CBN condemns house arrest of former MLAs, TDP leaders మూడు రాజధానుల ఆమోదం: చీకటి రోజుగా చంద్రబాబు అభివర్ణన

Chandrababu says today is black day on ap cabinet approving three capitals

Chandrababu, Assembly, TDP MLA, TDP MLC, Vijayawada, Assembly padayatra, amaravati villagers, arrest, huge police force, Amaravati, Visakhapatnam, executive capital, legislative capital, judicial capital, Amaravati farmers, vanta varpu, Amaravati bandh, Jagan Mohan reddy, Andhra Pradesh vs Telangana, national interest, Vijayawada, farmers, Capital city, Amaravati, agitation, Andhra Pradesh, Politics

TDP Chief N Chandrababu Naidu has condemned the house arrest of his party leaders and former MLAs ahead of the special of the state assembly on three capitals issue put forward by Andhra Chief Minister YS Jagan Mohan Reddy.

మూడు రాజధానుల ఆమోదం: చీకటి రోజుగా చంద్రబాబు అభివర్ణన

Posted: 01/20/2020 12:22 PM IST
Chandrababu says today is black day on ap cabinet approving three capitals

అమరావతిలోనే రాష్ట్ర రాజధానిని కొనసాగించాలని.. మూడు రాజధానుల ప్రతిపాదన మూర్ఖపు నిర్ణయమి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానులను అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఒక రాష్ట్రం ఒకే రాజధాని అనేది 5 కోట్ల ప్రజల ఆకాంక్షగా చెప్పుకోచ్చారు. కేవలం ఒక వర్గం నేతల ఆర్థిక, రాజకీయ లభ్ది కోసమే మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చారని తీవ్రంగా ఫైర్ అయ్యారు.

రాజధాని అంశంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద చంద్రబాబు అధ్యక్షతన తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కాలినడకన అసెంబ్లీకి బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్ కోసం బంగారం పండే భూములను ఇచ్చిన రైతులకు నిత్యం అండగా వుంటామని చెప్పారు. భావితరాల కోసo పోరాడతామని, అమరావతిని నిలబెట్టుకుంటామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 3 రాజధానుల ప్రతిపాదనకు ఒప్పుకోమన్నారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న వారిని అరెస్టు చేయడాన్ని పిరికిపంద చర్యగా చంద్రబాబు అభివర్ణించారు.

సీఎం వైఎస్ జగన్ అరాచకాలకు అంతులేకుండా పోయిందని, ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పే కాలం దగ్గరలోనే ఉందని వ్యాఖ్యానించారు. అమరావతిలో జరిగే నిరసనలను అడ్డుకోవడం, ఐకాసతో పాటు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ లు చేయడం హేయమైన చర్యని మండిపడ్డారు. పోలీసులను అడ్డు పెట్టుకుని జగన్ రెచ్చిపోతున్నారని, ప్రజల్లో ఆందోళనను పెంచుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం అమరావతిలో ఎమర్జెన్సీ సమయంలో ఉన్న నిర్బంధం కన్నా అధికంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పౌర హక్కులకు భంగం కలుగుతోందని ఆయన ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో ప్రభుత్వ చర్యలను అడ్డుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గృహ నిర్బంధం చేసిన తమ నేతలను వెంటనే విడిచి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amaravati farmers  Chandrababu  Assembly  TDP MLA  TDP MLC  Vijayawada  YS Jagan  Capitals  Andhra Pradesh  Politics  

Other Articles