Prashant Kishor slams Nitish Kumar on Delhi violence ‘‘ఇంతటి హింసపై ఒక్క మాటా..’’ నితీశ్ పై ప్రశాంత్ కిశోర్ ఫైర్..

Prashant kishor slams nitish kumar for keeping mum on delhi violence

riots in delhi, Prashant Kishor slams Nitish, Prashant Kishor, Nitish Kumar, Delhi Violence, Delhi Riots, CAA Protests, NRC violence, Patna, Bihar Politics

Former JD(U) national vice-president Prashant Kishor criticized Bihar CM Nitish Kumar for not “saying a word on the Delhi violence” in his 100-minute speech during the party’s state-level “Karyakarta Sammelan” at Gandhi Maidan.

‘‘ఇంతటి హింసపై ఒక్క మాటా..’’ నితీశ్ పై ప్రశాంత్ కిశోర్ ఫైర్..

Posted: 03/03/2020 01:01 PM IST
Prashant kishor slams nitish kumar for keeping mum on delhi violence

సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా, అనుకూల వర్గాల మధ్య దేశరాజధాని ఢిల్లీలో చెలరేగిన అల్లర్లులో భాగంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుని ఏకంగా 46 మంది అందోళనకారుల చేతుల్లో బలైపోయారని.. అయినా వారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడరా.? అంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మండిపడ్డారు. చనిపోనియవారి కోసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణమన్నారు.

బీహార్ లో రానున్న ఎన్నికలలో భాగంగా ఇప్పటి నుంచే ప్రచారాన్ని చేస్తూ క్యాడర్ ను అప్రమత్తం చేసుకుంటున్న నితీష్.. కార్యకర్త సమ్మెళనంలో క్యాడర్ ను ఉద్దేశించి పాట్నాలోని గాంధీ మైదాన్ లో 100 నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో ఒక్క మాట కూడా ఢిల్లీలో చెలరేగిన హింసపై ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. ఇదే సమయంలో నితీశ్ కు ప్రశ్నలవర్షం కురిపించారు. వచ్చే ఎన్నికల్లో 200 స్థానాలు గెలుచుకుంటామని చెబుతున్న నితీశ్.. తన 15 ఏళ్ల పాలనలో బీహార్ ఇప్పటికీ ఎందుకు రాష్ట్రం వెనుకబడిందో చెప్పాలని ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని దశాబ్దమున్నర కాలం పాటు పాలించినా.. ఇంకా అన్ని రంగాల్లో వెనుకబాటులోనే వుందని, అభివృద్దిలో కొత్త పుంతలు తొక్కిస్తారని రాష్ట్ర ప్రజలు అధికారాన్ని అందించినా.. ఇంకా ఎదుగు, బోదుగు లేకుండా పేద రాష్ట్రంగానే మిగిలిపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం కాదా.? అని ప్రశ్నించారు. ఈ విషయమై నితీశ్ ఎప్పుడూ ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత వలసవెళ్లి జీవనాన్ని సాగిస్తున్న మాటల్లో వాస్తవం వుందా.? లేదా.? అని ప్రశాంత్ కిషోర్ ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles