AP Govt approves high power committee report హై-పవర్ కమిటీ నివేదికను అమోదించిన క్యాబినేట్

Andhra pradesh government approves high power committee report

Amaravati, Amaravati farmers, high power committe, ap cabinet, mandadam, tension, Tension, Temples, joint action committee, YS Jagan, Capitals, Visakhapatnam, kurnool, committee report, executive capital, legislative capital, judicial capital, vanta varpu, Amaravati bandh, Jagan Mohan reddy, Andhra Pradesh vs Telangana, national interest, Vijayawada, farmers, Capital city, Amaravati, agitation, Andhra Pradesh, Politics

Andhra Pradesh Cabinet approves high power committee report today which was headed by the Cheif Minister YS Jagan Mohan Reddy, met at AP Secreteriat and approved Decentralization of ruling making visakhapatnam the executive capital and amaravathi as legislative capital just before the special assembly session.

హై-పవర్ కమిటీ నివేదికను అమోదించిన క్యాబినేట్

Posted: 01/20/2020 11:34 AM IST
Andhra pradesh government approves high power committee report

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనను వికేంద్రీకరించి రాష్ట్రంపై తనదైన ముద్ర వేసేందుకు ముఖ్యమంత్రి జగన్ తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో అమరావతి రైతుల నిరసనలు, ఆందోళనలను కూడా విస్మరించిన ఆయన ఇవాళ అమరావతిలోని సచివాలయంలో సమావేశమైన క్యాబినెట్ సమావేశంలో వికేంద్రీకరణకు అమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి వర్గ అమోదం పోందిన హైపవర్ కమిటీని నివేదికను అసెంబ్లీలో బిల్లుగా ప్రవేశపెట్టనున్నారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు ముందు ఈ మేరకు రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ది బిల్లుపై మంత్రివర్గ చర్చించి అమోదాన్ని తెలిపింది. మొత్తంగా ఏడు అంశాల అజెండగా మంత్రివర్గ సమావేశం కొనసాగింది. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇలా వున్నాయి.  హైవపర్‌ కమిటీ నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలపడంతో  రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లుకు ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో పాలనా రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి బిల్లుకు ఆమోదం పోందింది. ఇక అసెంబ్లీ తీర్మాణమే తరువాయి.

అమరావతిని ఏకైక రాజధానిగా ఉండకపోవడంతో ఈ ప్రాంతంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాపిటల్ రీజనల్ డెవిలప్ మెంట్ అధారిటీ (సీఆర్‌డీఏ)ను రద్దు చేస్తూ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అదే సమయంలో ఈ ప్రాంతంలో జరిగిన ఇన్ సైడర్‌ ట్రేడింగ్ కు సంబంధించి లోకాయుక్త విచారణకు ఆమోదం తెలిపింది. అయితే భూసేకరణలో భాగంగా భూములను ఇచ్చిన రైతులకు శాసన రాజధాని ప్రాంతంలో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

పులివెందులలో అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఏఎంఆర్డీఏ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు చేయడం పట్ల తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదం ప్రకటించిన క్యాబినేట్..  రైతుల కూలీలకు ఇచ్చే పరిహారాన్ని రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంపుతూ తీసుకున్న నిర్ణయానికి కూడా అమోదముద్ర వేసింది. రైతులకు 15 ఏళ్లపాటు కౌలు చెల్లించేందుకు నిర్ణయానికి కూడా క్యాబినేట్ అమోదం తెలిపింది.

విశాఖ కేంద్రంగా సచివాలయం కార్యకలాపాలు సాగించడంతో పాటు అమరావతిలో శాసన రాజధానిని కూడా ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి అమోదం లభించింది. అదే క్రమంలో హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు కూడా మంత్రివర్గం అమోదం తెలిపింది. దీంతో పాటు రాష్ట్రాన్ని 4 పరిపాలన జోన్లులా విభజించాలని తీసుకున్న నిర్ణయానికి కూడా అమోదం దక్కింది. జిల్లాల విభజన తర్వాత సూపర్‌ కలెక్టరేట్ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్ని నిర్ణయానికి కూడా అమోదం తెలిపిన క్యాబినెట్.. అటు విశాఖతో పాటు ఇటు అమరావతిలోనూ  మంత్రులు అందుబాటులో ఉండాలని నిర్ణయం తీసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles