Book RSS chief for his 130 crore Hindus’ remark: VH తన పిర్యాదుపై ఎఫ్ఐఆర్ ఏదన్న వీహెచ్.. ఠాణాలో హల్ చల్

Book rss chief for his 130 crore hindus remark v hanumantha rao

Hanumantha Rao, Mohan Bhagwat, RSS, Congress, Rahul Gandhi, Hindus, Kishan Reddy, Home minister for state, chaukidar chor hai comment, Supreme Court, Telangana, National Politics

Veteran Congress leader V Hanumantha Rao said, “Rahul Gandhi was booked for making the ‘chaukidar chor hai’ comment and forced repeatedly to apologise in the issue. Then, why was a case not registered against Bhagwat for his “130 crore Indians are Hindus” remark?”

తన పిర్యాదుపై ఎఫ్ఐఆర్ ఏదన్న వీహెచ్.. ఠాణాలో హల్ చల్

Posted: 01/07/2020 04:49 PM IST
Book rss chief for his 130 crore hindus remark v hanumantha rao

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో హల్ చల్ చేశారు. తానిచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆయన పోలీసు అధికారులను ప్రశ్నించారు. పోలిస్ స్టేషన్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అధికారంలో వున్న నేతలపై పిర్యాదు తీసుకోరా.? అంటూ మండిపడ్డారు. కేసు పెట్టలేదని పోలీసు అధికారులతో ఆయన వాగ్వాదానికి దిగారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దానిపై కేసు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. పోలీసుల సమాధానంతో సంతృప్తి చెందన వి.హెచ్ ఈ విషయంలో తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని పోలీసులను హెచ్చరించారు.

మంగళవారం మధ్యాహ్నం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న హనుమంతరావు సి.ఐ, ఎస్.ఐ.లతో భేటీ అయ్యారు. తను వారం రోజుల కిందట ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పైన ఇచ్చిన ఫిర్యాదుపై కేసు ఎందుకు నమోదు చేయలేదని వి.హెచ్. పోలీసు అధికారులను నిలదీశారు. తాము న్యాయనిపుణుల అభిప్రాయాలను తీసుకున్నామని, ఇందులో కేసు నమోదు చేసే అంశాలు లేవని.. అందుకే కేసు నమోదు చేయలేక పోయామని పోలీసులు సమాధానమిచ్చారు. దాంతో విహెచ్ ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులు కొన్ని పార్టీలపై పట్ల సానుకూలంగా వ్యవహరిస్తూ.. మరికొన్ని రాజకీయ పార్టీల నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆయన అరోపించారు.

చౌకిదార్ చోర్ అన్నందుకు రాహుల్ గాంధీపై కేసు పెట్టి.. ఎన్నికల సమయంలో బలవంతాన అడిగించుకుని క్షమాపణ చెప్పించుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సెక్యూలర్ దేశమైన భారత్ తోని 130 కోట్ల మంది హిందువులేనంటూ మిగిలిన మతాలవారి మనస్సులను గాయపర్చిన ఆర్.ఎస్.ఎస్. చీఫ్ మోహన్ భగవత్‌పై కేసు ఎందుకు పెట్టరని వీహెచ్ ప్రశ్నించారు. మోహన్ భగవత్ ప్రకటన చేసిన తరువాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దేశంలో అన్ని మతాలు సమానమని వ్యాఖ్యానించారని అన్నారు. వీరిద్దరిలో ఎవరి మాటలను నమ్మలాని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో పోలీసులిచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని విహెచ్.. హైకోర్టును ఆశ్రయిస్తానంటూ పోలీస్ స్టేషన్ నుంచి నిష్క్రమించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : VH  V. Hanumantha Rao  Mohan Bhagwat  RSS  Congress  Rahul Gandhi  Hindus  Supreme Court  National Politics  

Other Articles