bridegroom died due to heart attack at Bodhan పెళ్లి బారత్ లో డాన్సు.. డీజే సౌండ్ తో వరుడి మృతి

New bridegroom died due to heart attack at bodhan of telangana

baraat, bodhan town, bridegroom, dancing, dj, gloom, heavy beats, hospital, mangali ganesh, music, wedding, nizamabad, telangana, telangana news,

In an incident, a newlywed bridegroom died due to a heart attack while dancing in wedding Barrat. This tragedy happened at Brahmana Galli in Bodhan of Nizamabad district. Within a few hours of the wedding, the death of the bridegroom has caused a deep shock to the family members.

పెళ్లి బారత్ లో డాన్సు.. డీజే సౌండ్ తో వరుడి మృతి

Posted: 02/15/2020 03:05 PM IST
New bridegroom died due to heart attack at bodhan of telangana

వివాహబంధంతో ఒక్కటైన కొత్తజంటపై విధి పగబట్టింది. కళ్యాణమైన కొన్ని గంటల వ్యవధిలోని వారిని విధి విడదీసింది. పెళ్లైన సంతోషాన్ని తన బంధుమిత్రులతో కలసి సంబరంగా జరుపుకున్న వరుడు తన స్నేహితులతో కలసి పెళ్లి బరాత్ లో డాన్స్ వేశాడు. అయితే డీజే సౌండ్ ప్రభావం అతనిపై ప్రభావం చూపడంతో అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడ్డాడు. బంధువులు, తల్లిదండ్రులు అప్రమత్తమై వెంటనే అసుపత్రికి తరలించగా, అసుపత్రిలో చికిత్స పోందుతూ వరుడు గుండెపోటుకు గురై మరణించాడు.

ఈ విషాధ ఘటన నిజామాబాద్‌ జిల్లా బోధన్ పట్టణంలో జరిగింది. వివాహమైన కొద్దిసేపటికే వరుడు మంగళి గణేశ్(25) మృతి చెందాడు. గణేశ్ కు శుక్రవారం మధ్యాహ్నం వివాహం జరిగింది. రాత్రి పెళ్లి వేడుకలో భాగంగా బారాత్‌ నిర్వహించారు. డీజే సౌండ్‌కు అస్వస్థతకు గురైన గణేశ్‌ ఒక్కసారిగా కుప్పకూలాడు. అప్రమత్తమైన బంధువులు వెంటనే నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 2గంటల సమయంలో గుండెపోటుతో వరుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. నూరేళ్లు తోడుంటానని ప్రమాణం చేసి ఇంటికి తీసుకువచ్చిన భర్త కొద్ది సేపటికే దూరమయ్యాడంటూ వధువు, బంధువుల రోదనలు మిన్నంటాయి. అప్పటి వరకు తమతో హుషారుగా నృత్యం చేసిన వరుడు మృతి చెందడంతో బంధుమిత్రులు విషాదంలో మునిగిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mangali ganesh  music  Bridegroom  Wedding  dancing  dj sound  Bodhan  Nizamabad  Telangana  crime  

Other Articles

Today on Telugu Wishesh