India pays homage to Pulwama bravehearts పుల్వామా అమరులకు జాతి నివాళులు..

Pulwama attack anniversary india pays homage to bravehearts

pulwama attack, pulwama attack anniversary, pulwama attack annual function, pulwama terror attack anniversary, attack in pulwama latest, anniversary of pulwama attack, crpf killed in pulwama attack anniversary, pulwama memorial inauguration, 40 CPPF jawans pulwama, pulwama brave hearts, homage

First anniversary of Pulwama terror attack: To commemorate martyrdom of 40 CPPF jawans who lost their lives in a suicide bomber attack in Pulwama, J&K, on February 14 last year, a memorial inaugurated at the district's Lethpora camp.

పుల్వామా అమరులకు జాతి నివాళులు.. ప్రధాని, షా కూడా..

Posted: 02/14/2020 12:07 PM IST
Pulwama attack anniversary india pays homage to bravehearts

ఆర్మీకి చెందిన వాహనాలతో తమ క్యాంపుకు వెళ్తున్న సీఆర్పీఎఫ్ బలగాలపై ఉగ్రవాదులు ఆత్మహుతి దాడితో తెగబడిన రోజు ఇదే. ఆ వెంటనే వరుసగా వెళ్తున్న ఆర్మీ వాహనాలలో ప్రయాణిస్తున్న మిగతా జవాన్ల అక్కడకు చేరుకోగానే వారిపై కూడా తుపాకుల తూటాలను కురిపించారు ముష్కరులు. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భీకర ఉగ్రదాడిలో సుమారు 40 మంది జవాన్లు అమరులయ్యారు.

ఈ దారుణఘటన జరిగి నేటికి సరిగ్గా ఏడాది కావడంతో అమరజవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్ నాథ్‌ సింగ్‌ వారికి ఘననివాళులు అర్పించారు. అమరజవాన్ల త్యాగాన్ని భారత్‌ ఎన్నటికీ మర్చిపోదన్నారు. కాగా, అమరజవాన్ల పేరున ఓ స్మారకస్తూపాన్ని ఇవాళ అవిష్కరించారు. ఈ స్తూపంపై అమరులైన 40 మంది జవాన్ల ఫోటోలు, వారి వివరాలను పొందుపర్చారు. జమ్ముకశ్మీర్‌లోని లెత్‌పొరా శిబిరంలో స్మారకస్తూపాన్ని అవిష్కరించిన సీఆర్పీఎఫ్‌ అదనపు డైరెక్టర్‌ జుల్ఫికర్‌ హసన్‌.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇదే అమరవీరులకు అసలైన నివాళి అని అన్నారు.

అమరవీరులకు నివాళులు అర్పించిన ప్రధాని నరేంద్రమోడీ ‘గతేడాది పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన ధీర జవాన్లకు నివాళి. దేశ సేవ, రక్షణ కోసం తమ జీవితాలను అంకితం చేసిన గొప్ప వ్యక్తులు వారు. ఆ అమరుల త్యాగాలను యావత్ భారతం ఎన్నటికీ మర్చిపోదు’ అని ట్విటర్లో పేర్కొన్నారు. ‘ఇదే రోజున జరిగిన పుల్వామా దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్‌ జవాన్లకు నివాళులర్పిస్తున్నాం. వారి త్యాగాలను దేశం ఎన్నటికీ మర్చిపోదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ దేశం ఏకమైంది. దేశ రక్షణ కోసం ముష్కరులపై పోరు కొనసాగించేందుకు మేం కట్టుబడి ఉన్నాం’  అని రాజ్‌నాథ్‌ ట్వీట్‌ చేశారు. మాతృభూమి సార్వభౌమత, సమగ్రత కోసం గొప్ప త్యాగం చేసిన ధీర జవాన్లు, వారి కుటుంబాల పట్ల భారత్‌ ఎప్పుడూ గర్వపడుతోందని కేంద్రమంత్రి అమిత్ షా ట్విటర్‌ ద్వారా నివాళులర్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles