Kerala imposes ₹13 price cap on bottled water వాటర్ బాటిల్ ధర అంతకుమించి పెంచరాదు.!

Bottled drinking water in kerala to cost rs 13 a litre govt puts price cap

Kerala govt puts price cap on water bottle, Rs 13 one litre water bottle in Kerala, water bottle price cap in Kerala, kerala government, water bottle, bottled water, price cap, CM Pinarayi Vijayan, Food Department, food and beverages, Kerala

The Kerala state government has decided to put a price ceiling of Rs 13 on the one-litre bottled water. The government announced the price cap after Chief Minister Pinarayi Vijayan signed the Food Department Proposal.

కేరళలో నిత్యవసరాల కిందకు ‘ఆ’ లీటరు బాటిల్..

Posted: 02/14/2020 12:59 PM IST
Bottled drinking water in kerala to cost rs 13 a litre govt puts price cap

సురక్షిత మంచినీరు ప్రజలకు పంపిణీ చేయడం ప్రభుత్వాల బాధ్యత అన్న విషయాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నా.. వ్యాపార సంస్థలు మాత్రం చక్కగా ఈ అవకాశాన్ని వినియోగం చేసుకుంటున్నాయి. మినరల్ వాటర్ అన్న పేరుతో ఫ్యాకేజ్డ్ నీటిని విక్రయిస్తూ దశాబ్దాలుగా సొమ్ము చేసుకుంటున్నాయి. ఓ వైపు 20 లీటర్ల క్యాన్ రూ.20కి బయట మార్కెట్లలో లభిస్తుండగా, అదే బాటిల్ ను కేవలం రూ.5కు ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంధ సంస్థలు, డ్వాక్రా సంఘాలు విక్రయిస్తున్న విషయం తెలిసిందే. అయినా లీటర్ వాటర్ బాటిల్ ధర మాత్రం కనిష్టంగా రూ.20 వద్దే ఉంటోంది.

రైల్వేలో రూ.15కే అందించాలని కేంద్రం అదేశించినా.. ఇది కొన్ని స్టేషన్లలో మినహాయించి ఎక్కడా.. మరీ ముఖ్యంగా రైళ్లలో అస్సలు కనిపించదు. వీటిపై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించవు. ఈ నేపథ్యంలో కేవలం లీటర్ వాటర్ బాటిల్ ధర మాత్రం 20 నుంచి 25 రూపాయల మధ్యకు చేరుకుంది. ఇక సినిమా హాళ్లు, మల్టీఫ్లెక్సులు.. ఇతర జనసామర్థ్యం అధికంగా వున్న ప్రాంతాల్లో ఈ ధరలు మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. దాహమేసి గుక్కెడు నీళ్లు తాగాలంటే లీటర్ బాటిల్ పై రూ.20 వసూలు చేస్తున్నారు. వాటర్ బాటిల్ కొనాలంటేనే జనం భయపడిపోతున్నారు.

పెంచిన వాటర్ బాటిళ్ల ధరలకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో నిత్యావసర వస్తువుల చట్టం కిందకు వాటర్ బాటిళ్ల ధరను తీసుకురావాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. వాటర్ బాటిల్ ధరలపై నియంత్రించేందుకు వీలుగా లీటర్ వాటర్ బాటిల్ ధరను రూ.13లుగా ఫిక్స్ చేయాలనే నిర్ణయానికి వచ్చింది లెఫ్ట్ గవర్నమెంట్. కేరళలో ప్రస్తుతం ఒక లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.20 ఖరీదు ఉంది. ఆహారం, పౌర సరఫరాల మంత్రి పి.థిలోత్తమన్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వాటర్ బాటిల్ ధరలను నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.

ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి చెప్పారు. ‘రాష్ట్రంలో లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.13 ఖరీదు. రెండు రోజుల్లో ఆదేశాలు జారీ కానున్నాయి. ప్రజల అభిప్రాయాల మేరకు నిత్యావసర వస్తువుల కేటగిరి కిందికి వాటర్ బాటిల్ ధరలను తీసుకొచ్చింది’ అని థిలోత్తమన్ చెప్పారు. రెండేళ్ల క్రితమే ప్రభుత్వం వాటర్ బాటిల్ ధరను రూ.11 నుంచి రూ.12లకు తగ్గించాలని భావించింది. అదే సమయంలో బాటిల్ వాటర్ తయారీదారులు, ట్రేడర్లు భారీ స్థాయిలో ఆందోళనకు దిగడంతో అమలు చేయడం కుదరలేదని మంత్రి అన్నారు. కేరళలో ఇప్పుడు ఎవరైనా లీటర్ వాటర్ బాటిల్ ధరను రూ.13 కంటే ఎక్కువగా ప్యాకేజీతో అమ్మితే అది నేరంగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles