constable held for trasnporting liquor మద్యాన్ని తరలిస్తున్న కానిస్టేబుల్, హోంగార్డు అరెస్టు

Constable home guard held for trasnporting liquor illegally

home guard, constable, Vanasthalipuram police, home guard transporting liquor, 36 liquor bottles seize, Rs 14,110, Malakpet traffic home guard, R Anil Kumar, criminal case, Nampally police station constable, U Vijay, 23 liquor bottles seize, coronavirus lockdown, covid 19, Crime

A home guard was nabbed by Vanasthalipuram police while he was transporting liquor bottles. As many as 36 liquor bottles were seized from his possession, along with a car and Rs 14,110 in cash. In another incident at Vanasthalipuram, a constable who works in Nampally police station was nabbed while he was transporting liquor in a car.

అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న కానిస్టేబుల్, హోంగార్డు అరెస్టు

Posted: 04/20/2020 09:12 AM IST
Constable home guard held for trasnporting liquor illegally

కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ విధులు నిర్వహిస్తూ.. ఇళ్లకు దూరమైన పోలీసులపై సర్వాత్రా ప్రశంసలు వెల్లివిరుస్తున్న తరుణంలో.. కోందరు చేసే పనులతో పోలీసులు సమిష్టి శ్రమపై విమర్శలు కూడా వస్తున్నాయి. లాక్‌డౌన్ వేళ మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఓ హోంగార్డు, మరో కానిస్టేబుల్ వేర్వురు ఘటనల్లో పట్టుబడ్డారు. హైదరాబాద్‌లో రెండు వేర్వేరు ఘటనల్లో పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వనస్థలిపురం పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా నమ్మికల్ గ్రామానికి చెందిన అనిల్‌కుమార్.. మలక్‌పేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డు‌గా పనిచేస్తున్నాడు.

పోలీసు యూనిఫాంలో వున్న తనను ఎవరు అడ్డుకోరని, ఇక తన కారులో ఏం తీసుకెళ్లినా చెల్లుతుందని భావించిన హోంగార్డుకు వనస్థలీపురం పోలీసులు చెక్ పెట్టారు. నిన్న స్వగ్రామం నమ్మికల్ నుంచి కారులో మద్యం బాటిళ్లు తీసుకుని సైదాబాద్ బయలుదేరాడు. అనుమానం రాకుండా యూనిఫాం కూడా ధరించాడు. అయితే, అతడి కారులో మద్యం సీసాలు ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు వనస్థలిపురం పనామా వద్ద కారు ఆపి తనిఖీ చేసి 36 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అనిల్ కుమార్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

మరో ఘటనలో నాంపల్లిలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న విజయ్ (30)ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిడుగురాళ్ల నుంచి నగరానికి కారులో వస్తూ మార్గమధ్యంలో నల్గొండ వద్ద మద్యం సీసాలు కొనుగోలు చేశాడు. వాటితో నగరానికి వస్తుండగా వనస్థలిపురం పనామా వద్ద పోలీసులు తనిఖీ చేసి 23 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యవత్ పోలీసులు యంత్రాంగం లాక్ డౌన్ నేపథ్యంలో అహర్నిశలు శ్రమిస్తున్న తరుణంలో ఇలాంటి ఘటనలు వారి మనోధైర్యాన్నిదెబ్బతీస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : home guard  constable  Vanasthalipuram police  Liquor bottles  illegal transpotation  Crime  

Other Articles