Prakasam YCP leader birthday party videos goes viral వైసీపీ నేతల రిసార్ట్ పార్టీ.. అమ్మాయిలతో ఆటలేంటీ.?

Ap minister balineni follower bullet krishna reddy birthday party videos goes viral

AP Minister, Balineni srinivas reddy, YSRCP, Ongole, bullet krishna reddy, Birthday party, Bar girls, video viral, viral video, ongole, prakasam, Andhra pradesh, Crime, Politics

Andhra Pradesh minister Balineni srinivas reddy close aid and key follower bullet krishna reddy birthday party has created political and law and order tension in the state. Locals asks police on how they permitted this party. the party videos goes viral on net.

వైసీపీ నేతల రిసార్ట్ పార్టీ.. అమ్మాయిలతో ఆటలేంటీ.?

Posted: 03/02/2020 11:39 AM IST
Ap minister balineni follower bullet krishna reddy birthday party videos goes viral

ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి తమ అనుచరుల కారణంగా వార్తల్లో నిలిచారు. ఒంగోలు పట్టణంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో.. ప్రజలతో పాటు ప్రతిపక్షాలకు కూడా విమర్శించేందుకు అస్త్రాలను అందించినట్లు అయ్యింది. తన ముఖ్య అనుచరుడి పుట్టిన రోజు వేడుకల వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మంత్రి అనుచరులే ఇలా అమ్మాయిలతో కలసి డాన్సులు చేస్తూ, సభ్యసమాజం ఏమనుకుంటుందన్న విషయాన్ని పక్కనబెట్టి వ్యవహరించడంపై విమర్శలు పెల్లుబిక్కుతున్నాయి.

వివరాల్లోకి ఎంట్రీ ఇస్తే రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు నల్లమలుపు కృష్ణారెడ్డి అలియాస్ బుల్లెట్ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న తొలి పుట్టిన రోజు వేడుక నేపథ్యంలో ఆయన తమ పార్టీకి చెందిన ముఖ్యలకు, పార్టీ కీలక శ్రేణులకు కూడా మర్చిపోలేని విధంగా పార్టీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. అనుకున్నదే తడవుగా బర్త్ డే సెలబ్రేషన్స్ కు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని సముద్ర తీర ప్రాంతమైన కొత్తపట్నంలో ఉన్న నల్లూరి గార్డెన్ రిసార్ట్ లో పార్టీ చేసుకున్నారు.

ఇంతవరకు బాగానేవున్నా.. మందు, చిందు, విందు.. ఏంటంటే.. ప్రజాప్రతినిధులకు పర్సనల్ లైఫ్ వుండదా.? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తాయి. అయితే ఇక్కడ అంతకుమించి చేసిన అర్భాటమే అసలు సమస్యగా మారింది. బర్త్ డే పార్టీ సందర్భంగా రిసార్ట్ కు కొంతమంది అమ్మాయిలను తీసుకొచ్చారు.. వారి కలిసి అసభ్యకరమైన డ్యాన్స్‌లు చేస్తూ ఎంజాయ్ చేశారు. పోలీసులు ఇలాంటి పార్టీలకు ఎలా అనుమతి ఇచ్చారని కొందరు ప్రశ్నిస్తున్నారు. మంత్రి అనుచరుడు కావడంతో వదిలేస్తారా అంటూ ప్రతిపక్ష టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.. వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోలను తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles