Select Committee and Council funtions as usual: Yanamala ఏడాదిలో వైసీపీ మెజార్టీ.. ఇది జగన్ తుగ్లక్ నిర్ణయం: యనమల

Yanamala ramakrishnudu critises abolision of ap legislative council as tuglaq act

YS Jagan, Amaravati, CRDA, AP Assembly, AP Legislative Council, Three Capitals, Yanamala RamaKrishnudu, TDP MLC, Select Committee, President, Council chairman Shariif, Mangalagiri, mandadam, Tulluru, Amaravati JAC, joint action committee, Visakhapatnam, kurnool, committee report, executive capital, legislative capital, judicial capital, Jagan Mohan reddy, Andhra Pradesh, Politics

After AP Cabinet decision on abolish of Legislative council in state, TDP senior leader, former minister, MLC Yanamala Ramakrishnudu critises CM YS Jagan as Tuglaq. Even after resolution, the abolistion of council is done only after getting the approval in this regard from parliament. Untill that time Select committee and council funtions as usual on bills.

ఏడాదిలో వైసీపీ మెజార్టీ.. ఇది జగన్ తుగ్లక్ నిర్ణయం: యనమల

Posted: 01/27/2020 12:37 PM IST
Yanamala ramakrishnudu critises abolision of ap legislative council as tuglaq act

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరూ భావిస్తున్నట్లుగానే ఏపీ శాసనమండలి రద్దు చేపట్టిన తరుణంలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల పరిస్థితి ఏమిటన్న అందోళన సర్వాత్రా అమరావతి ప్రాంతంలోని రైతులతో పాటు రాష్ట్ర ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున్న వినిపిస్తోంది. అయితే ఈ బిల్లులను శాసనమండలి చైర్మన్ షరీఫ్ తన విక్షణాధికారాలతో బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపంచడం తెలిసిందే. మండలి రద్దుకు ఏపీ క్యాబినెట్ తీర్మాణం చేసిన పంపిన క్రమంలో సెలక్ట్ కమిటీ పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో తాజాగా స్పందించిన టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు శాసనమండలి రద్దుకు ఎంత సమయం పడుతుందో ఎవరూ చెప్పలేనిదని అన్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఈ బిల్లు అమోదం పొందడానికి కొన్ని సంవత్సారాల సమయం పడుతుందని మాత్రం తాను చెప్పగలనని అన్నారు. అయితే శాసన మండలి రద్దు జరిగినా సెలక్ట్ కమిటీని ఎవరూ రద్దు చేయలేరని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లులపై సెలెక్ట్ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సిందేనని అన్నారు.

అయితే ఈ బిల్లుల భవిష్యతును తేల్చేందుకు ఇంకా సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కాకపోవడం గమనార్హం. కాగా, సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కోసం సభ్యుల పేర్లు ఇవ్వాలని మండలి చైర్మన్ రాసిన లేఖలు ఈ రోజు పార్టీలకు చేరనున్నాయి. మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల నుండి సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీకి మూడు నెలల నుండి సాద్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఇప్పుడు మండలి రద్దు తీర్మానం ఆమోదించటంతో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అవుతుందని..మూడు నెలల నుండి సాధ్యమైంత త్వరగా నివేదిక కమిటీ ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు.

అదే సమయంలో మండలి సమావేశాలు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ అయ్యే వరకు యధాతధ స్థితి కొనసాగుతుందని కూడా యనమల స్పష్టం చేస్తున్నారు.  దీనికి చాలా సమయం పడుతుందని వెల్లడించారు. అధికార పార్టీ నిబంధనలు పాటించడం లేదని విమర్శించారు యనమల. ప్రొసిజర్ లేదు..వాళ్లిష్టం..కౌన్సిల్‌లో జరిగిన విషయాలను శాసనసభలో చర్చించే అధికారం లేదన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు ఒకతాటిపై ఉన్నారని..ఎలాంటి విషయాల్లో లొంగరని చెప్పారు. దీంతో.. బిల్లుల సైతం కమిటీ తమకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేసి నివేదిక ఇవ్వటంలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేవని యనమల సైతం స్పష్టం చేస్తున్నారు.

అంతేకాదు శాసనమండలిలో టీడీపీ బలం వుందని మండలినే రద్దు చేయాలన్న నిర్ణయం నిజంగా అవివేక చర్యగా చెప్పుకోచ్చారన. 2021 నాటికి మండలిలో టీడీపీ బలం తగ్గిపోయి, వైసీపీ నుంచే మెజారిటీ సభ్యులు ఉంటారన్నారు. అయినప్పటికీ మండలిని రద్దు చేయాలని జగన్ ఎందుకంత నిశ్చయంతో ఉన్నారో తెలియడం లేదన్నారు. మండలిలో ఖాళీ అయ్యే స్థానాలన్నీ వైసీపీ సొంతం చేసుకుంటుందని అనడంలో సందేహం లేదని, ఎమ్మెల్యేల కోటా సభ్యులను, గవర్నర్ నామినేషన్ సభ్యులను ఆ పార్టీ పొందుతుందని యనమల గుర్తు చేశారు. తమ పార్టీ బలం క్రమంగా పెరిగే సభను రద్దు చేయాలని భావించడం జగన్ అవివేకమని ఎద్దేవా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles