IRCTC special foreign trip on valentine's day రూ.45 వేలతో ఐఆర్సీటీసీ నాలుగు రోజుల ఫారిన్ టూర్

Irctc thailand valentine s special package for lovers on valentine s day

IRCTC, IRCTC Thailand special package, Valentine day, Bankok, Patiyala, cruze, Gala dinner, IRCTC lovers day special, Valentine week, valentine list, valentine day 2020, valentine day list, valentine gift, gift for valentine, valentine special, valentine week 2020, valentine day gift

IRCTC attracts young couples with 4 night and five days in thailand bankok patiyala as a part of valentine's special package for lovers on valentine's day

ఐఆర్సీటీసీ వాలంటైన్స్ డే స్పెషల్: రూ.45 వేలతో నాలుగు రోజుల ఫారిన్ టూర్

Posted: 02/07/2020 02:36 PM IST
Irctc thailand valentine s special package for lovers on valentine s day

ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే ను పురస్కరించుకుని కొత్తగా పెళ్లైన జంటలు లేదా పెళ్లి చేసుకోబోయే జంటలు స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటాయి. వీరితో పాటు ప్రేమికులను కూడా విదేశీయానం కల్పిస్తూ ఎంజాయ్ చేసేలా చక్కటి ఫ్యాకేజీని ప్రకటిచింది ఐఆర్‌సీటీసీ. ఈ ప్యాకేజీ మేరకు జంటలను ఏకంగా థాయ్ ల్యాండ్ తీసుకెళ్తోంది. ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసినవారిలో బ్యాంకాక్, పట్టాయాలో ప్రేమికులు చక్కర్లు కొట్టొచ్చు. 4 రాత్రులు, 5 రోజుల టూర్ ఇది. ముంబై నుంచి ఈ టూర్ 2020 ఫిబ్రవరి 12న ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 16న టూర్ ముగుస్తుంది.

ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున వాలెంటైన్స్ డే స్పెషల్ ప్రైవేట్ పూల్ పార్టీ, గాలా డిన్నర్ ఉంటాయి. ఐఆర్‌సీటీసీ వాలెంటైన్స్ డే స్పెషల్ థాయ్‌ల్యాండ్ టూర్ ముంబైలో 2020 ఫిబ్రవరి 12న ప్రారంభం అవుతుంది. తెల్లవారుజామున 02.40 ముంబైలో బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కాలి. ఉదయం 09.05 గంటలకు బ్యాంకాక్ చేరుకుంటారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత బ్యాంకాక్ సిటీ టూర్, టెంపుల్ టూర్ ఉంటుంది. రిక్లైనింగ్ బుద్ధ, గోల్డెన్ బుద్ధ, మార్బుల్ టెంపుల్ చూసిన తర్వాత ఇండియన్ రెస్టారెంట్లో భోజనం ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం హోటల్ లో విశ్రాంతి తీసుకోవాలి. సాయంత్రం చావో ఫ్రాయా రివర్ క్రూజ్ లో విహరిస్తూ రాత్రి భోజనం చేయాలి. రాత్రికి బ్యాంకాక్‌లోనే బస చేయాలి.

ఫిబ్రవరి 13న మెరైన్ పార్క్, సఫారీవాల్డ్ కు తీసుకెళ్తారు. సాయంత్రం ఇందిరా మార్కెట్ లో షాపింగ్ ఉంటుంది. రాత్రికి బ్యాంకాక్ లోనే బస చేయాలి. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే రోజున పట్టాయాకు బయల్దేరాలి. దారిలో టైగర్ షోకి తీసుకెళ్తారు. సాయంత్రానికి పట్టాయా చేరుకుంటారు. రాత్రికి వాలెంటైన్స్ డే స్పెషల్ ప్రైవేట్ పూల్ పార్టీ, గాలా డిన్నర్, డీజే ఉంటాయి. రాత్రికి పట్టాయాలో బస చేయాలి. ఫిబ్రవరి 15న కోరల్ ఐల్యాండ్ టూర్ ఉంటుంది. సాయంత్రం ఆల్కజార్ షోకు తీసుకెళ్తారు. రాత్రి పట్టాయాలో బస చేయాలి.

ఫిబ్రవరి 16న తిరిగి బ్యాంకాక్‌కు బయల్దేరాలి. దారిలో జెమ్స్ గ్యాలరీ సందర్శన ఉంటుంది. సాయంత్రానికి సువర్ణభూమి విమానాశ్రయంలో డ్రాప్ చేస్తారు. రాత్రి 10:10 గంటలకు బ్యాంకాక్ లో బయల్దేరితే అర్థరాత్రి 01:35 గంటలకు ముంబై చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఐఆర్‌సీటీసీ వాలెంటైన్స్ డే స్పెషల్ థాయ్ ల్యాండ్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.45,350. ఈ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, బ్యాంకాక్‌లో 2 రాత్రులు, పట్టాయాలో 2 రాత్రులు 3 స్టార్ కేటగిరీ అకామడేషన్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, వాలెంటైన్స్ డే స్పెషల్ ప్రైవేట్ పూల్ పార్టీ, గాలా డిన్నర్, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి కవర్ అవుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles