SC dismisses convict's plea against no mercy నిర్భయ దోషి వినయ్ శర్మ పిటీషన్ కొట్టివేసిన ‘సుప్రీం’

Nirbhaya case supreme court dismisses convict vinay sharma s plea against mercy rejection

mercy petition, nirbhaya, vinay sharma, Justice R Banumathi, Delhi Gangrape case, mercy plea, nation, Crime

The Supreme Court dismissed Nirbhaya death-row convict Vinay Sharma’s plea challenging the rejection of his mercy petition, A bench comprising Justices R Banumathi, Ashok Bhushan and A S Bopanna said the contention by the petitioner that materials were not made available to the President cannot be accepted.

నిర్భయ కేసు: వినయ్ శర్మ పిటీషన్ కొట్టివేసిన ‘సుప్రీం’ ధర్మాసనం

Posted: 02/14/2020 08:35 PM IST
Nirbhaya case supreme court dismisses convict vinay sharma s plea against mercy rejection

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచార కేసులో దోషులలో ఒకరైన వినయ్ శర్మ దాఖలు చేసిన అనారోగ్య పిటీషన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ కొట్టివేసింది. జనవరి 22... ఫిబ్రవరి ఒకటి... తేదీలలో ఇచ్చిన డెత్ వారెంట్ వాయిదా పడటంతో ఇక తమకు ఉరి తప్పదని స్పష్టం కావడంతో.. పిటీషన్లతో కాలయాపన చేసి డెత్ వారెంట్లను నిలిపేస్తూ వస్తున్న దోషుకు వ్యూహాలకు ఢిల్లీ హైకోర్టు చెక్ పెట్టిన విషయం తెలిసిందే. వారం రోజుల వ్యవధిలో దోషులందరూ తమకు న్యాయపరమైన హక్కులను వినియోగించుకోవాలని గడవును ఇచ్చింది.

ఈ క్రమంలో తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వినయ్ శర్మ దాఖలు చేసిన పిటీషన్ ను న్యాయస్థానం కోట్టివేసింది. ‘నన్ను తీహార్‌ జైల్లో చిత్రహింసలు పెట్టారు. ఆ కారణంగా నాకు పిచ్చెక్కింది. మానసిక సమస్యతో నేను బాధపడుతున్నాను’ అంటూ తాజాగా దోషుల్లో ఒకడైన వినయ్‌శర్మ నిన్న సుప్రీంకోర్టుకు తెలిపాడు. రాష్ట్రపతి తన క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చడాన్ని అతను సవాల్‌ చేశాడు. ఈ విషయాన్ని రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకోలేదంటూ వినయ్ పిటిషన్ వేశాడు. వినయ్ మానసికంగా బలంగా ఉన్నాడని విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వాదించింది. ఇరువైపు వాదనలను విన్న సుప్రీంకోర్టు అతని పిటిషన్ ను కొట్టేసింది.  

సృహ కోల్పోయిన జస్టిస్ భానుమతి

కాగా, నిర్భయ కేసును విచారిస్తున్న సమయంలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ భానుమతి అస్వస్థతకు గురయ్యారు. నిర్భయ దోషులను వేర్వేరుగా ఉరి తీసేందుకు అనుమతించాలంటూ కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ పై తీర్పును వెలువరిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉన్నట్టుండి కళ్లు తిరిగి ఆమె పడిపోయారు. దీంతో, కోర్టు హాల్లో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కోర్టు సిబ్బంది ఆమెను హుటాహుటిన ఛాంబర్ కు తీసుకెళ్లి ప్రాథమిక వైద్యం అందించారు.

కాసేపటి తర్వాత ఆమె స్పృహలోకి వచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో కేసును వచ్చే వారానికి ధర్మాసనం వాయిదా వేసింది. మరోవైపు జస్టిస్ భానుమతి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ఆరోగ్యం బాగోలేకపోయినా కేసు విచారణ నిమిత్తం వచ్చారని చెప్పారు. ఛాంబర్ లోనే ఆమెను వైద్యులు పరీక్షిస్తున్నారని తెలిపారు. దీనికి ముందే దోషి వినయ్ శర్మ పెట్టుకున్న పిటిషన్ ను జస్టిన్ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mercy petition  nirbhaya  vinay sharma  Justice R Banumathi  Delhi Gangrape case  mercy plea  nation  Crime  

Other Articles