tiktok friends forces into prostitution, woman attempts suicide టిక్ టాక్ స్నేహితురాళ్లే కదా అని నమ్మితే.. ఒత్తడి.. మహిళ..

Woman attempts suicide as her friend forces her into prostitution in tamil nadu

Manoharan, Kadalkanni, Senji, Widow women, mother of Three, prostitution, TikTok Friends, suicide attempt, Suicide, Sathyamangalam women's police station, Sumathi, Latha, Kavita, TikTok, Viluppuram, chennai news, Tamil Nadu, Crime

In a freak incident, a woman has attempted suicide as her friend whom she met through TikTok forced her to do prostitution. This incident has happened in the Viluppuram district of Tamil Nadu.

వ్యబిచారం చేయాలని స్నేహితురాళ్ల ఒత్తడి.. మహిళ ఏం చేసిందంటే..

Posted: 01/28/2020 04:11 PM IST
Woman attempts suicide as her friend forces her into prostitution in tamil nadu

ఆనందంగా సాగుతున్న ఆమె జీవితం ఒక్కసారిగా అంధకారమయం అయ్యింది. నూరేళ్లు వుంటానని ప్రమాణం చేసిన భర్త అర్థాయుష్షుతోనే తనను ఒంటరి చేస్తే.. తన రెక్కల కష్టాన్ని నమ్ముకుని.. తనపై అధారపడిన ముగ్గురు పిల్లలను పోషించుకుంటున్న ఆమె అకస్మాత్తుగా తనువు చాలించాలనుకుంది. అమెను కూడా ఇబ్బంది పెట్టింది తాజా సాంకేతిక అస్త్రమే. తాను స్నేహితులుగా నమ్మిన మహిళలే తన పాలిట కాలయములుగా నిలిచారు. తీరని కష్టం, వీడని వేదన చెప్పుకుంటే తగ్గుతుందని అమె తన కష్టాలన్నీ స్నేహితులతో పంచుకుంటే.. వాటినే అసరగా చేసుకుని వ్యభిచారం చేయమంటూ వారే ఒత్తడి చేయడంతో పాటు బెదిరింపులకు కూడా దిగారు.

స్నేహితులు తనను బలవంతంగా రొంపిలోకి దింపుతున్నారని, రూ.2 లక్షలను ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారని వారిపై స్థానిక మహిళా పోలిస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేసింది. కష్టాలన్ని కట్టకట్టుకుని వచ్చినట్టు అమె విషయంలోనూ జరిగిందిదే. అమె పిర్యాదు పోలీసులు తీసుకున్నారే కానీ దాని వంక కనీసం పరిశీలనగా చూసింది కూడా లేదు. దీంతో ఇక తనకు మరణమే శరణ్యమనుకున్న మహిళ.. నిన్న రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే అమె కుటుంబసభ్యులు గమనించి అమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని విల్లుఫురం జిల్లాలోని సెన్జీ ప్రాంతంలోని సత్యమంగళం గ్రామానికి చెందిన బాధితురాలు తన భర్త అకాల మృతితో తన తల్లిదండ్రులు ఇంటి వద్దే వుంటోంది. అయితే తన ముగ్గురి పిల్లల చదువుల కోసం అమె చిన్నపాటి ఉధ్యోగం చేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే అమెకు కొంత ఊరటనిచ్చిన టిక్ టాక్ వీడియోలను చూస్తూ అమె తన కష్టాలను కొంతసేపు పక్కనబెట్టేది. ఈ టిక్ టాక్ ద్వారా పరిచయమైన ముగ్గురు మహిళలను నిజమైన స్నేహితులుగా భావించింది. వారికి తన కష్టాలన్నీ చెప్పుకుంది.

ప్రాణం లేని కాసులకే ప్రాయారిటీ ఇవ్వడం తప్ప మనస్సున్న మనుషులకు ఏ మాత్రం గౌరవం ఇవ్వని నేటి రోజుల్లో.. అమె స్నేహితులుగా బావించిన ముగ్గురు మరో అకు ఎక్కువగానే చదివేశారు. ఇటీవల టిక్ టాక్ యాప్ లో చెన్నైకి చెందిన సుమతి, లత, కవిత అనే ముగ్గురు టిక్‌ టాక్‌ యాప్‌ ద్వారా పరిచయమై స్నేహితులుగా మారారు. కొంతకాలం ఆమెతో స్నేహంగా ఉన్న ఆ మహిళలు తర్వాత తమ నిజస్వరూపం చూపారు. అంతే అమెను మరింత అంధకారంలోకి తోసే ప్రయత్నం చేశారు. కష్టపడి జీవనాన్ని నెట్టుకు రావడం ఏంటీ.. ఈజీగా డబ్బు సంపాదించాలని అగడకుండానే సలహాలు ఇచ్చారు.

అదెలా అంటే వ్యభిచారం చేయాలంటూ ఆమెను ఒత్తడి చేశారు. వారి మాటలు వినకపోవడంతో బలవంతపెట్టారు. అడగకుండా ఇచ్చిన సలహాకే తమకు డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అంతేకాదు ఇద్దరు పురుషులను పంపి రూ.2 లక్షలు ఇవ్వాలని, లేదంటే కిడ్నాప్‌ చేసి హత్యచేస్తామని బెదిరించడం మొలుపెట్టారు. దీంతో సదరు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు  చేసింది. అయితే.. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, వారి నుంచి బెదిరింపులు అధికం కావడంతో తట్టుకోలేని కడల్‌కన్ని ఆదివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుంది. వెంటనే గుర్తించిన కుటుంబీకులు ఉరితాడు తొలగించి చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చావు బతుకుల్లో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles