ITR filing deadline for FY19 extended till 30 June ఐటీ ఫైలింగ్ గడువు పెంపు.. కేంద్ర ఆర్థిక ఉద్దీపన పథకం

Gst return filing date extended relief from late fee penalties

corornavirus, covid -19, income tax, Last date for filing ITR, interest rate, FM Nirmala Sitharaman, financial year 2018-19, coronavirus news, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

Good news for taxpayers in the Coronavirus crisis. The last date to file Income Tax Return (ITR) for the financial year 2018-19 has been extended. Finance Minister Nirmala Sitharaman in a press conference has announced that the last date for filing tax returns has been extended to June 30, 2020. The interest rate for delayed payment has also been reduced from 12 per cent to 9 per cent.

ఐటీ ఫైలింగ్ గడువు పెంపు.. కేంద్ర ఆర్థిక ఉద్దీపన పథకం

Posted: 03/24/2020 03:44 PM IST
Gst return filing date extended relief from late fee penalties

కరోనా వైరస్ నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితి అతలాకులం కాకుండా ఆర్థిక ప్యాకేజీని త్వరలో కేంద్రం ప్రకటించనుందని, ఈ మేరకు ఇప్పటికే ఉద్దీపన పథకాలపై కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకే లాక్‌డౌన్‌ ప్రకటించినట్లు సీతారామన్‌ స్పష్టం చేశారు. దిల్లీలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌తో కలిసి సీతారామన్‌ మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన పథకాలు ప్రకటించనున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

దీనిలో భాగంగా తీసుకున్న నిర్ణయాలను సీతారామన్‌ మీడియాకు వివరించారు. ‘2018-19 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్నుల దాఖలుకు 2020 జూన్‌ 30 వరకు గడువు పొడిగించాం. ఈ వ్యవధిలో పన్ను చెల్లింపుల ఆలస్య రుసుము 12 నుంచి 9 శాతానికి, టీడీఎస్‌ జమలో ఆలస్య రుసుమును 18 నుంచి 9 శాతానికి తగ్గించాం. ఆధార్‌-పాన్‌ అనుసంధానం, ‘వివాద్ సే విశ్వాస్‌’ పథకం గడువును జూన్‌ 30 వరకు పొడిగించాం. పన్ను వివాదాల మొత్తాల చెల్లింపుల్లో 10 శాతం అదనపు రుసుం తొలగించాం. మార్చి, ఏప్రిల్‌, మే జీఎస్టీ రిటర్న్‌ల దాఖలు గడువు జూన్‌ 30 వరకు పొడిగించామని’’ అన్నారు.

కాంపొజిషన్‌ స్కీమ్‌ రిటర్న్‌ల దాఖలుకు కూడా జూన్‌30 వరకు గడువును పొడిగించామని కేంద్ర విత్త మంత్రి తెలిపారు. రూ. 5 కోట్ల టర్నోవర్‌ ఉన్న కంపెనీలపై పన్ను చెల్లింపు ఆలస్య రుసుములు ఉండవన్నారు. రూ. 5 కోట్ల టర్నోవర్‌ పైబడిన పెద్ద కంపెనీలకు పన్ను చెల్లింపులపై వడ్డీ, అపరాధ రుసుం 9 శాతానికి తగ్గించామని సీతారామన్‌ తెలిపారు. ఖాతాదారులు అన్ని ఏటీఎంలలో నుంచి నగదు తీసుకోవచ్చని.. మూడు నెలల పాటు ఎలాంటి ఛార్జీలు వర్తించవని స్పష్టం చేశారు. బ్యాంకుల్లో కనీస నిల్వ ఉంచాల్సిన అవసరం కూడా లేదని సీతారామన్‌ వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles