరస్ దెబ్బకు కకావికలమైన న్యూయార్క్‌లో నిన్న 550 కంటే తక్కువ సంఖ్యలోనే మరణాలు సంభవించడంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. గత రెండు వారాలుగా వేలల్లో నమోదవుతున్న మరణాల సంఖ్య ఆదివారం వందల్లోకి మారడంతో అటు ప్రభుత్వం, ఇటు ప్రజలకు ఊరట లభించినట్టు అయింది. అంతేకాదు, ఐసీయూలో చేరుతున్న రోగుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుముఖం పడుతోంది.

న్యూయార్క్ నగరంలో కరోనా బారినపడి కోలుకున్న పోలీసులు తిరిగి విధులకు హాజరవుతుండడం విశేషం. రాష్ట్రాల్లో మళ్లీ మునుపటి పరిస్థితిని తీసుకొచ్చేందుకు ఆయా రాష్ట్రాల గవర్నర్లు పోటీపడుతున్నారు. ఇందులో భాగంగా టెక్సాస్‌లో త్వరలోనే దుకాణాలు తెరుచుకోనుండగా, ఫ్లోరిడా బీచ్‌లు, పార్కుల్లో సందర్శకుల జాడ కనిపిస్తోంది. మరోవైపు, లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలంటూ జరుగుతున్న ప్రదర్శనలు ఎక్కువవుతున్నాయి. టెక్సాస్‌లో వందలాదిమంది ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.

కరోనాతో విలవిల్లాడిన స్పెయిన్ ఊపిరి పీల్చుకుంటోంది. నిన్న అతి తక్కువగా 410 మంది మాత్రమే కరోనా మహమ్మారికి బలయ్యారు. దాదాపు నెల రోజుల క్రితం అక్కడ సంభవించిన మరణాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అలాగే, నిన్న కొత్తగా మరో 4,218 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా అక్కడ మొత్తంగా నమోదైన కేసుల సంఖ్య 1,95,944కు పెరిగింది. 20 వేల మంది మృతి చెందారు.

కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు దేశంలో విధించిన అత్యవసర స్థితిని మరో రెండువారాలపాటు పొడిగిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని పెడ్రో సాంచెజ్ తెలిపారు. కరోనా కట్టడి విషయంలో తాము సరైన దారిలోనే వెళ్తున్నట్టు ప్రస్తుత గణాంకాలు చెబుతున్నాయని ఆ దేశ వైద్య ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి ఫెర్నాండో సైమన్ పేర్కొన్నారు. మరోవైపు, అత్యవసర పరిస్థితి పొడిగించినప్పటికీ, ఈ నెల 27 నుంచి పిల్లలు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : COVID-19 pandemic  coronavirus  lockdown  coronavirus  New York Governor  Andrew Cuomo  America  US  

Other Articles