hydroxychloroquine for prevention of COVID-19 కరోనా నివారణకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడొచ్చా.? ముప్పుందా.?

Covid 19 the bitter truth about using hydroxychloroquine as a preventive drug

Coronavirus social media,Coronavirus, coronavirus india, coronavirus in india, coronavirus update, coronavirus news, coronavirus tips, coronavirus cases, coronavirus update india, coronavirus symptoms, coronavirus latest, coronavirus india news, india coronavirus cases, coronavirus mumbai, coronavirus update in india, coronavirus live, coronavirus latest news, coronavirus cases in india, symptoms of coronavirus, coronavirus pune, coronavirus death

Hydroxychloroquine is slightly more tolerable, but is equally dangerous in its side effects if taken without supervision, as is an entire class of anti-malarial drugs. It also bears similarities in its mode of action against malaria to the world’s first anti-malarial drug--quinine.

కరోనా నివారణకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడొచ్చా.? ముప్పుందా.?

Posted: 03/24/2020 01:49 PM IST
Covid 19 the bitter truth about using hydroxychloroquine as a preventive drug

కరోనా భయంతో అల్లాడుతున్న వారికి ఇది శుభవార్తే. ఈ మహమ్మారి బారి నుంచి తప్పించుకునేందుకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ సమర్థంగా పనిచేస్తుందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. కరోనా వైరస్‌పై తాము ఏర్పాటు చేసిన జాతీయ బృందం దీనిని సిఫారసు చేసినట్టు పేర్కొంది. దీనికి భారత ఔషధ నియంత్రణ మండలి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వివరించింది. దీని వాడకానికి సంబంధించి తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా బాధితులకు, అనుమానితులకు, వైద్య సేవలు అందించే వారిలో కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఇవ్వొచ్చని తెలిపింది.

కరోనా రోగుల బంధువులు కూడా తీసుకోవచ్చని పేర్కొంది. అయితే, దీనిని సంబంధిత వైద్యుల సూచన మేరకే వేసుకోవాలని హెచ్చరించింది. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వినియోగిస్తున్న సమయంలో ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది. వైద్య సేవలు అందిస్తున్న వారు తొలి రోజు రెండుసార్లు 400 మిల్లీగ్రాముల చొప్పున వాడాలని, ఆ తర్వాత ఏడు వారాలపాటు వారానికి ఒకసారి 400 ఎంజీ భోజనంతో కలిపి తీసుకోవాలని సూచించింది.

రోగులతో కలిసి ఉంటున్న కుటుంబ సభ్యులు తొలి రోజు రెండుసార్లు 400 మిల్లీగ్రాములు, ఆ తర్వాత మూడు వారాలపాటు వారానికి 400 ఎంజీ చొప్పున భోజనంతో పాటు ఈ మందు తీసుకోవాలని వివరించింది. అయితే, 15 ఏళ్లలోపు చిన్నారుల్లో మాత్రం కోవిడ్ ముందస్తు నివారణ కోసం ఈ ఔషధాన్ని ఉపయోగించకూడదని హెచ్చరించింది. కాగా, బనర్జీ అనే 69 ఏళ్ల వైద్యుడు మాత్రం ఈ ఔషదాన్ని తీసుకుంటే మరణాన్ని తీసుకున్నట్లేనని అభిప్రాయపడ్డారు. ఈ మందు డోసేజ్ కాసింత ఎక్కువైనా.. మరణం తప్పదని హెచ్చరించారు. ఎప్పుడో మలేరియా ప్రపంచాన్ని కబళించిన నేపథ్యంలో ఈ మందును వాడినట్లు ఆయన తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles