AP cabinet clears resolution to abolish Legislative Council మండలి రద్దు ఏపీ మంత్రివర్గం అమోదం.. కాసేపట్లో అసెంబ్లీలోకి..

Andhra pradesh cabinet clears resolution to abolish legislative council

YS Jagan, Amaravati, CRDA, AP Assembly, AP Legislative Council, Abolish, Three Capitals, Select Committee, HIghPower Committee report, Mangalagiri, mandadam, Tulluru, Amaravati JAC, joint action committee, Visakhapatnam, kurnool, committee report, executive capital, legislative capital, judicial capital, Jagan Mohan reddy, Andhra Pradesh, Politics

After receiving a setback in the upper house which referred the three-capital cities bill and CRDA repeal bill to the select committee, the AP cabinet on Monday passed a resolution to abolish the Legislative Council. The resolution passed by the cabinet chaired by chief minister YS Jaganmohan Reddy will now be moved in the Assembly.

మండలి రద్దు ఏపీ మంత్రివర్గం అమోదం.. కాసేపట్లో అసెంబ్లీలోకి..

Posted: 01/27/2020 11:45 AM IST
Andhra pradesh cabinet clears resolution to abolish legislative council

ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుతో పాటు అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ది మండలి రద్దు బిల్లుపై రాష్ట్ర శాసన మండలిలో వ్యతిరేకతను చవిచూసిన తరువాత  తెరపైకి వచ్చిన మండలి రద్దు అంశాన్ని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినేట్ ఇవాళ అమోదించింది. ఈమేరకు ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో సమావేశమైన ఏపీ క్యాబినెట్ ఈ మేరకు శాసనమండలి రద్దు తీర్మాణాన్ని ఏకగ్రీవంగా అమోదించింది. దీనిని వెనువెంటనే రాష్ట్ర శాసనసభలోనూ ప్రవేశపెట్టి.. అమోదించనుంది.

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తమ సంఖ్యాబలంతో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లులను శాసనమండలిలో సంఖ్యాబలం వున్న విపక్షం అడ్డుకోగలిగింది. ఈ రెండు బిల్లులు మండలిలోకి రాగా, టీడీపీ సభ్యులు రూల్ 71 తీసుకురావడం, ఈ రూల్ కే అనుకూలంగా ఓటు వేయడంతో బిల్లును చర్చకు అనుమతించకుండానే సెలెక్ట్ కమిటీ చైర్మెన్ కు పంపడంతో వైసీపీ షాక్ కు గురైంది. బిల్లులను ప్రవేశపెట్టిన వేళ.. మండలిలో ఏకంగా 22 మంది వైసీపీ మంత్రులు వున్నా.. ఎలాంటి ప్రభావాన్ని చాలేకపోయారని.. ఇదే భవిష్యత్తులో కొనసాగితే తమ ప్రభుత్వంపై అదిపత్యం విపక్షాలదవుతుందని భావించింది.

దీంతో మండలిని రద్దు చేయాలని వైసీపీ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో శాసనమండలి రద్దు విషయమై న్యాయనిపుణులతో సుదీర్ఘంగా చర్చించింది. ఆనంతరం ఇవాళ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో ఈ మేరకు సమావేశమైన క్యాబినెట్.. మండలి రద్దుకు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అనంతరం శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అసంబల్లీలో సంఖ్యబలం వున్నందున ఈ పనిని కూడా ఇవాళే ముగించే అవకాశం వుంది. అయితే బిల్లు అసెంబ్లీలో అమోదం పోందిన తరువాత దానిని తీర్మాణం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది.

ఈ తీర్మాణాన్ని పార్లమెంట్ ఉభయసభలు ఆమోదం పొందిన తర్వాత.. రాష్ట్రపతి నోటిఫై చేసిన తర్వాతే.. శాసనమండలి రద్దు కానుంది. అయితే లోక్ సభలో ఈ బిల్లును వెనువెంటనే కేంద్రం పెట్టాల్సిన పనిలేదు. లోక్ సభలో బిల్లు అమోదం పోందిన తరువాత రాజ్యసభలోనూ ఈ బిల్లు అమోదం పోందాల్సిన అవసరం వుంది. అయితే ఇప్పటికే రాష్ట్రం నుంచి పంపించిన అనేక తీర్మాణాలు కేంద్రం వద్ద పెండింగులో వున్నాయి. ఈ నేపథ్యంలో శాసన మండలి రద్దు తీర్మాణం ఇకపై కేంద్రం చేతిలోకి వెళ్లిపోయినట్టే. కేంద్రం ఎప్పుడు తమకు అనుకూలం అనుకుంటే అప్పుడు ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సయోధ్యను బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పార్లమెంట్ ఆమోదం లభించకపోతే మాత్రం.. శాసన మండలి రద్దు కష్టమేనని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles