Rowdy shot dead in alleged police encounter పోలీసుల ఎన్ కౌంటర్లో కరడుగట్టిన నేరస్థుడు హతం..

Notorious history sheeter slum bharath killed in police encounter

slum bharath killed bengaluru encounter, history sheeter slum bharat, bengaluru, Karnataka, Moradabad, Uttar Pradesh, Yash, KGF, movies, Entertainment, sandal wood, latest Crime news, tollywood, Crime

A notorious Bengaluru gangster was shot dead in an encounter after he allegedly attempted to escape police custody in an early morning chase through the city. Slum Bharat, who has over 50 criminal cases registered against him, died after suffering grievous gunshot wounds.

ITEMVIDEOS: సినీపక్కీలో తప్పించకున్న కరడుగట్టిన నేరస్థుడు.. పోలీసుల ఎన్ కౌంటర్..

Posted: 02/29/2020 12:35 PM IST
Notorious history sheeter slum bharath killed in police encounter

'కేజీఎఫ్' చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరును సంపాదించుకున్న కన్నడ స్టార్ యశ్ హత్యకు కుట్ర చేసి.. పలుమార్లు హెచ్చరించిన కరుడుగట్టిన నేరస్థుడు భరత్ అలియాస్ స్లమ్ భరత్ అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పోలీసులు ఎన్ కౌంటర్ లో మరణించాడు. ఓ కేసులో సీన్ రీ-కన్సట్రక్షన్ చేయడానికి వెళ్లిన పోలీసుల నుంచి తప్పించుకోవడంతో పాటు పోలీసులపై కాల్పులు జరిపి మరీ తప్పించుకున్నాడు. చివరకు పోలీసుల హెచ్చరికలను లెక్కచేయకుండా కానిస్టేబుల్ ను గాయపర్చడంతో గత్యంతరం లేక పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో భరత్ మరణించాడు. కన్నడనాట తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

గడచిన ఏడాదిగా యశ్ ను హత్య చేసేందుకు భరత్ ప్లాన్ చేస్తుండడంతో, తన ప్లాన్ ను అమలు చేయకముందే పోలీసులు దాన్ని భగ్నం చేశారు. కాగా, భరత్ పై ఓ మర్డర్ కేసు సహా 50కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న స్లమ్ భరత్ ను ఇటీవల అతన్ని ఉత్తర్ ప్రదేశ్ లోని మొరాదాబాద్ లో పోలీసులు అరెస్టు చేసి తీసుకువచ్చారు. ఓ హత్య కేసులో రౌడీ షీటర్ భరత్ ను పోలీసులు.. సీన్ రీ కన్ స్ట్రక్షన్ నిమిత్తం బయటకు తీసుకెళ్లారు. అయితే పోలీసులు సీన్ రీకన్స్ ట్రక్షన్ కోసం తీసుకెళ్తున్నారన్న సమాచారం అందుకున్న అతని అనుచరులు పోలీసులు వాహనాన్ని ఢీకొ్టించి.. భరత్ ను తీసుకుని వెళ్లారు.

దీంతో ఖంగుతిన్న పోలీసులు వెంటనే రాష్ట్రంలోని పోలీసులందరికీ సమాచారం అందించారు. ఈ క్రమంలో కర్ణాటకలోని హెసరఘట్టాలో భరత్ కనిపించాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే అక్కడకు వెళ్లిన నందిని లేఅవుట్ పోలిస్ స్టేషన్ పోలీసులు.. భరత్ ను చుట్టుముట్టారు. అయితే పోలీసులు లొంగిపోవాల్సిందిగా భరత్ కు చెప్పినా.. అతను వినిపించుకోలేదు. అంతేకాదు పోలీసులపైకి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో సుబాష్ అనే కానిస్టేబుల్ చేతిలోకి బుల్లెట్ గాయమైంది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మరక్షణ నిమిత్తం పోలీసులు ఎదురుకాల్పలు జరిపారు. ఈ కాల్పుల్లో భరత్ శరీరంలోకి రెండు తూటాలు దూసుకెళ్లడంతో అతడు మరణించాడు.

భరత్ మరో వాహనంలో పారిపోతుండగా, ఛేజ్ చేసి ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని ఓ అధికారి వెల్లడించారు. తొలుత ఓ బుల్లెట్ ట్ కడుపులోకి, ఆపై మరో బుల్లెట్ కాలిలోకి దిగిందని, అతన్ని చికిత్స నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించినా, అప్పటికే పరిస్థితి విషమించి మరణించాడని అన్నారు. యశ్ హత్యకు కుట్ర విషయానికి వస్తే, గత సంవత్సరంలో భరత్ తో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణ అనంతరం, అతను యశ్ హత్యకు కుట్ర పన్నినట్టు తెలిపారు. అయితే, ఇటువంటి వార్తలు తనను బాధిస్తున్నాయని అప్పట్లో యశ్ మీడియాకు వెల్లడించాడు. తనపై ఎటువంటి కుట్రలూ జరుగడం లేదని కూడా అన్నాడు. తనకు ఎలాంటి థ్రెట్స్ లేవని, ఈ విషయమై హోమ్ మంత్రితో పాటు, డీజీపీతోనూ మాట్లాడానని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles