2 dead in Texas university shooting టెక్సాస్ లో కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి..

Two dead one wounded in shooting at texas university campus

Firing in US University, Gun fire in Texas University, shooting in America University, shooting in Texas University, Gun Culture, Arms and Weapons, Two women dead, toddler injured, gun violence, Police Chief Bryan Vaughn, U.S. college and high school campuses, U.S. bloodshed, Crime

Two women were killed and a toddler was wounded on Monday in a shooting at a residence hall on the Texas A&M University campus in Commerce, authorities said. The wounded toddler, a boy about 2 years old, was in stable condition at a local hospital.

అగ్రరాజ్యంలో మరోమారు కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి..

Posted: 02/04/2020 12:55 PM IST
Two dead one wounded in shooting at texas university campus

అగ్రారాజ్యం అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం రేగింది. గన్ కల్చర్ కు అలవాటు పడుతున్న అక్కడి యువత.. ప్రాణాలను తృణప్రాయంగా తీసేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే లేట్ నైట్ పార్టీలు, వీకెండ్ పార్టీలపై మాత్రమే తన ప్రతాపాన్ని చూసే తుపాకి మరోమారు రెచ్చిపోయింది. ఈ సారి ఏకంగా విశ్వవిద్యాలయం రెసిడెన్స్ హాల్ లో కలకలం రేపింది. విశ్వవిద్యాలయాలు, హై స్కూళ్ల పరిధిలో కాల్పులకు గత కొంతకాలంగా చెక్ పడింది. కాగా తాజాగా టెక్సాస్ లోని ఏఅండ్ఎం యూనివర్సిటీ-కామర్స్ క్యాంపస్‌లోని రెసిడెన్స్ హాల్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.

కాగా, కాల్పుల్లో మరో రెండేళ్ల చిన్నారి కూడా తీవ్రంగా గాయపడ్డాడని, అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం అసుపత్రికి తరలించారు. అయితే మరణించిన ఇద్దరు మహిళలు కళాశాల విద్యార్థులేనా.? లేక ఇతరులు.? చిన్నారి అక్కడికెలా వచ్చాడు.. మృతిచెందిన మహిళకు చెందిన బిడ్డా లేదా.? అన్న విషయాలను పోలీసులు సమాధానం దాటవేస్తున్నారు. అయితే లైసెన్స్ ఉన్న వ్యక్తే కాల్పులకు తెగబడ్డాడని, కాల్పులకు గల కారణాలు తెలియరాలేదని స్థానికి పోలీస్ చీఫ్ బ్రెయిన్ వాఘన్ పేర్కొన్నారు.

కాల్పుల విషయమై ఎవరో విద్యార్థి తమకు సమాచారం అందించాడని, పోలీసులు తెలిపారు. కాగా, గత ఏడాది అక్టోబర్ మాసంలో ఇదే కాలేజీలోని ఆప్ క్యాంపస్ హాలోవీన్ పార్టీ జరిగిన నేపథ్యంలో కాల్పులు జరిగాయి. ఈ పార్టీలో 750 మంది విద్యార్థులు పాల్గోన్నారు. అప్పటి కాల్పుల నేపథ్యంలో ఇద్దరు మరణించగా, 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. తాజా కాల్పుల ఘటన నేపథ్యంలో ‘‘ఇవాళ నా కొడుకు సేఫ్ కానీ.. టెక్సాస్ క్యాంపస్ ఈ కాల్పుల కలకలంతో విసిగిపోయాం’’ అని ఓ తల్లి తన అందోళనను పంచుకుంది. ఇక ఇదే సమయంలో మరోమారు గన్ కల్చర్ నియమనిబంధనలను కఠినతరం చేయాలన్న డిమాండ్లు కూడా తెరపైకి వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles