Nirbhaya case: 'Shiv Tandav' over delay in execution నిర్భయ దోషులకు శిక్ష విధింపులో జాప్యంపై అనుష్క అగ్రహం

Nirbhaya case angry anushka performs shiv tandav over delay in execution

Transgenders, Balia, delay in execution, Nirbhaya convicts, Anushka, Shiv Tandav, shiv temple, Delhi court, postpone, death sentence, Asha Devi, Tihar Jail authorities, Nirbhaya case convicts, Tihar jail, Supreme Court, Additional Registrar, deputation basis, nirbhaya murder case Pawan Gupta, Mukesh singh, Vinay Sharma, Akshay Thakur, Nirbhaya, Murder, Rape, Supreme Court, gang-rape, Tihar jail, Uttar pradesh, Crime

Transgenders from UP's Balia are angered over the delay in execution of the death sentence to Nirbhaya convicts. In protest, transgender Anushka performs Shiv Tandav at a shiv temple. A Delhi court postponed the execution of death warrants of the four convicts till further order.

ITEMVIDEOS: నిర్భయ కేసు: దోషులకు శిక్ష విధింపులో జాప్యంపై అనుష్క శివతాండవం..

Posted: 02/03/2020 03:32 PM IST
Nirbhaya case angry anushka performs shiv tandav over delay in execution

దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో చివరాఖరి క్షణంలో శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఢిల్లీ న్యాయస్థానం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు పెల్లుబిక్కుతున్నాయి. నిర్భయ కేసులో దోషులు మూడో పర్యాయం తమ మరణశిక్షను వాయిదా వేసుకన్న తరుణంలో న్యాయశాస్త్రంలోని లోసుగులను బాగా అద్యయనం చేస్తున్న దోషులు ఇలా తప్పించుకుంటున్నారని నిర్భయ తల్లి ఆశాదేవి అవేదనను వ్యక్తం చేశారు. బీజేపి ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా ఇలాంటి కేసుల్లోని దోషులకు జీవించే హక్కులేదని వ్యాఖ్యానించారు.

నిర్భయ దోషులను జనవరి 22న ఉరి తీయాల్సి ఉండగా ఢిల్లీలోని పాటియాల కోర్టు ఫిబ్రవరి 1వ తేదికి వాయిదా వేసింది. కాగా, ఇవాళ ఉరి తీసేందుకు అన్ని ఏర్పాటు పూర్తి చేయగా, చివరి నిమిషంలో వాళ్లు ఉరిశిక్ష అమలుపై స్టే విధించిన న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఉరిశిక్షను అమలు చేయరాదని.. ఉరి ఆపాలని తీహార్ జైలు అధికారులకు తెలిపింది. దీంతో నిర్భయ దోషులకు ఉరి శిక్షను అమలు చేయడంతో జాప్యం జరగడంపై ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన హిజ్రాలు అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

న్యాయస్థానాలు ఇకపై న్యాయాన్ని అమలు చేయడానికి ఎలాంటి ఆంక్షలు, షరతులు విధించకుండా తక్షణం దోషులకు శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఉత్తర్ ప్రదేశ్ లోని బాలియాకు చెందిన హిజ్రాల బృందం స్థానికంగా వున్న ఓ శివాలయంలో శివతాండవ నృత్యాన్ని నిర్వహించారు. శివుడి ఆజ్ఞాతో ఇకపైనా దోషులకు శిక్ష పడాలని కోరుతున్న ట్రాన్స్ జెండర్ అనుష్క శివతాండవం నిర్వహించారు. అంతకుముందు వారు నిర్భయ కేసులో న్యాయం త్వరగా అమలు జరగాలని కోరుతూ ప్లకార్డులను ప్రదర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles