Covid-19: RBI Announces Moratorium On Loans కరోనా ఉద్దీపన: 3 నెలల ఈఎంఐలు చెల్లింపు వాయిదా

From halt in emis to rate cut key takeaways from rbi

Coronavirus social media, PM Garib Kalyan Package, Coronavirus economic package, PF contribution package, Nirmala Sitharaman, Coronavirus, coronavirus india, coronavirus in india, coronavirus update, coronavirus news, coronavirus tips, coronavirus cases, coronavirus update india, coronavirus symptoms, coronavirus latest, coronavirus india news, india coronavirus cases, coronavirus mumbai, coronavirus update in india, coronavirus live, coronavirus latest news, coronavirus cases in india, symptoms of coronavirus, coronavirus pune, coronavirus deathcoronaviurs, covid19, Reserve Bank of India, share market news, Business, economy, finance, IPO, sensex, PM Modi, Nirmala Sitharaman

RBI governor Shaktikanta Das today announced a series of measures massive to counter the economic slowdown caused by the novel coronavirus pandemic. Repo rate and reverse repo rate have been cut by 74 bps and 90 bps respectively. All commercial banks and lending institutions can now allow a three-month moratorium on all loans outstanding on 1 March 2020.

కరోనా నేపథ్యంలో ఆర్బీఐ ప్రకటన: 3 నెలల ఈఎంఐలు చెల్లింపు వాయిదా

Posted: 03/27/2020 01:59 PM IST
From halt in emis to rate cut key takeaways from rbi

కరోనా భయంతో అల్లాడుతున్న ఉద్యోగులకు, చిన్నసంస్థలకు, పేద, బీద, రైతులు, డ్వాక్రా సంఘాలు, వృద్దులు, వితంతువులు, వికలాంగుల కోసం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం.. బాటలో ఆర్బీఐ కూడా పయనిస్తోంది. కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే చర్యల్లో భాగంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు కీలక ప్రకటన చేసింది. ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్ నేతృత్వంలోని బృందం మూడు నెలలు ఈఎమ్ఐ కట్టక్కర్లేదు అంటూ ప్రకటన చేసింది. ఆర్థిక స్థిరత్వం కోసం అవసరమైన చర్యలు అన్నీ తీసుకుంటామని ప్రకటించిన శక్తికాంత దాస్.. మార్కెట్లోకి రూ.3.75 లక్షల కోట్లను పంపింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

కరోనా మహమ్మారి ఆర్బీఐ అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తోందని వెల్లడించారు. కరోనా కారణంగా ప్రపంచ దేశాలు సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి ఉందని, ఇలాగే ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్లోకు నగదు పంపింగ్, ఈఎంఐలపై భారీ ఊరట కల్పించారు. అన్నిరకాల టర్మ్ లోన్ల ఈఎంఐలపై మార్చి నుండి మూడు నెలల పాటు మారటోరియం ఉంటుందని వెల్లడించారు. సామాన్యులకు ఊరట ఇచ్చేలా మూడు నెలలపాటు అన్ని బ్యాంకులు, రుణ సంస్థలు తాత్కాలిక నిషేధాన్ని అనుమతించవచ్చు అని ఆర్బిఐ గవర్నర్ స్పష్టం చేశారు.

రియల్ ఎకానమీకి ఆర్థిక ఒత్తిడి లేకుండా చెయ్యడానికి రుణ భారాన్ని తగ్గించి, రుణగ్రహీతలకు ఉపశమనం కలిగించినట్లు చెప్పారు.పేద, మధ్య తరగతి ప్రజలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే రెపో రేటును తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. రెపో రేటును 75శాతం బేసిస్ పాయింట్లకు తగ్గించి 4.40శాతానికి తీసుకొచ్చినట్లు చెప్పారు. రివర్స్ రెపో రేటును కూడా 90శాతం తగ్గించామని అన్నారు. కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రణాళికలను సిద్దం చేయడం, మార్కెట్లలో లిక్విడిటీ స్థిరత్వం, బ్యాంకుల రుణాల ప్రక్రియలో నిలకడ,చెల్లింపుల్లో సడలింపు చర్యలు, మార్కెట్ అస్థిరతను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles