High security at Chiranjeevi's house చిరంజీవి ఇంటివద్ద ఉద్రిక్తత.. భారీగా చేరుకున్న అభిమానులు..

Tension escalates at chiranjeevi s residence after amaravati jac protest

megastar, Chiranjeevi, jubilee hills, Amaravati JAC, Police security, Mega Fans, Amaravati Farmers agitations, Decentralisation, CRDA, Three Capital Plan, Amaravati, three capital, State Assembly, joint action committee, YS Jagan, ys jagan mohan reddy, chandrababu naidu, andhra pradesh capital, amaravati lands case, Chief Justice JK Maheshwari, Justice AV Sesha Sai, Justice M Satyanarayana Murthy, Supreme Court, Vijayawada, farmers, Andhra Pradesh, Politics

Tension triggered at Tollywood megastar Chiranjeevi's residence as hundreds of Chiranjeevi fans thronged to Jubiliee Hills to oppose the protest of Amaravati JAC against Chiranjeevi. Mega fans said that they won't tolerate anyone if they staged any protest in front of Chiranjeevi's residence.

చిరంజీవి ఇంటివద్ద ఉద్రిక్తత.. భారీగా చేరుకున్న అభిమానులు..

Posted: 02/29/2020 01:38 PM IST
Tension escalates at chiranjeevi s residence after amaravati jac protest

సినీ అగ్రహీరో, మెగాస్టార్ చిరంజీవి నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణ అలుముకుంది. ఆయన నివాసం ఎదుట ధర్నాను చేపడతామని పిలుపు నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తమ అభిమాన హీరో చిరంజీవి నివాసాన్ని ముట్టడిస్తామని అమరావతి జేఏసీ నేతలు వస్తున్నారన్న సమాచారంతో చిరంజీవి అభిమానులు, మెగా ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున చిరంజీవి నివాసం వద్దకు చేరుకున్నారు. దీంతో చిరంజీవి అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకుని అమరావతి రైతులను అడ్డుకునేందుకు సిద్దమయ్యారు. దీంతో చిరంజీవి నివాసం వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

ఇదిలావుండగా, మెగాస్టార్ చిరంజీవి నివాసం ముట్టడికి తాము పిలుపు ఇవ్వలేదని, కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని అమరావతి జేఏసీ నేతలు స్పష్టం చేశారు. సినీహీరోలు తమకు మద్దతుగా వుండాలని, తమ పోరాటానికి సానుకూలంగా వ్యవహరించాలని తాము కోరలేదని.. తమ పోరాటం ప్రభుత్వంపైన. ప్రభుత్వ నిర్ణయంపైనే కానీ.. ఏ సినీహరోతో కాదని అమరావతి రైతలు పేర్కొన్నారు. అమరావతి రైతులకు మద్దతుగా మొత్తం సినీపరిశ్రమే వుందని.. కానీ ఒక్క హీరో నివాసాన్ని తామెందుకు ముట్టడిస్తామని వారు ప్రశ్నిస్తున్నారు.

ఈ ప్రచారానికి జేఏసీకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అసత్య ప్రచారం చేస్తున్న అల్లరి మూకలపై చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల పోలీసులకు జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. రాజధాని అమరావతికి మద్దతుగా ప్రముఖ సినీనటుడు చిరంజీవి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ 29న ఉదయం 11 గంటలకు ఆయన నివాసం ముట్టడించాలని నిర్ణయించినట్లు అమరావతి యువ జేఏసీ పేరుతో సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే ఇది కేవలం రాజకీయ పార్టీల ప్రమేయంతోనే జరుగిందని.. మెగా ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles