The special arrangements were made to allow for a solar eclipse ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి మరి సూర్య గ్రహణాన్ని చూడడానికి అవకాశం కలిపించారు

The special arrangements were made to allow for a solar eclipse

solar eclipse 2019, Sun, Moon, Surya Grahanam, Special Poojas

The special arrangements were made to allow people to view for solar eclipse

ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి మరి సూర్య గ్రహణాన్ని చూడడానికి అవకాశం కలిపించారు

Posted: 12/26/2019 03:06 PM IST
The special arrangements were made to allow for a solar eclipse

అరుదైన జగతి. అబ్బురపరిచే  ఎన్నో ఎన్నెన్నో కోలాహలపు  జల్లు. అందులో సూర్య మరియు చంద్రుల భాగం వారి  సోయగం  వర్ణనా తీతం. అందు సూర్య గ్రహణం మరియు చంద్ర గ్రహణం  వాటి  రహస్యాల   గురించి ఎన్నో  ఎన్నెన్నో రాగాలు  ఈ జీవిలో. నేడు  సూర్య గ్రహణం  అందాల నీలాకాశం లో ఓ అద్భుతం. అంతే కాక నేటి  ఈ సూర్య గ్రహణానికి ఎంతో విశిష్టత  కూడా ఉంది. సుమారు ఒక పది  సంవత్సరాల తర్వాత వచ్చిన సంపూర్ణమైన సూర్యగ్రహణం ఇది. ఉదయం  8.15  నిమిషాలకు ఆరంభమైన ఈ దృశ్యం  సుమారు ఒక మూడు గంటలపాటు సాగింది. ఈ  దృశ్యం  అరుదుగా సంభవిస్తుంది కావున మన ఇరు రాష్ట్రాల నుండి తెలుగు ప్రజలు, చిన్నారులు ,పెద్దలు మరియు  విద్యార్థులు  ఎంతగానో ఆసక్తి కనబరిచి, తిలకించారు.. సూర్య గ్రహణం అనంతరం దేవాలయాలను శుద్ధి  చేసారు,అటు పిమ్మట భక్తులు దైవ  దర్శనంతో  సంతృప్తి  చెందారు. అంతేకాక ఈ సూర్య గ్రహణాన్ని తదేకంగా  మనం  ఎటువంటి  పరికరాలు లేకుండా చూడకూడడు. అలా  చూస్తే మన కన్నులకు హాని. అంతే కాక అలా చూస్తే  కన్నులు  శాశ్వతంగా పోయే అవకాశం కూడా ఉంది.. అందుకే కొన్ని  ప్రాంతాలలో  కొన్ని ప్రత్యేక మైన ఏర్పాట్లు చేసి మరి సూర్య గ్రహణ దృశ్యాన్ని చూపిస్తున్నారు.

విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసారు సూర్య గ్రహణన్ని చూడడానికి. ప్రత్యేకంగా  ఏర్పాటు  చేయబడిన సోలార్ ఫిల్టర్ పరికరం ద్వారా విద్యార్థులు సూర్య గ్రహణన్నీ  వీక్షించారు.. అంతేకాకుండా విద్యార్థులకు సూర్య గ్రహణం గురించి, దాన్ని ప్రాముఖ్యతను. అది ఎలా ఏర్పడుతుందో వర్ణించారు. అంతేకాకుండా ఇరు తెలుగు రాష్ట్రాలలో పలు పలు ప్రదేశాలలో  ప్రత్యేకమైన  ఏర్పాట్లు చేసి మరి సూర్య గ్రహణాన్ని  చూడడానికి అవకాశం కలిపించారు.

(Video Source: ETV Telangana)

కేతుగ్రస్త సూర్య గ్రహణాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రం లోని జగిత్యాల  జిల్లా లోని కోరుట్ల ప్రాంతంలో అయ్యప్ప గుట్ట పై  రాహుకేతు నవ నాగు ఆలయంలో సామూహిక రాహు కేతా నివారణ పూజలు జరిపించారు.

సూర్య గ్రహణం కారణంగా రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు మూసి వేశారు కానీ ఈ దేవాలయం లో పూజలు చేయడం  అనేది   విశేషం.. భక్తులు పలు సంఖ్యలో వచ్చి పూజలు ఆచరించారు.

ఇదిలా ఉంటే ఈ అరుదైన సూర్య గ్రహణాన్ని వరంగల్ వాసులు చూడలేక పోయారు కారణం నీలాకాశంలో  మబ్బులు క మ్ముకోవడం తో  ఈ దృష్జ్యాన్ని వాళ్ళు వీక్షించలేక పోయారు.

ఎంతో ఆశతో ఆసక్తితో వీక్షించాలనుకున్నా వరంగల్ వాసులు నిరాశకు గురైయ్యారు. జనగామలో పాక్షికంగా సూర్య గ్రహణం కనిపించింది..అంతే కాక పలు చోట్ల చిరు జల్లులు కురిసాయి.

ఇలా  సూర్యగ్రహం మన అందరి మదిలో చిరు ఆశలను పలు లోచనలను కురిపించింది.

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : solar eclipse  Sun  Moon  

Other Articles