Coronavirus kills 6 in Washington state అగ్రరాజ్యంలో అరుగురిని కబళఇంచిన కరోనా..

Washington county declares state of emergency as coronavirus death toll rises

covid -19, covid 19 deaths in US, corona cases in America, corona in United states, Kirkland, viruses, death, coronavirus, Washington, China, health, Washington State University, schools, high school

A viral outbreak that began in China has since spread to every continent across the globe except Antarctica, infecting nearly 90,000 people. Although the spread of the novel coronavirus appeared to be slowing down in China, it has picked up speed elsewhere in the world, including United States.

అగ్రరాజ్యంలో కరోనా ఘంటికలు.. వాషింగ్టన్లో ఆరుగురి మృతి

Posted: 03/03/2020 02:53 PM IST
Washington county declares state of emergency as coronavirus death toll rises

కొవిడ్‌-19(కరోనా) వైరస్‌ అంటార్టికా ఖండాన్ని తప్ప ప్రపంచ వ్యాప్తంగా మిగిలిన అన్ని దేశాలను గడగడలాడిస్తోంది. చైనాలోని వుహాన్ లో పురుడుపోసుకున్న కరోనా వైరస్.. ఆదేశంలోనే ఏకంగా మూడు వేల మంది ప్రాణాలను బలిగొనింది. అయితే ఇవాళ అత్యంత అల్పంగా 125 కేసులు మాత్రమే నమోదుకాగా, చైనా మినహాయించి ప్రపంచవ్యాప్తంగా మాత్రం ఈ వైరస్ జడలు విప్పుతూ కరళానృత్యం చేస్తోంది. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలోనూ కోవిడ్-19 బారినపడి ఇప్పటి వరకు ఆరుగురు అసువులు బాసారు.

అగ్రరాజ్యంలో కరోనా సోకి మరణించిన ఆరుగురు మృతులు వాషింగ్టన్‌ రాష్ట్రానికి చెందినవారే కావడంతో ఆ రాష్ట్రంలో వైద్య విభాగపు అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇక అమెరికాలో మొత్తం 91 మందికి వైరస్ సోకినట్లు ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ వెల్లడించారు. అయితే వీరందరూ కాలిఫోర్నియా, ఓరిగాన్, ప్లోరిడా రాష్ట్ర్లో వున్నారని తెలిపారు. మొత్తం 91మందిలో 43 మందికి అమెరికాలోనే కరోనా సోకగా.. మరో 48 మంది విదేశాల నుంచి తిరిగొచ్చిన వారని తెలిపారు. అమెరికాలో తొలి మరణం శనివారం సంభవించిన విషయం తెలిసిందే.

ఇకపై అమెరికాలోకి వచ్చే ప్రతీ విదేశీ ప్రయాణికులతో పాటు.. విదేశాలకు వెళ్లి వచ్చే వారందరినీ ఎయిర్ పోర్టులోనే స్ర్కీనింగ్ చేస్తామని చెప్పారు. మరోవైపు కొవిడ్‌-19కు వచ్చే వేసవి లేదా వర్షాకాలం ఆరంభం నాటికి చికిత్స అందుబాటులోకి వస్తుందని పెన్స్‌ తెలిపారు. వాక్సిన్‌ కోసం మాత్రం ఈ ఏడాది చివరి వరకూ వేచి చూడాల్సిందేనన్నారు. ఇప్పటికే పలు రకాల ఔషధాలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారని వెల్లడించారు. అమెరికాలో వేసవి జూన్‌ నుంచి ప్రారంభమవుతుంది.

చైనాలో కరోనా వైరస్ సోకిన వారిలో తాజాగా మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 2,943కు చేరింది. దక్షిణ కొరియాలో కొత్తగా 473 మందికి కరోనా సోకింది. దీంతో బాధితుల సంఖ్య అక్కడ 4,680 దాటింది.  పాకిస్థాన్‌లో కొత్తగా ఒక కేసు నమోదుకావడంతో బాధితుల సంఖ్య ఐదుకు చేరింది. ఇటు భారత్‌లోనూ రెండు కొత్త కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మన దేశంలో ఐదు కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వైరస్‌ను కట్టడి చేసేందుకు పటిష్ఠ చర్యలు ప్రారంభించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles