Nirbhaya case: Mukesh Singh moves court yet again నిర్భయ ఘటనకు తాను పాల్పడలేదని ముఖేష్ పిటీషన్

Nirbhaya convict mukesh singh moves court saying he wasn t in delhi when crime occured

Nirbhaya convicts, Execution, Pawan Gupta, Curative petition, Supreme court, Patiyala Court, Death Sentence, Tihar Jail authorities, Nirbhaya case convicts, Tihar jail, Nirbhaya convicts hanging, Nirbhaya case, Nirbhaya convicts Curative petition, Satish Kumar Arora, Supreme Court, nirbhaya murder case Pawan Gupta, Mukesh singh, Vinay Sharma, Akshay Thakur, Nirbhaya, Murder, Rape, gang-rape, Tihar jail, Crime

Mukesh Singh, one of the four convicts in the 2012 Nirbhaya gang rape and murder case, on Tuesday moved a Delhi court seeking quashing of his death sentence on the pretext that he was not present in the national capital when the crime took place on December 16 that year.

నిర్భయ కేసు: ఘటనకు తాను పాల్పడలేదని ముఖేష్ పిటీషన్

Posted: 03/17/2020 09:02 PM IST
Nirbhaya convict mukesh singh moves court saying he wasn t in delhi when crime occured

నిర్భయ అత్యాచరం హత్యకేసులోని నలుగురు దోషులకు మరణశిక్ష అమలు చేసేందుకు తేదీ సమీపిస్తున్న తరుణంలో మరో ఎత్తు వేస్తున్నారు దోషులు. ఇప్పటికే ముఖేష్ సింగ్ మినహా మిగతా ముగ్గురు దోషుల తల్లిదండ్రులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాయడంతో పాటు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. అది చాలదన్నట్లో లేక ఉరి తప్పదన్న ఖచ్చిత సమాచారంతోనే శిక్ష తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నలుగురు దోషుల్లో ఒకడైన ముకేశ్‌ సింగ్‌ తాజాగా ఢిల్లీ కోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశాడు.

నిర్భయ అత్యాచార ఘటన జరిగిన డిసెంబరు 16న తాను దిల్లీలోనే లేనని పిటిషన్లో చెప్పుకొచ్చాడు. డిసెంబర్‌ 17, 2012న రాజస్థాన్‌ నుంచి పోలీసులు తనని ఢిల్లీ తీసుకొచ్చారని పేర్కొన్నాడు. తిహార్ జైలులో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో తనకు మరణశిక్ష రద్దు చేయాలని కోరాడు. ఈ మేరకు ఢిల్లీలోని పటియాలా హౌజ్‌ కోర్టు అడిషనల్‌ సెషన్స్‌ న్యాయమూర్తి ధర్మేంద్ర రాణా ముందు తన పిటిషన్ను దాఖలు చేశాడు. ఈ నెల 20న ఉదయం 5:30గంటలకు ఉరితీయాలని మార్చి 5న ట్రయల్‌ కోర్టు డెత్‌ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

నిర్భయ దోషులు అక్షయ్‌ ఠాకూర్‌ (31), పవన్‌ గుప్తా (25), వినయ్‌ శర్మ (26), ముకేశ్‌సింగ్‌ (32) మరణశిక్ష తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ వచ్చారు. న్యాయపరమైన అవకాశాల పేరిట వారు పిటిషన్లు దాఖలు చేయడంతో ఉరి అమలు తేదీ మూడుసార్లు వాయిదా పడింది. చివరకు ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తలుపులు కూడా తట్టారు. తమకు ఉరిశిక్ష విధింపు చట్టవిరుద్ధమని, నిలిపివేయాలని ఐసీజేను కోరారు. దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ ఈ మేరకు ఒక పిటిషన్‌ దాఖలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles