Nirbhaya convict was raped in Tihar jail ‘నిర్భయ’ దోషి పిటీషన్ పై తీర్పు రిజర్వు చేసిన సుప్రీం

Nirbhaya convict mukesh singh was raped in tihar jail claims his lawyer

Tihar Jail authorities, Nirbhaya case convicts, Tihar jail, Nirbhaya convicts hanging, Nirbhaya case, Nirbhaya convicts mercy petition, Satish Kumar Arora, Supreme Court, Additional Registrar, deputation basis, nirbhaya murder case Pawan Gupta, Mukesh singh, Vinay Sharma, Akshay Thakur, Nirbhaya, Murder, Rape, Supreme Court, gang-rape, Mount Elizabeth Hospital, Tihar jail, Crime

A bench of the Supreme Court of India today reserved its judgement over a petition filed by the lawyer of Mukesh Singh, one of the men convicted in the 2012 Delhi gang-rape case. The judgement will be announced on Wednesday.

‘నిర్భయ’ దోషి పిటీషన్ పై తీర్పు రిజర్వు చేసిన సుప్రీం

Posted: 01/28/2020 04:42 PM IST
Nirbhaya convict mukesh singh was raped in tihar jail claims his lawyer

దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీత తేదీ సమీపిస్తున్న కొద్దీ దోషుల వెన్నులో వణుకు పుడుతోంది. సభ్యసమాజం తలదించుకునేలా.. ఓ అభాగినిపై దేశరాజధాని వీధుల్లో కదులుతున్న బస్సులో అఘాయిత్యానికి ఒడిగట్టి అమెను దారుణంగా హింసించి హతమార్చారు. ఈ కేసుతో కొత్త నిర్భయ చట్టం అమల్లోకి వచ్చినా.. ఈ తరహా నేరాలకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పిడినా.. ఈ కేసులో మాత్రం బాధిత కుటుంబానికి న్యాయం జరగడం లేదు.

ఏడేళ్లు పూర్తి కావస్తున్నా.. ఈ కేసులో ఇప్పటికీ తమకు న్యాయం దక్కలేదని బాధితురాలి తల్లి అశాదేవి అవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా తమకు మరణం ఖాయమైందని తెలిసి.. దానిని తప్పించుకునేందుకు దోషులు కాలయాపన చేస్తున్నారన్న విషయం యావత్ దేశానికి కూడా అర్థమైంది. ఈ నేపథ్యంలో.. దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ పెట్టుకున్న పటీషన్ పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యవసర కింద ఈ పిటీషన్ ను విచారించింది.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన క్షమాభిక్ష పిటీషన్ ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ముఖేష్ సింగ్ తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటీషన్ ను ఇవాళ భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన అత్యున్నత న్యాయస్థాన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఈ విచారణ సందర్భంగా దోషి ముఖేశ్ సింగ్ సంచలన ఆరోపణ చేశాడు. తీహార్ జైల్లో తనపై అత్యాచారం జరిందని సుప్రీం కోర్టుకు ఫిర్యాదు చేశాడు. అతని న్యాయవాది అంజనా ప్రకాశ్ ఈ వివరాలు వెల్లడించారు.

ముఖేశ్ రాష్ట్రపతికి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణపై సమీక్ష జరపాలని ఆమె కోరారు. ‘కోర్టు నాకు మరణశిక్ష వేసింది. నాపై జైల్లో రేప్ జరిగినందుకు ఈ శిక్ష వేశారా? ఐదేళ్లుగా నాకు నిద్రలేదు. చావు కలలోకి వస్తోంది’ అని ముఖేశ్ తన పిటిషన్‌లో తెలిపాడు. నిబంధనలకు విరుద్ధంగా తనను జైల్లో ఒంటరిగా ఉంచారని ఆరోపించాడు. ఈ కేసులో మరో దోషి రాంసింగ్‌ను జైల్లో హత్య చేశారని, అయితే సూసైడ్ అంటూ కేసు మూసేశారని ముఖేశ్ న్యాయవాది చెప్పారు. అయితే ముఖేశ్ వాదనను సొలిసిటర్ జనరల్ తోసిపుచ్చారు. అతనిపై అత్యాచారం జరిగినా, దానికీ, క్షమాభిక్షకు సంబంధం లేదని అన్నారు. ఇక ఈ కేసులో న్యాయస్థాన ధర్మాసనం బుధవారానికి తీర్పును రిజర్వు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles