Coronavirus May Have Saved the Day for Kamal Nath కమల్ నాథ్ సర్కారుకు ఊరట.. బీజేపి న్యాయపోరాటం..

Kamal nath gets 10 day break over coronavirus bjp goes to sc

Madhya Pradesh Political crisis, Madhya Pradesh government formation, Kamal Nath, Chief Minister Kamal Nath, Governor, Lalji Tandon, speaker NP prajapati, supreme court, BJP MPs, Jyotiraditya Scindia, Jyotiraditya Scindia BJP, Madhya Pradesh news, Madhya Pradesh, Politics

The Kamal Nath-led Congress government in Madhya Pradesh scored a 10-day reprieve today as the assembly session was adjourned without any trust vote until March 26 over coronavirus, after a one-minute address by Governor Lalji Tandon.

కమల్ నాథ్ సర్కారుకు కోవిడ్ ఊరట.. బీజేపి న్యాయపోరాటం..

Posted: 03/16/2020 02:59 PM IST
Kamal nath gets 10 day break over coronavirus bjp goes to sc

మధ్యప్రదేశ్ లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలోని కమల్ నాథ్ ప్రభుత్వానికి స్వల్ప ఊరట లభించింది. ప్రపంచవ్యాప్తంగా మానవళికి చేటు చేస్తున్న కోవిడ్ -19 మధ్యప్రదేశ్ లోని కమల్ నాథ్ సర్కార్ నెత్తిన మాత్రం పాలుపోసింది. ముఖ్యమంత్రి పీఠం చేజారడం.. తాజాగా రాజ్యసభ సీటు కూడా అందకపోవడంతో.. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపిలోకి వెళ్లిన జ్యోతిరాధిత్య సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లడంతో సంక్షోభంలో పడిన ప్రభుత్వం..ఇవాళ ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో.. బలనిరూపణ చేసుకోవాల్సి వుంది.

అయితే అసెంబ్లీకి వచ్చిన మద్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండన్.. సభను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్‌ లాల్జీ టాండన్‌ రాజ్యాంగం నిర్ధేశించిన నియమాలను అందరూ గౌరవించి మధ్యప్రదేశ్‌ ప్రతిష్టను నిలపాలని సూచిస్తూ బలపరీక్ష తక్షణమే చేపట్టాలని స్పీకర్‌ను కోరారు. పూర్తి ప్రసంగ పాఠం చదవకుండా కేవలం చివరి పేజీని చదవి అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని కోరారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు గవర్నర్ తీరుపట్ల అసహనం వ్యక్తం చేస్తూ వెల్ లోకి వచ్చి పెద్దపెట్టున ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కాగా స్పీకర్‌ విధుల్లో జోక్యం చేసుకోరాదని ముఖ్యమంత్రి కమల్ నాథ్‌ గవర్నర్‌ లాల్జీ టాండన్ కు రాసిన లేఖలో కోరారు. ఇక సభను గౌరవించాలని కాంగ్రెస్‌ సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేస్తుండగా బలపరీక్ష జరపాలని పట్టుపట్టిన గవర్నర్‌ అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు. ఆ వెంటనే అసెంబ్లీ స్పీకర్ ఎన్ఆర్ ప్రజాపతి.. కరోనా వైరస్ నేపథ్యంలో అసెంబ్లీని పది రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన బలపరీక్షకు బ్రేక్‌ పడింది.

బీజేపీ సభ్యుల అభ్యంతరాలు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల నినాదాల మధ్య రాష్ట్రంలోని కరోనా వైరస్ నేపథ్యంలో సభను ఈనెల 26కు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు. 22 మంది కాంగ్రెస్‌ రెబెల్‌ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో బీజేపీ గూటికి చేరడంతో విశ్వాస పరీక్షపై ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. తమ ప్రభుత్వానికి ఢోకా లేదని బలపరీక్షకు తాను సిద్ధమని మధ్యప్రదేశ్‌ సీఎం కమల్ నాథ్‌ పేర్కొన్నారు. కాగా ప్రభుత్వం పడిపోతుందనే భయంతోనే బలపరీక్షకు కాంగ్రెస్‌ ప్రభుత్వం వెనుకాడుతోందని మాజీ సీఎం, బీజేపీ నేత శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ విమర్శించారు.

ఇక కమల్ నాథ్ సర్కార్ వేసిన ఎత్తును బీజేపి ఎమ్మెల్యేలకు ఊహించని పరిణామంగా మారింది. ఇప్పటికే పది రోజులకు పైగా సాగుతున్న ఈ డ్రామా నేపథ్యంలో బెంగళూరు రిసార్టులో వున్న ఎమ్మెల్యేలను బంధించారని అరోపణలు చేస్తోంది కాంగ్రెస్. బలపరీక్ష నేపథ్యంలో రాష్ట్రంలోని వచ్చిన ఎమ్మెల్యేలను బుజ్జగించి తిరిగి పార్టీలోకి అహ్వానించాలని కమల్ నాథ్ సర్కార్ సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇదిలావుండగా, బీజేపి మాత్రం బలనిరూపణ విషయంలో న్యాయపోరాటానికి సిద్దం అయ్యింది. కమల్ నాథ్ సర్కార్ బలాన్ని నిరూపించుకునేలా అదేశించాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles