Ukrainian jet was 'unintentionally' shot down ఉక్రెయిన్ విమానాన్ని కూల్చింది మేమే..

Iran plane crash ukrainian jet was unintentionally shot down

Boeing737, UIA737Crash, Ukraine International Airlines, Tehran, Kyiv Boryspil, Imam Khomeini International Airport, Iran's state television, America, Crime

Iran has admitted "unintentionally" shooting down a Ukrainian passenger jet, killing all 176 people on board. An investigation found that "missiles fired due to human error", President Hassan Rouhani said. He described the crash as an "unforgivable mistake".

ఉక్రెయిన్ విమానాన్ని కూల్చింది మేమే.. ఎట్టకేలకు అంగీకారం

Posted: 01/11/2020 07:25 PM IST
Iran plane crash ukrainian jet was unintentionally shot down

ఇరాన్ రాజధాని ట్రెహన్ సమీపంలో ఉక్రెయిన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం కుప్పకూలిన ఘటనలో ప్రపంచదేశాలు వ్యక్తం చేసిన అనుమానాలే నిజమయ్యాయి. ఆ విమానాన్ని తామే కూల్చినట్లు ఇది సంక్షోభ పరిస్థితుల్లో మానవ తప్పిదం వల్ల జరిగిందని ఇరాన్‌ మిలిటరీ వెల్లడించింది. తాము ఉద్దేశపూర్వకంగా విమానాన్ని కూల్చలేదని, మానవ తప్పిదం కారణంగానే అలా జరిగిందని మిలిటరీ విభాగం చెబుతోంది. ఉక్రెయిన్‌ విమానం రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన మిలిటరీ కేంద్రం వైపు రావడంతో దాన్ని శత్రు దేశపు విమానంగా భావించామని తెలిపింది.

ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని, ఆ సమయంలో విమానం ఆ ప్రాంతంలో కనబడటంతో వెంటనే కూల్చినట్లు చెప్పింది. గత బుధవారం తెల్లవారుజామున టెహ్రాన్‌ విమానాశ్రయం నుంచి ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు బయల్దేరిన ఉక్రెయిన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బెయింగ్‌ 737 విమానం టేకాఫ్‌ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 176 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో ఉక్రెయిన్‌ దేశస్థుల కంటే విదేశీయులే ఎక్కువగా ఉన్నారు. ఇరాన్‌కు చెందిన 82 మంది, కెనడాకు చెందిన 63 మంది ప్రయాణికులున్నారు.

ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు జరిగిన కొద్ది గంటలకే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం పలు అనుమానాలు తలెత్తాయి. ఈ ప్రమాదం వెనుక ఇరాన్‌ దళాల హస్తం ఉన్నట్లు అమెరికా, కెనడా సహా పలు దేశాలు ఆరోపించాయి. విమానాన్ని ఇరాన్‌ గగనతల రక్షణ వ్యవస్థకు చెందిన రెండు క్షిపణులు కూల్చినట్లు తమకు ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి సమాచారం వచ్చినట్లు కెనడా ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు విమానాన్ని క్షిపణి ఢీకొన్న వీడియో ఒకటి నిన్న సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది.

దీంతో ప్రమాదంపై ఇతర దేశాల అనుమానాలు మరింత బలపడ్డాయి. మరోవైపు ఇరాన్‌ మాత్రం మొదటి నుంచీ ఈ ఆరోపణలను వ్యతిరేకిస్తూనే వచ్చింది. విమానానికి గాల్లో మంటలు అంటుకోలేదని కూలిన తర్వాత పేలిపోయిందని చెప్పింది. అయితే ప్రమాదంలో లభించిన విమాన బ్లాక్‌బాక్స్‌ను ఇచ్చేందుకు మాత్రం నిరాకరించి ప్రమాదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో విమానాన్ని క్షిపణి ఢీకొన్న వీడియో బయటకు రావడంతో ఇరకాటంలో పడిన ఇరాన్‌.. అసలు నిజాన్ని చెప్పక తప్పలేదు.

కాగా, ఈ ఘటనపై ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహనీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమ వల్ల జరిగిన క్షమించరాని తప్పిదం కారణంగా 176 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. దీనికి తాము ఎంతగానో చింతిస్తున్నామని అన్నారు. ప్రమాదంపై ట్విటర్‌ వేదికగా స్పందించిన రౌహనీ.. ‘మానవ తప్పిదంతో క్షిపణులను ప్రయోగించడం వల్లే దురదృష్టవశాత్తూ ఉక్రెయిన్‌ విమానం కూలిపోయినట్లు సాయుధ బలగాల అంతర్గత దర్యాప్తులో తేలింది.

తమ వల్ల జరిగిన క్షమించారని తప్పిదం కారణంగా 176 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనకు కారకులను గుర్తించి దర్యాప్తు కొనసాగిస్తాం. ఈ ఘోరమైన తప్పిదానికి ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్ ఇరాన్‌ విచారం వ్యక్తం చేస్తోంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నా’ అని రౌహనీ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. కాగా, కెనడా మాత్రం దోషులు ఎవరైనా సరే వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh