Nirbhaya case: SC rejects plea of Mukesh Singh రాష్ట్రపతికి నిర్భయ దోషుల కుటుంబసభ్యుల లేఖలు

Nirbhaya case three convicts knock icj s door ahead of execution day

Nirbhaya convicts, Execution, Pawan Gupta, Curative petition, Supreme court, Patiyala Court, Death Sentence, Tihar Jail authorities, Nirbhaya case convicts, Tihar jail, Nirbhaya convicts hanging, Nirbhaya case, Nirbhaya convicts Curative petition, Satish Kumar Arora, Supreme Court, nirbhaya murder case Pawan Gupta, Mukesh singh, Vinay Sharma, Akshay Thakur, Nirbhaya, Murder, Rape, gang-rape, Tihar jail, Crime

Three convicts have approached the International Court of Justice (ICJ) seeking stay on the execution of their death sentence. The three convicts who approached the ICJ are Akshay, Pawan and Vinay. Meanwhile Supreme court rejects mukesh singh petition on his lawyer.

నిర్భయ కేసు: అంతర్జాతీయ న్యాయన్థానాన్ని ఆశ్రయించిన దోషులు

Posted: 03/16/2020 03:47 PM IST
Nirbhaya case three convicts knock icj s door ahead of execution day

దేశవ్యాప్తంగా పెనుసంచలనం రేపిన నిర్భయ అత్యాచరం హత్యకేసులోని నలుగురు దోషులకు మరణశిక్ష అమలు చేసేందుకు తేదీ సమీపిస్తున్న తరుణంలో దోషుల తల్లిదండ్రులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాశారు. ఢిల్లీలోని పాటియాల కోర్టు గత మూడు పర్యాయాలు జారీ చేసిన డెత్ వారెంట్ వాయిదా పడిన నేపథ్యంలో నాలుగో పర్యాయం జారీ చేసిన డెత్ వారెంట్ అయినా అములుకు నోచుకునేనా.? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జనవర్ 22న దోషులను ఉరి తీయాలని తొలుత డెత్ వారెంట్ జారీ అయ్యింది.

పలు కారణాల చేత అది వాయిందా పడింది. ఆ తరువాత ఫిబ్రవరి 1వ తేదీన, మార్చి 3వ తేదీన రెండు, మూడవ డెత్ వారెంట్లు జారీ అయ్యాయి. ఇవి కూడా వాయిదా పడటంతో ఇటీవల నాలుగో పర్యాయం మార్చి 20వ తేదీని దోషులకు మరణశిక్ష అమలు చేయాలని న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే శిక్ష నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తున్న దోషులు మరో కొత్త ఎతుగడ వేస్తున్నారు. దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ తమకు మరణశిక్ష నుంచి ఉపశమనం లభించకపోవడంతో.. ఇక వారు అంతర్జాతీయ న్యాయస్థాన తలుపుతట్టారు.

దోషుల్లో ముఖేష్ మినహాయ ముగ్గురు దోషులు పవన్ కుమార్ గుప్తా, అక్షయ్ సింగ్, వినయ్ వర్మలు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించి తమ ఉరిశిక్షపై స్టే విధించాలని కోరారు. ఇప్పటికే ముఖేష్ సింగ్ తన కేసులను వాదిస్తూ వచ్చిన న్యాయవాది వింద్యా గ్రోవర్ పైనే కేసు వేసి.. ఆయన తనను కేసులో పూర్తిగా తప్పుదోవ పట్టించారని, పోలీసులతో కుమ్మకై కేసును ఓడిపోయేలా చేశారని అరోపించాడు. అయితే ముఖేష్ సింగ్ దాఖలు చేసిన పిటీషన్ ను న్యాయస్థానం ఇవాళ కొట్టివేసింది.  

అక్కడితో ఆగని దోషి ముఖేష్.. తనకు మరో న్యాయవాదిని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాలని కోరడంతో పాటు ఆయనతో మరోమారు కేసు పునర్విచారణకు అవకాశం ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో దోషులకు ఈ నెల 20 ఉదయం ఐదున్నర గంటలకు మరణశిక్ష అమలు చేయాలన్న న్యాయస్థానం తాజా అదేశాల నేపథ్యంలో.. దోషుల కుటుంబసభ్యులు మరో ఎత్తుగడ వేశారు. తమకు కారుణ్య మరణం పొందేందుకు అనుమతించాలంటూ నిర్భయ దోషుల కుటుంబసభ్యులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాశారు.

లేఖ రాసిన వారిలో నలుగురు దోషుల తల్లిదండ్రులు, పిల్లలు, తోబుట్టువులు ఉన్నారు. మన దేశంలో పెద్ద తప్పులు చేసిన వారికి కూడా క్షమాభిక్షను ప్రసాదించారని లేఖలో వారు పేర్కొన్నారు. ప్రతీకారం అనేది అధికారానికి నిర్వచనం కాదని... క్షమించడంలో కూడా అధికారం ఉందని చెప్పారు. నలుగురు దోషులు పెట్టుకున్న క్షమాభిక్షలను రాష్ట్రపతి ఇప్పటికే తిరస్కరించిన నేపథ్యంలో దోషులు కుటుంబసభ్యులు ఈ ఎత్తుగడ వేశారు. దోషులకు మరణశిక్ష అమలు నిమిత్తం తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నలుగురు దోషులకు ఒకేసారి మరణశిక్ష అమలుచేసేందుకు వీలుగా ఇప్పటికే ట్రయల్స్ కూడా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles