Railways increases platform ticket prices ప్లాట్ ఫాం టికెట్ ధరలకు రెక్కలు.. అమాంతం పెంపు

Railways increases platform ticket prices cancels trains to prevent covid 19 from spreading

Railway platform ticket price, Platform ticket Indian railways, Central Railways, mumbai, Platform ticket price, Latest railways updates, Coronavirus outbreak, Infectious diseases, Coronavirus, covid-19, coronavirus pandemic, foreigners quarantine, coronavirus cases, coronavirus latest, coronavirus updates, India coronavirus, coronavirus in India

The central, western, south central railways increased the price of platform tickets to Rs 50 from Rs 10 at a number of stations with effect from Tuesday. The west-central railway increased prices of platform tickets in its Jabalpur and Bhopal divisions to Rs 50.

ప్లాట్ ఫాం టికెట్ ధరలకు రెక్కలు.. అమాంతం పెంపు

Posted: 03/17/2020 08:14 PM IST
Railways increases platform ticket prices cancels trains to prevent covid 19 from spreading

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 250 రైల్వేస్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్‌ ధరను భారీగా పెంచింది. దీంతో రైల్వే స్టేషన్లలో అనవసరంగా ఏర్పడే రద్దీని నియంత్రణ చేస్తోంది. అంతేకాదు పలు రైళ్లను కూడా రద్దు చేసింది. దీంతో కూడా రైల్వే స్టేషన్లకు వచ్చే ప్రయాణికుల రద్దీని నియంత్రించే పనిలో పడింది భారతీయ రైల్వే శాఖ. రద్దీ నియంత్రణతో పాటు శరవేగంగా సోకుతూ అనేక మందిని తన బారిన పడేస్తున్న కరోనా వైరస్ ప్రబలకుండా నియంత్రించేందుకు ఈ నిర్ణయాలను తీసుకుంది.

ప్రస్తుతం ఉన్న రూ.10 నుంచి రూ.50లకు పెంచుతున్నట్లు రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. సికింద్రాబాద్‌ సహా ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే స్టేషన్లలో ఈ ధరను అమలు చేయనున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్లాట్‌ఫాంపై రద్దీని తగ్గించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పెంచిన ధర రేపటి నుంచి అమల్లోకి రానుంది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు పెంచిన ధర అమల్లో ఉంటుందని రైల్వేశాఖ స్పష్టం చేసింది.

రైల్వేకు ఉన్న ఆదాయ వనరుల్లో ప్లాట్‌ఫాం టికెట్లు ఒకటి. సాధారణంగా పండగల సందర్భంలో రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో రైల్వేశాఖ ఆయా రోజుల్లో ప్లాట్‌ఫాం టికెట్ల ధరలను పెంచి, మళ్లీ పండగ సీజన్‌ అయిపోగానే యథావిధిగా మారుస్తుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రైల్వేస్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రైల్వేస్టేషన్లకు అనవసరంగా వచ్చే ప్రయాణికులను నియంత్రించడంతో పాటు కరోనా వైరస్ వ్యాప్తిని కూడా కట్టడి చేయనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles