Amaravati stir continues as farmers sit-in on 60th day 60 రోజులకు చేరిన అమరావతి రైతుల దీక్షలు..

Capital decentralisation no let up in stir as farmers continue sit in on 60th day

Amaravati JAC, Mangalagiri magistrate, AndhraPradesh Assembly, Amaravati, three capital, State Assembly, joint action committee, YS Jagan, Capitals, Visakhapatnam, kurnool, committee report, executive capital, legislative capital, judicial capital, Vijayawada, farmers, Andhra Pradesh, Politics

There was no let-up in protests against the YSRC government’s plan on decentralisation of the capital, as the residents of villages in the Amaravati region continued to hold sit-ins and relay hunger strikes on Saturday. The protest of farmers of Amaravati region continues for 60 th day.

60 రోజులకు చేరిన అమరావతి రైతుల దీక్షలు..

Posted: 02/15/2020 11:41 AM IST
Capital decentralisation no let up in stir as farmers continue sit in on 60th day

అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా మార్చాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన నిరసన దీక్షలు ఇవాళ్టికి 60 రోజులకు చేరాయి. మూడు నెలలకోపర్యాయం జరిగే అసెంబ్లీ సమావేశాలతో అమరావతిని శాసన రాజధానిగా మార్చి.. ఈ ప్రాంత రైతులు జీవితాలను, వారి భవిష్యత్ తరాల జీవితాలను అధోగతి పాలు చేయవద్దని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారాలన్న కొత్త విధానానికి రాష్ట్ర ప్రభుత్వం ఆజ్యం పోయడం రాష్ట్ర భవిష్యత్ కు సహేతుకం కాదని అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్రంలో అభివృద్ది వికేంద్రీకరణకు తాము వ్యతిరేకం కాదని పేర్కోంటున్న రైతులు.. తాము కేవలం పాలనా వికేంద్రీకరణకు వ్యతిరేకమని అన్నారు. అందుకనే ప్రభుత్వం అసెంబ్లీలో అమోదించిన పాలనా వికేంద్రీకరణ బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గత 60 రోజులుగా నిరసనలు, అందోళనలు చేపడుతున్నారు. రాజధానిని తరలిస్తున్నారన్న సంకేతాలు వచ్చిన రోజు నుంచే అమరావతి పరిధిలోని 29 గ్రామాల పరిధిలో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నిరసన దీక్షలలో స్థానిక రైతులతో పాటు మహిళలు, యువకులు, విద్యార్థులు పాల్గోని తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు.

మందడం, తుళ్లూరు, వెలగపూడి, రాయపూడి, పెదపరిమి, కృష్ణాయపాలెంలో రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి. నిరసన దీక్షల్లో భాగంగా రైతులు విభిన్న పద్దతుల్లో ప్రభుత్వానికి నిరసన తెలిపారు. రైతుల దీక్షలు, మహిళల దీక్షలు, ర్యాలీలు, అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు, దళిత వర్గాల జేఏసీ దీక్షలు, కులవృత్తుల వారీగా దీక్షలు చేపట్టారు. వీటికి తోడు బైక్ ర్యాలీలు, పాదయాత్రలు, రహదారుల దిగ్భంధం.. వంటావార్పు కార్యక్రమాలతో వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ‘‘వద్ద వద్దు.. మాకు వద్దు.. మూడు రాజధానులు మాకు వద్దు’’ అన్న ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు.  

ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటికే ఇక్కడ సేకరించిన భూమిని తీసుకుని పూర్తిస్థాయి రాజధానిగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం పెద్దన్నగా జోక్యం చేసుకుని రాజధానిగా అమరావతినే కొనసాగించేలా చూడాలని కోరారు. రాజధాని రైతుల ఆందోళనలు నేటికి 60వ రోజుకు చేరడంతో వారిని  పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. రాయపూడి, తుళ్లూరు, పెదపరిమి, తాడికొండలో ఇవాళ చంద్రబాబు పర్యటన కొనసాగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  Amaravati  Farmers stir  Tulluru  Mandadam  Mangalagiri  Three Capitals  Andhra Pradesh  Politics  

Other Articles