Rajinikanth offers support meets Muslim leaders ముస్లిం పెద్దలకు రజనీ హామి.. శాంతి నెలకొల్పుదాం..

Delhi violence rajinikanth meets muslim leaders offers his support to them

CAA Protests, Delhi violence, Delhi Riots, delhi clashes, Rajinikanth, citizenship law, Central Government, Jamatul Ulama Sabai, Muslim Representative, peace return, Tamil Nadu, Politics

Days after he lashed out at the Central government over the violence in Delhi that left over 40 people dead superstar Rajinikanth met representatives of the Tamil Nadu Jamatul Ulama Sabai and assured themthat he would offer his support to help "peace return".

సీఏఏ అల్లర్లు: ముస్లిం పెద్దలకు రజనీ హామి.. శాంతి నెలకొల్పుదాం..

Posted: 03/02/2020 12:35 PM IST
Delhi violence rajinikanth meets muslim leaders offers his support to them

ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో రేగిన అల్లర్లతో యావత్ దేశంలో పలువురు దేశ ప్రజలను భయాందోళనలోకి నెట్టింది. అల్లర్ల మాటును అందోళనకారులు చేసిన ఆకృత్యాలను. ఘోరాలను కూడా బాధితులు వెలిబుచ్చుతున్నారు. ఆందోళనకారులు నిండు గర్భిణి కడుపుపై తన్నగా.. మిరాకిల్ బేబి జన్మించడం, ఓ తల్లి తన నలుగురు ఆడపిల్లలతో మోదటి అంతస్థు నుంచి దూకి స్థానికంగా తెలిసిన వారింటికి వెళ్లి తలదాచుకోవడం.. లాంటి ఘటనపై అనేకం మీడియా వెలుగులోకి తీసుకువచ్చింది.

అయితే ఈ ఘటనలను చదవడం.. మృతుల కటుంబాల ఆర్థనాధలు వినడం.. వారి ఆక్రంధనలను మీడియాలో చూసి.. చలించిపోయిన దక్షిణాధి సూపర్ స్టార్ రజనీకాంత్.. కేంద్రప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లర్లను అదుపు చేయలేకపోయిన వారు తమ పదవులకు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశరాజధానిలో నిఘావర్గాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించిన ఆయన.. అక్కడ శాంతిభద్రతల పర్యవేక్షణ చేస్తున్న కేంద్ర ప్రభుత్వమే ఈ ఘటనలకు పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

దేశంలో శాంతి స్థాపన కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. పలువురు ముస్లిం మతపెద్దలు రజనీతో భేటీ అయ్యారు. అనంతరం ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సూపర్ స్టార్.. దేశంలో ప్రేమ, సమైక్యత, శాంతి, సామరస్య స్థాపనకు తనవంతు పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. దేశంలో ప్రేమ, సమైక్యత, శాంతిని నెలకొల్పడమే ప్రజల తొలి ప్రాధాన్యంగా ఉండాలన్న ముస్లిం సోదరుల అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్టు రజనీ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles