Pawan Kalyan Meet Farmers at Yerrabalem ఏపీ రాజధాని అమరావతి వీడదని పవన్ కల్యాణ్ భరోసా

Janasena chief pawan kalyan assures farmers on amaravati at yerrabalem

Janasena, BJP, Pawan kalyan, Vijayawada, abolishment of Legislative council, abolish, Legislative council, Open letter, council abolishment, Amaravati, Visakhapatnam, wrong propaganda, defamation suit, social media, false articles, farmers, Capital city, Amaravati, agitation, Nadella Manohar, Sunil Deodhara. GVL Narasimha Rao, Amaravati, Visakhapatnam, AP CM Jagan, YSRCP party, Andhra Pradesh, Politics

The Jana Sena party chief Pawan Kalyan has visited Amaravati villages and extended his support to the farmers who are demanding Amaravati as a capital city

ITEMVIDEOS: ఏపీ రాజధాని అమరావతి వీడి ఎక్కడికీ వెళ్లదు: పవన్ కల్యాణ్

Posted: 02/15/2020 04:15 PM IST
Janasena chief pawan kalyan assures farmers on amaravati at yerrabalem

రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్రం ఇష్టమేననీ.. ఆ విషయంతో తానూ ఏకీభవిస్తానన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. అలాగని రాష్ట్రానికి 13 రాజధానులు చేయడం, 33 ముక్కలు చేస్తానంటే మాత్రం కుదరదని అన్నారు. ప్రపంచంలోనే బలమైన, పెద్దదైన ప్రజాస్వామ్యం మనదని.. ఎవరి ఇష్టానికి వారు చేసుకుపోవడం కుదరదని అన్నారు. రాష్ట్రానికి అమరావతే రాజధాని అని నిర్ణయం తీసేసుకున్నాం. అది అయిపోయింది. ఇప్పుడు మార్చడానికి లేదు అని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పిందని అన్నారు.

తాను బీజేపితో పొత్తు పెట్టుకునే సమయంలో బీజేపి జాతీయ నేతలతో జరిగిన చర్చల్లో అమరావతి అంశాన్ని కూడా ప్రస్తావించానని, అయితే అమరావతి మాత్రమే రాష్ట్ర రాజధానిగా కొనసాగుతుందని బీజేపి నేతలు తనకు స్పష్టమైన హామీని ఇచ్చారని పవన్ అన్నారు. తాను తన కోసమో లేక తన రాజకీయ లబ్ది కోసమో బీజేపితో కలవలేదని, తాను ప్రజాహిత నిర్ణయాలకు కట్టుబడి వుండి నిర్ణయాలను తీసుకునే వ్యక్తినని అన్నారు. రాజధాని కోసం వేల ఎకరాలు ఇచ్చిన రైతుల అంశాన్ని తాను బీజేపితో మిత్రపక్షంగా ఏర్పడే సమయంలో వారిని అడిగి.. హామీ వచ్చిన మీదటే వారితో జతకలిశానని చెప్పారు.

రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో ఇవాళ పర్యటించిన ఆయన... కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, రాయపూడిలలో రైతుల దీక్షకు మద్దతు తెలిపి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమరావతినే రాజధానిగా గతంలో అందరూ అంగీకరించి.. ఇప్పుడు మార్చడం సరికాదన్నారు. ఇష్టానుసారం నిర్ణయాలను మార్చుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజధాని రైతులను సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి నమ్మించి గొంతు కోశారని మండిపడ్డారు. రాజధాని అమరావతిలోనే ఉండేలా పోరాటం చేస్తానన్నారు. తాను అమరావతి రైతులకు అండగా ఉంటానని.. భరోసా ఇవ్వడానికే ఇక్కడకు వచ్చానని తెలిపారు.

రాజధాని ఎక్కడ ఉండాలనే నిర్ణయం ఐదేళ్ల క్రితమే జరిగిపోయిందని, ఇక ఇప్పుడు రాజధాని మార్చే అధికారం ప్రభుత్వానికిలేదన్నారు. గతప్రభుత్వం నిర్ణయించినప్పుడు.. వైసీపీ కూడా అంగీకరించిందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మానిఫెస్టోలో నవరత్నాల అమలుకు హామీ ఇచ్చినట్లు.. రాజధాని మార్పుపై కూడా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించాల్సిందని పవన్ అన్నారు. ఇప్పుడు రాజధాని మారుస్తామంటే చూస్తూ ఊరుకోబోమని అన్నారు.

రాజధాని ఎక్కడికీ పోదని భరోసా ఇవ్వడానికే ఇక్కడికి వచ్చానని అన్నారు. రైతులకు మద్దతుగా బీజేపి పార్టీతో కలసి ర్యాలీ చేద్దామనుకున్నాం.. కానీ ఢిల్లీ ఎన్నికల కారణంగా వాయిదా వేసుకున్నామని చెప్పారు. త్వరలోనే బీజేపితో కలసి అమరావతి ప్రాంతంలో ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. అమరావతి రైతులకు అండగా ఉంటామని బీజేపి పెద్దలు చెప్పారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం జరగదని.. ఎవరు వచ్చినా రాకున్నా తాను.. రైతులకు అండగా ఉంటానని పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు.

అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేసిన వాళ్లను శిక్షించడంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా ఫర్వాలేదని.. కానీ అన్నం పెట్టే రైతన్నను రోడ్లమీదకు తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారని ఆయన అవేదన వ్యక్తం చేశారు. తన దృష్టిలో రైతులను ఇబ్బంది పేట్టేవి అసలు రాజకీయ పార్టీలే కాదని అన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు మేలు చేసేలా ప్రభుత్వ నిర్ణయాలు వుండాలే తప్ప వారి జీవితాలతో ఆడుకోవద్దని సూచించారు. నాలుగైదు భవనాలు కట్టినంత మాత్రాన అభివృద్ధి జరిగిందని అనుకుంటే సహేతుకం కాదని అన్నారు. రైతులు వారి భూములను టీడీపీక ఇవ్వలేదని, రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి అందించారని అన్నారు.

రాయలసీమ, ఉత్తరాంధ్రాల సమగ్ర అభివృద్ధిని తాను కోరుకుంటున్నానని చెప్పిన పవన్ కల్యాణ్.. ఇటీవల కర్నూలుకు వెళ్లిన సందర్భంగా అక్కడి నిరసన తెలిపిన కొందరు న్యాయవాదులకు కూడా తాను ఇదే చెప్పానన్నారు. ఒక్క హైకోర్టు వచ్చినంత మాత్రాన అభివృద్ధి జరగదని.. సమగ్ర అభివృద్దికి జగన్ రెడ్డి ప్రభుత్వ ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుందో చూడాలని అన్నారు. నీటి కోసం కూడా కర్నూలు పోరాటం చేస్తోందన్న విషయాన్ని కూడా పవన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. వైసీపీ నాయకుల నవరత్నాల పందేరానికి రైతులు భూములు ఇవ్వలేదని పవన్ కల్యాణ్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  JanaSena  BJP  Amaravati  Capital city  Three Capitals  AP CM Jagan  Andhra Pradesh  Politics  

Other Articles