స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో..’ బాక్సాఫీసు షేక్ చేస్తూ.. బన్ని పేరున కొత్త రికార్డులను లిఖిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా సంక్రాంతి బరిలో ప్రిన్స్ మహేష్ బాబుతో పోటీ పడుతూ రంగంలోకి దిగిన బన్నీ.. సంక్రాంతి విన్నర్ గా నిలవడంతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి బాహుబలి వన్ రికార్డును సైతం కొల్లగొట్టేందుకు పరుగులు తీస్తున్నాడు.
కేవలం పది రోజుల వ్యవధిలోనే ఏకంగా 220 కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం తాజాగా 25 రోజుల వ్యవధితో తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 126.48 కో్ట్ల రూపాయల షేర్ రాబట్టింది. ఐదవ వారంలోనూ ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా దూసుకెళ్తున్న ఈ చిత్రం తాజాగా అల్లు అర్జున్ కెరీర్ లో ది బెస్ట్ కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా నిలుస్తోంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ సందడి చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా 25 రోజుల్లో మొత్తం 156.44 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది 'అల.. వైకుంఠపురములో' మూవీ. ‘అల వైకుంఠపురములో' మూవీ కలెక్షన్స్ వివరాలు ప్రాంతాల వారీగా చూసినట్లయితే.. నైజాం - 43.20 కోట్లు, సీడెడ్ - 18.10 కోట్లు, గుంటూరు - 10.88 కోట్లు ఉత్తరాంధ్ర - 20.02 కోట్లు, తూర్పు గోదావరి - 11.15 కోట్లు, పశ్చిమ గోదావరి - 8.75 కోట్లు, కృష్ణా - 10.50 కోట్లు నెల్లూరు - 4.55 కోట్లు తెలుగురాష్ట్రాల్లో 25 రోజుల టోటల్ షేర్ - 126.48 కోట్లుగా ఉన్నాయి. రెస్టాఫ్ ఇండియా - 1.44 కోట్లు, ఓవర్సీస్ - 18.23 కోట్లతో మొత్తంగా టోటల్ వరల్డ్ వైడ్ షేర్ - 156.44 కోట్ల షేర్ ను రాబట్టింది.
కాగా ఈ చిత్రం అంచనాలను మించిన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో అల వైకుంఠపురంలో చిత్ర యూనిట్ ఇవాళ ఇల వైకుంఠపురమైన తిరుమలను సందర్శించింది. అల్లు అర్జున్ కుటుంబసమేతంగా కలసి చిత్రబృందంతో కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవారిని సందర్శించుకున్నారు. స్వామివారి ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్న బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు తమన్, నిర్మాతలు రాధాకృష్ణ, బన్నివాసులతో పాటు పలువురు స్వామివారిని దర్శించుకున్నారు.
చిత్రబృందం స్వామివారిని దర్శించుకున్న తరుణంలో రంగనాయకుల మండపంలో వేదపండితులు వారికి అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహారెడ్డి, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు, సంగీత దర్శకులకు అశీర్వచనం పలికారు. కాగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గడ్డంతో ఎన్నడూ లేని విధంగా కొత్త లుక్‌లో కనపడ్డాడు. తన కుమారుడు, కూతురుని ఎత్తుకుని తిరుమల వద్ద కనపడ్డ ఆయన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. చిత్ర యూనిట్ సమ్మతించిన నేపథ్యంలో పలువురు ఫోటోగ్రాఫర్లు వారిని తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more