Unmitigated Disaster Like Coronavirus: Jairam Ramesh కాంగ్రెస్ కు కరోనా వైరస్.. సీనియర్ నేత వ్యాఖ్యలతో కలవరం..

After jairam ramesh jyotiraditya scindia says congress needs new approach reach out to people

aap, congress, delhi assembly elections 2020, delhi elections, P Chidambaram, Jairam Ramesh, corona virus, Jyotiraditya Scindia, new approach, kamal nath, madhya pradesh, National Politics

Jyotiraditya Scindia's remarks came hours after senior party leader Jairam Ramesh voiced concern over the Congress debacle in the Delhi Assembly polls and suggested it "ruthlessly" reinvent itself or face the prospect of becoming irrelevant.

కాంగ్రెస్ కు కరోనా వైరస్.. సీనియర్ నేత వ్యాఖ్యలతో కలవరం..

Posted: 02/14/2020 07:13 PM IST
After jairam ramesh jyotiraditya scindia says congress needs new approach reach out to people

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పట్ల సీనియర్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కొత్త తలనోప్పిని తెచ్చిపెడుతున్నాయి. ఢిల్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కరోనా వైరస్ లా తాకాయని ఆ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ చేసిన వ్యాఖ్యాలు పార్టీలోని పలువర్గాల నేతలను కలవరానికి గురిచేస్తున్నాయి. మైనారిటీ మతవాదంపై కాంగ్రెస్ సామరస్య ధోరణితో ఉంటోందన్న ప్రచారంతో నష్టం జరిగిందని అన్నారు. షహీన్ బాగ్, పౌరసత్వ చట్టం తదితర అంశాలను బీజేపీ ప్రచార అస్త్రంగా చేసుకుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ ప్రచారాలతో బీజేపి ఢిల్లీ ఓటరు తీర్పును ప్రభావితం చేసిందని.. అయితే ఆ ప్రభావం ఓట్లను చీల్చ గలిగిందే తప్ప, ఆ పార్టీ గెలవలేకపోయిందని అన్నారు. కాగా అధిక నష్టం జరిగింది మాత్రం కాంగ్రెస్ పార్టీకేనని అన్నారు. ఒక్కసారిగా కరోనా సోకితే ఎంత నష్టం జరుగుతుందో, అంత నష్టం కాంగ్రెస్ కు జరిగిందని తెలిపారు. మైనారిటీల మనోభావాల పట్ల కొందరు సీనియర్లు సున్నితంగా వ్యవహరించాలని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన ఆయన, దీంతో తాము మతవాదంపై చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నామన్న దుష్ప్రచారం జరిగిందని అన్నారు.

అయితే ఈ దుష్ర్పచారం వల్లే తమ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో ఎంతో నష్టం జరిగిందని జైరామ్ రమేష్ అన్నారు. ఇదిలావుండగా, జైరాంరమేష్ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంలటల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో పర్యాయం తమ పార్టీ డకౌట్ అయ్యిందన్నారు. అందుకు కారణాలను విశ్లేషించాల్సిన అవసరం వుందని అభిప్రాయపడ్డారు. మారుతున్న కాలంతో పాటు పార్టీ విధివిధానాలు, పద్దతులు, కూడా మారాలాని అన్నారు. ప్రజలు మన నుంచి మార్పును కోరుకుంటున్నారని అన్నారు.

మధ్యప్రదేశ్ లోని నివారీ జిల్లా పృథ్వీపూర్‌లో నిన్న పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ ఫలితాలు తీవ్ర నిరాశ కలిగించాయన్నారు. పార్టీ ఆలోచనా విధానం మారాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కొత్త తరానికి తగ్గట్టుగా తమ భావజాలం మారాల్సి ఉందన్నారు. దేశం మారిందని, అందుకు తగ్గట్టుగానే సరికొత్త ఆలోచనలతో ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని సింధియా పేర్కొన్నారు. కొత్త తరానికి తగ్గట్టుగా కొత్త విధివిధానాలతో తాము ప్రజల్లోకి వెళ్తే విజయం తధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ ఘన విజయం సాధించింది. బీజేపీ ఎనిమిది స్థానాలు సాధించగా, కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles