Amaravati protest continues for 48th day.. 48వ రోజుకు అమరావతి ఆందోళనలు..

Amaravati protest continues for 48th day jac passes reslutions

Amaravati JAC, Mangalagiri magistrate, AndhraPradesh Assembly, Amaravati, three capital, State Assembly, joint action committee, YS Jagan, Capitals, Visakhapatnam, kurnool, committee report, executive capital, legislative capital, judicial capital, Vijayawada, farmers, Andhra Pradesh, Politics

The protest of farmers of Amaravati region continues for 48th day, demanding Amaravati a single capital. Meanwhile Amaravati Joint Action committee passes few new resolutions after meeting farmers of Amaravati.

48వ రోజుకు అమరావతి ఆందోళనలు.. జేఏసీ తీర్మాణాలు

Posted: 02/03/2020 02:38 PM IST
Amaravati protest continues for 48th day jac passes reslutions

రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ బిల్లును తక్షణం ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న అమరావతి ప్రాంత రైతుల అందోళనలు నేటికి 48వ రోజుకు చేరకున్నాయి. అమరావతి గ్రామాల రైతులు, మహిళలు, విద్యార్థులు చేస్తున్న అందోళనలు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి.. పాలనా వికేంద్రీకరణ బిల్లను తక్షణం వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటలు సాగుతాయని ఆ ప్రాంత రైతులు స్పష్టం చేస్తున్నారు.

మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా రైతులు, మహిళలతో పాటు స్థానిక విద్యార్థి, యువజన నాయకులు ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అమరావతిపై విపక్షంలో వుండగా ఒకలా.. అధికార పక్షంలో వుండగా మరోలా నిర్ణయం తీసుకుంటామని ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఎందుకు చెప్పలేదని.. కనీసి ఈ విషయాన్ని వారి మానిఫెస్టోలోనైనా ఎందుకు జోడించలేదని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు మారినంత మాత్రమే తమ ప్రభుత్వ నిర్ణయాలు కూడా మారాలా.? అని ప్రశ్నిస్తున్నారు.

‘ప్రాణాలైనా అర్పిస్తాం ... అమరావతిని సాధిస్తాం’ అంటూ నినదించారు. పాలనా వికేంద్రకరణ ద్వారా అభివృద్ది సాధ్యమెలా అవుతుందని ప్రశ్నిస్తున్న నిరసనకారులు.. అభివృద్ది వికేంద్రీకరణకు అనుకూలంగా ఎందుకు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ నిర్వహిస్తున్న రైతుల ఆందోళనలు ఉదయం నుంచే కొనసాగుతున్నాయి. రాజధాని ప్రాంతాల్లోని 29 గ్రామాల్లో ఈ ఆందోళనలను కొనసాగుతున్నాయి. మందడం, తుళ్లూరు గ్రామాల్లో రైతులు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గోంటున్నారు.

మరోవైపు వెలగపూడిలో రైతుల నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. రాజధాని కోసం భూములిచ్చామని,  రైతుల త్యాగాలను గుర్తించకుండా ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఐదేళ్ల క్రితం తీసుకున్న భూములు ఇప్పుడు తిరగిస్తామని అంటున్నారని, ఏడాదికి మూడు పంటలు పండే భూములు తీసుకున్న ప్రభుత్వం రోడ్డు, కంకర వేసిన భూములను ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో 29 గ్రామాల ప్రజలను రోడ్డున పడేసి.. రాష్ట్రానికి గౌరవమైన రాజధాని లేకుండా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని వెనక్కితీసుకునేంత వరకు పోరాటం చేస్తామని రాజధాని రైతులు తెగేసి చెబుతున్నారు.

నిన్న మంగళగిరి మండలం నవులూరులో రంగిశెట్టి వెంకటేశ్వరరావు అనే రైతు.. తీవ్ర మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందారు. కాగా, ఇవాళ మరో మహిళా రైతు మరణించడంతో అమరావతి ప్రాంతంలోని మందడం గ్రామంలో విషాదం నెలకొంది. రాజధాని అంశంపై ఆవేదనతో భారతి (55) అనే మహిళా రైతు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఆమె మృతి చెందారు. రాజధాని కోసం ఆమె కుటుంబం తమకున్న అర ఎకరం భూమిని ఇచ్చింది. రాజధాని ఉద్యమంలో ఆమె చాలా చురుగ్గా పాల్గొన్నారు. ఒత్తిడిని జయించలేక చివరకు ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆమె మరణంతో ఆ ప్రాంతం విషాదంలో మునిగిపోయింది.

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అందోళనల్లో కొనసాగిన ఆయన తవ్ర మనస్తాపానికి గురై అసువులు బాసారు. రాజధానిపై అందోళనతో ఇవాళ తెల్లవారు జామున ఆయన మృతిచెందినట్లు బంధువులు చెబుతున్నారు. మృతుడి కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పరామర్శించారు. మరోవైపు రాజధాని పరిధిలోని మందడం, తుళ్లూరులో దీక్షలు కొనసాగుతున్నాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు ఆందోళనలు చేస్తున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

ఇదిలావుండగా.., రైతు సంఘాల నాయకులతో అమరావతి పరిరక్షణ సమితి నిర్వహించిన చర్చా కార్యక్రమం ముగిసింది. వివిధ జిల్లాల రైతు సంఘాల నాయకులు, జేఏసీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేసింది. రైతులు, మహిళలకు అండగా ఉండాలని, రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, రైతులకు ఎలాంటి అన్యాయం జరగకూడదని, అమరావతిలోని ప్రస్తుత భవనాల నిర్మాణాలను పూర్తి చేసి పాలన ఇక్కడి నుంచే సాగించాలని, అన్ని జిల్లాల అభివృద్ధి కోసం ప్రణాళిక రూపొందించాలని, అమరావతి రైతులకు మద్దతుగా జిల్లాల నుంచి బస్సు యాత్ర చేయాలని, ఏడాది కార్యక్రమాలపై దీర్ఘ కాలిక ప్రణాళిక రూపొందించాలని మొదలైన తీర్మానాలు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles