Supreme Court issues notice to Kamal Nath govt అవిశ్వాసానికి చెక్ పెట్టిన సుప్రీం.. సర్కారుకు నోటీసులు

Madhya pradesh floor test sc issues notice to kamal nath hearing tomorrow

Madhya Pradesh | Madhya Pradesh Political crisis | Madhya Pradesh government formation | Kamal Nath | Chief Minister Kamal Nath | Jyotiraditya Scindia | Jyotiraditya Scindia BJP | Jyotiraditya Scindia leaves Congress | Madhya Pradesh news, Kamal Nath, Chief Minister, Governor, Lalji Tandon, Jyotiraditya Scindia, BJP, Bengaluru, Madhya Pradesh, Politics

The Supreme Court on Tuesday issued notices to Madhya Pradesh Chief Minister Kamal Nath and Assembly Speaker NP Prajapati to respond within 24 hours to a plea by BJP MLAs seeking an immediate floor test.

అవిశ్వాసానికి చెక్ పెట్టిన సుప్రీం.. సర్కారుకు నోటీసులు

Posted: 03/17/2020 05:27 PM IST
Madhya pradesh floor test sc issues notice to kamal nath hearing tomorrow

మధ్యప్రదేశ్ లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలోని కమల్ నాథ్ ప్రభుత్వానికి స్వల్ప ఊరటనిచ్చారు స్పీకర్ ప్రజాపతి. అయితే ఈ గ్యాప్ లో తన ప్రభుత్వానికి కావాల్సినంత బలం వుందని, ఒకవేళ బలం లేదని భావిస్తే బీజేపినే తమ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టాలని పేర్కోంటున్నారు. ముఖ్యమంత్రి పీఠం చేజారడం ఖాయమే అయినా.. తమ ప్రభుత్వానికి బలం లేదన్న వార్తలు ప్రజల్లోకి వెళ్లితే.. బీజేపి నెత్తిన పాటు పోసినట్టు అవుతుందని భావిస్తున్న కమల్ నాథ్.. తన ప్రభుత్వానికి అవసరమైన సంఖ్యాబలం వుందని, ఈ విషయంలో బీజేపి సహా ప్రత్యర్థి పార్టీలకు అనుమానాలు వుంటే అవిశ్వాస తీర్మాణమే మార్గమని చెప్పారు.

సీనియర్ నేత జ్యోతిరాధిత్య సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో పాటు మంత్రులతో కలసి అజ్ఞాతంలోకి వెళ్లడంతో.. ఆ తరువాత ఆయన నేరుగా కేంద్రమంత్రి అమిత్ షా తోపాటు ప్రధాని నరేంద్రమోడీని కలవడం.. ఆ వెంటనే రాజ్యసభ స్థానాన్ని కైవసం చేసుకోవడం.. ఇక తన వర్గంతో బీజేపికి మద్దతు పలకడం ఇలా అన్ని పనులు చకచకా జరిగిపోతున్న నేపథ్యంలో తన ప్రభుత్వానికి సంక్షోభం తప్పదని భావిస్తున్న కమల్ నాథ్ చిట్టచివరికి మైండ్ గేమ్ అడుతున్నారు. ఇంధులో భాగంగా తన ప్రభుత్వానికి సంఖ్యాబలం వుందని వాదిస్తున్నారు.

ఈ మేరకు క్రితం రోజు రాత్రి మద్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండన్ ను కలసిని ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ తన వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేసిందని ఆరోపించిన ఆయన, అవిశ్వాస తీర్మానం పెట్టుకుంటే, ఎవరి బలం ఏమిటో అసెంబ్లీ వేదికగానే తేలుతుందని, తాను బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఏంటని గవర్నర్ ను ప్రశ్నించారు. ఇక సోమవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలలో సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ప్రసంగించడంతో.. కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అధికార, విఫక్ష సభ్యుల అందోళనల మధ్య సభను పది రోజల పాటు స్పీకర్ వాయిదా వేశారు.

కాగా, మధ్యప్రదేశ్‌లోని అధికార కమల్ నాథ్ ప్రభుత్వానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు షాక్ తగిలింది. అసెంబ్లీలో బల పరీక్ష అంశంపై కమల్ నాథ్ సర్కారుకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. 24 గంట్లలో దీనిపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అసెంబ్లీలో తక్షణం బలపరీక్ష నిర్వహించేలా ఆదేశాలివ్వాలంటూ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ దాఖలు చేసిన పిటిషన్ ను అత్యవసరంగా విచారించిన జస్టిన్ డీవై చంద్రచూడ్, హేమంత్ గుప్తాతో కూడిన ధర్మాసనం దీనిపై సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని అదేశించింది.

అందుకు 24 గంటల పాట సమయాన్ని కేటాయించిన ప్రభుత్వం బుధవారం 10.30 నిమిషాల లోపు సమాధానం చెప్పాలని కమల్ నాథ్ సర్కారును ఆదేశించింది. దీంతో ఈ పిటీషన్ పై విచారణను బుధవారానికి వాయిదా వేసింది. మరోవైపు కమల్ నాథ్ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టుగా తమపై ఎవ్వరూ ఒత్తిడి తేవడంలేదని శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన 16 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సుపీంకోర్టుకు తెలియజేశారు. దాంతో, కాంగ్రెస్‌ సర్కారుకు మరిన్ని చిక్కులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రేపు సుప్రీంకోర్టుకు ఎలాంటి సమాధానం ఇస్తుందనేది ఆసక్తిగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Nath  Chief Minister  Governor  Lalji Tandon  Jyotiraditya Scindia  BJP  Bengaluru  Madhya Pradesh  Politics  

Other Articles