Pawan Kalyan slams YSRCP Government for action against SEC ఎన్ినకల అధికారి తొలగింపుపై పవన్ ఫైర్

Janasena cheif pawan kalyan slams ysrcp government for action against sec

Pawan Kalyan, COVID-19, coronavirus, Andhra elections, jagan mohan reddy, local body elections, Ramesh Kumar, SEC, State Election Commissioner, YSRCP, high court, Andhra Pradesh, Politics

Jana Sena Party (JSP) president Pawan Kalyan critisized the State government on removing the state election officer nimmagadda Ramesh from the post with the new ordinance amid coronavirus scare in andhra pradesh.

వైసీపీ కక్షసాధింపు చర్యలకు ఇదేనా సమయం.?: జనసేన అధినేత పవన్ కల్యాణ్

Posted: 04/10/2020 07:54 PM IST
Janasena cheif pawan kalyan slams ysrcp government for action against sec

కరోనావైరస్ యావత్ ప్రపంచంపై కదం తొక్కుతున్న ఆపత్కాల సమయంలో.. ఆ మహమ్మారి  వ్యాప్తి చెందకుండా కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ కరోనా లింకును ఎక్కడికక్కడ తెంచి వేసేందుకు చర్యలు చేపట్టాల్సిన ఏపీ ప్రభుత్వం.. మాత్రం ఇలాంటి సమయంలోనూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించాడు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఆయన స్పందించారు.

కక్ష సాధింపు, మొండివైఖరి, ఏకపక్ష నిర్ణయాలతో జగన్‌ ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. తాజాగా ఎస్‌ఈసీని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా తమ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని జగన్‌ నిరూపించారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు పవన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమైన విషయాల్లో సీఎం జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు అప్రజాస్వామికంగానే ఉంటున్నాయని ఆక్షేపించారు. హైకోర్టుతో చీవాట్లు పెట్టించుకున్నా.. ‘‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’’ అన్న సామెతలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

‘‘ఎన్నికల కమిషనర్‌ను తొలగించడానికి ఇదా సమయం? ఓ వైపు కరోనాతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ప్రభుత్వం తన శక్తి సామర్థ్యాలను ప్రజలను కాపాడటంపై కేంద్రీకరించారు. ఇందుకు భిన్నంగా ప్రభుత్వంలోని పెద్దలు ఇలా కక్ష తీర్చుకునే కార్యక్రమంలో మునిగిపోయారు. కరోనా పడగ విప్పుతున్న సమయాన ఎన్నికలు నిర్వహించి ఉంటే ప్రజల ప్రాణాలు ఎంతటి ప్రమాదంలో పడి ఉండేవో ఊహించగలమా?’’ అని పవన్‌ నిలదీశారు.

దేశం ఆపత్కాలంలో ఉన్న ఈ సమయంలో రాజకీయాలు చేయకూడదని జనసేన పార్టీ స్వీయ నియంత్రణ పాటిస్తోందని అన్నారు. అయితే యావత్ ప్రజానికం పూర్తిగా కరోనా కల్లోలంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీ నేతలు మాత్రం తమకు అనుకూలంగా వ్యవహరించని అధికారులపై కక్షసాధింపు నిర్ణయాల కారణంగా ఆ నియంత్రణను దాటి మీ చర్యను ఖండించాల్సిన పరిస్థితిని మీరే సృష్టించారు. జనసేన కోరుకుంటున్నది  ఒక్కటే.. ఇది ప్రజల ప్రాణాలను కాపాడే సమయం.. మీ కార్యాచరణ ఆ దిశగా ఉండాలి’’ అని పవన్‌ హితవు పలికారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles