Nirbhaya case: Convicts to be hanged on 22 January నిర్భయ దోషుల మరణశిక్ష తేదీ ఖరారు.. ఉరికంబాలు సిద్దం..

Nirbhaya rape murder case all 4 nirbhaya case convicts to be hanged on jan 22

mercy petition, Nirbhaya case convicts, Tihar jail, Nirbhaya convicts hanging, Nirbhaya case, Nirbhaya convicts mercy petition, nirbhaya murder case Pawan Gupta, Mukesh singh, Vinay Sharma, Akshay Thakur, Nirbhaya, Murder, Rape, Supreme Court, gang-rape, Mount Elizabeth Hospital, Tihar jail, Crime

Four convicts in the 2012 Nirbhaya gangrape and murder case will be hanged on 22 January at 7 am in Tihar jail, a Delhi court said today. The order was pronounced by Additional Sessions Judge Satish Kumar Arora who issued death warrants against them.

నిర్భయ దోషుల మరణశిక్ష తేదీ ఖరారు.. ఉరికంబాలు సిద్దం..

Posted: 01/07/2020 05:40 PM IST
Nirbhaya rape murder case all 4 nirbhaya case convicts to be hanged on jan 22

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక హత్యాచార కేసులోని నలుగురు దోషులు డెత్ డేట్ కన్ఫామ్ అయ్యింది. ఇంటికి వెళ్లేందుకు తన స్నేహితుడితో కలసి ప్రైవేటు బస్సును ఆశ్రయించిన పారామెడికల్ విద్యార్థినిపై కదులుతున్న బస్సులోనే పాశవిక చర్యకు పాల్పడి.. కొన్ని గంటల పాటు అమెకు నరకాన్ని చూపిన మగ పైశాచిక మృగాళ్లకు ఎట్టకేలకు మరణశిక్ష తేదీని న్యాయస్థానం ఖరారు చేసింది. ఏడేళ్లుగా తమ చావును తప్పించుకునేందుకు అన్ని ప్రయత్నాలు విఫలమైన తరువాత న్యాయస్థానం వారికి డెత్ డేట్ ను డిక్లేర్ చేసింది.

ఏడేళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన న్యాయవిచారణ తరువాత.. చివరి అస్త్రంగా దోషులు దాఖలు చేసుకున్న క్షమాబిక్ష పిటీషన్లను కూడా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించిన నేపథ్యంలో నిర్భయ కేసు దోషులకు ఎట్టకేలకు శిక్ష విధించే తేదీ ఖరారయ్యింది. ఇవాళ పటియాల కోర్టు న్యాయమూర్తి శిక్ష అమలు తేదీని ఖరారు చేశారు. తేదీని ఖరారు చేసే ముందు న్యాయమూర్తి దోషులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తుది విడతగా వారేం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకునేందుకు పటియాలా కోర్టు న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని వినియోగించుకున్నారు.

వీడియో కాన్ఫరెన్స్ తర్వాత న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. నిర్భయ కేసు దోషులు నలుగురికి ఓకే రోజు, ఓకే సారి ఉరి శిక్ష అమలంటూ డెత్ సెంటెన్స్ జారీ చేశారు పటియాలా కోర్టు న్యాయమూర్తి. జనవరి 22వ తేదీన ఉదయం 7 గంటలకు నలుగురు దోషులకు ఓకేసారి ఉరి శిక్ష వేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు నిర్భయను అత్యంత కిరాతంగా సామూహిక హత్యాచారం చేసిన ముఖేశ్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్ లను జనవరి 22న ఉదయం 7 గంటలకు తీహార్ జైలులో కొత్తగా ఏర్పాటు చేసిన ఉరికంబాలపై ఉరి తీస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nirbhaya  Murder  Rape  convicts  Tihar jail  gallows  hanging  mercy petition  New Delhi  crime  

Other Articles