Boy dies of starvation after being Isolated from family కరోనా కాటు: క్షుధ్భాదతో బాలుడి మృతి..

Boy with cerebral palsy dies after being isolated suspected of having wuhan virus

Pu Cheng, Wu, Cerebral Palsy, corona virus, China, Hubei, Wuhan Virus, Shejia Village, Huanggang City, Hong’an, china, human angle

A 17-year-old boy with cerebral palsy from Hubei, China unexpectedly passed away when he was forcibly isolated from his family for six days as they were suspected of being infected by the viral outbreak.

విధి పగబట్టిందా.? కరోనా కాటుకు కుటుంబం చిన్నాభిన్నం..

Posted: 02/04/2020 02:54 PM IST
Boy with cerebral palsy dies after being isolated suspected of having wuhan virus

తల్లిదండ్రులకు తోడు ఇద్దరు పిల్లలున్న కుటుంబంపై విధి అది నుంచి తన ప్రతీకారాన్ని తీర్చుకుంటోంది. వారి దాంపత్యకుటుంబానికి చిహ్నంగా పుట్టిన మొదటి బిడ్డ పుట్టుకతోనే విధి ఆ కుటుంబంపై తన ప్రతాపాన్ని చూపింది. తొలి సంతానమైన మగబిడ్డకు అంగవైకల్యం.. అడుగు తీసి అడుగు వేయలేదు. దీనికి తోడు అతడు మాట్లాడలేడు, ఇక తన అవసరాలను కనిపెట్టుకుని కన్నవారే అందులోనూ కన్నతల్లే అతడికి అన్ని సపర్యలు చేసేది. తన బిడ్డ ఆకలిని ఎరిగి ముద్ద ముద్ద కలిపి తినిపించేది. ఇలా తల్లి ఆ కొడుకును చూసుకుంటుందన్న ఈర్ష కలిగిందో ఏమో కానీ ఆ బాబుకు ఏడేళ్ల వయస్సులోనే విధి ఆ తల్లిని మృత్యువు రూపంలో దూరం చేసింది.

ఇక ఈ బాలుడితో పాటు ఏడాది వయస్సున్న చిన్నబ్బాయికి కూడా అన్ని తానే అయ్యి చూసుకుంటున్నాడా తండ్రి. తల్లి మరణించి పదేళ్లు అవుతున్నా ఇంకా బాగానే వున్నారని అనుకుందో ఏమో కానీ మరోసారి విధి ఆ కుటుంబాన్ని వెక్కిరించింది. అండగా ఉంటున్న తండ్రిపై ‘కరోనా’ కాటు వేసింది. కనీసం తోడుగా వుంటాడని భావించిన తమ్ముడిని కాలు వేసింది. దీంతో దివ్యాంగుడ్ని ఇంట్లో ఒంటరిగా వదిలేసి తండ్రి, చిన్నకొడుడు ప్రభుత్వ నిర్భంధంలోకి వెళ్లిపోయారు. అయితే తన ఆకలిని గుర్తించి ముద్దపెట్టే వారు లేకపోవడంతో క్షుద్భాదతో ఆ పెద్దబ్బాయి మరణించాడు. ‘కరోనా’ మహమ్మారి ప్రత్యక్షంగా తీస్తున్న ప్రాణాలకు తోడు ఇలా పరోక్ష మరణాలు కూడా ఎన్నో. కరోనా కాటుకు ఎన్నో కుటుంబాలు ఛిధ్రం అవుతున్నాయని ఈ ఘటనే ఉదాహరణ.

చైనాలోని హుబి ప్రావిన్స్ కు చెందిన యాన్‌ జియోవెన్‌ దంపతుల పెద్ద కుమారుడు యాన్‌ చెంగ్‌ వయసు 17ఏళ్లు. పుట్టుకతోనే సెరబ్రల్‌ పాల్సీ వ్యాధి రావడంతో అతడు కదల్లేడు, నడవలేదు.. దీనికి తోడు కనీసం మాట్లాడలేదు. చెంగ్‌ 11ఏళ్ల తమ్ముడు కూడా ఆటిజంతో బాధపడుతున్నాడు. కుమారులిద్దరూ అంగవైకల్యంతో పుట్టడంతో మనస్తాపానికి గురైన జియోవెన్‌ భార్య పదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అప్పటి నుంచి తండ్రి యాన్‌ జియోవెన్‌ అన్నీ తానై కొడుకులను కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నాడు.

ఇటీవల యాన్‌ జియోవెన్‌, తన రెండో కుమారుడితో కలిసి వుహాన్‌ వెళ్లొచ్చాడు. ఆ తర్వాత వీరిద్దరూ అనారోగ్యానికి గురవడంతో జనవరి 22న ఆసుపత్రిలో చేరారు. ఐదు రోజుల తర్వాత వీరికి ప్రాణాంతక కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అప్పటి నుంచి జియోవెన్‌, ఆయన చిన్న కొడుకును ఆసుపత్రివర్గాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. కాగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న పెద్దకొడుకు ఆకలి తీర్చాలని ఆయన సోషల్ మీడియా వేదికగా తన స్నేహితుల్ని, ఇరుగుపోరుగువారిని, బంధువులను కోరాడు.

అయితే ఇరుగుపోరుగు వారు ముందకు కోచ్చి అప్పటికే క్షుద్భాధతో నిరసించిన పెద్దబ్బాయికి జ్యూస్ ఇచ్చారు. ఇక మరుసటి రోజు ఉదయానికి ఆయన మరణించాడు. తండ్రి ఆసుపత్రికి వెళ్లినప్పటి నుంచి ఆహారం లేక జనవరి 29నే యాన్‌ చెంగ్‌ కన్నుమూశాడు. యాన్‌ మృతికి గల కారణాన్ని తెలుసుకున్న అధికారులు ఈ ఘటనపై జాయింట్ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి కారణాలను సేకరించనున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, మృతుడు యాన్ చెంగ్ కు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నామని అధికారులు పేర్కోన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Pu Cheng  Wu  Cerebral Palsy  corona virus  China  Hubei  Wuhan Virus  Shejia Village  Huanggang City  Hong’an  china  human angle  

Other Articles