Nirbhaya Convicts filing curative petition నిర్భయ కేసు: క్షమాభిక్ష పిటీషన్ దాఖలు చేసిన దోషులు

Three death row convicts in 2012 nirbhaya case to file curative mercy petitions

mercy petition, curative petition, Justice R Banumathi, Justice Ashok Bhushan, Justice A S Bopanna, Pawan Gupta, Mukesh singh, Vinay Sharma, Akshay Thakur, Nirbhaya, Murder, Rape, Supreme Court, gang-rape, Mount Elizabeth Hospital, Tihar jail, Crime

Three of the four men on death row for committing the 2012 Delhi gang-rape will be filing mercy and curative petitions. They have told the Tihar Jail authorities that they still have the option of a curative petition before filing the mercy plea, officials said

నిర్భయ కేసు: క్షమాభిక్ష పిటీషన్ దాఖలు చేసిన దోషులు

Posted: 12/24/2019 03:54 PM IST
Three death row convicts in 2012 nirbhaya case to file curative mercy petitions

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక హత్యాచార కేసులోని దోషులు తమ చావును తప్పించుకునేందుకు చివరాఖరి అస్త్రాన్ని సంధించారు. ఈ కేసులోని ముగ్గురు దోషులు తమకు విధించబడిన ఉరిశిక్ష నుంచి ఉపశమనం కలిగించాలని కోరుతూ క్షమాబిక్ష పిటీషన్ వేశారు. దేశ సర్వో్న్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఇవాళ ఇందుకు సంబంధించిన పత్రాలను ధాఖలు చేయాలని కోరుతూ తీహార్ జైలు అధికారులకు దోషులు అందజేశారు.

అయితే ఇటీవలే ఈ కేసులోని నాలుగో దోషి పవర్ కుమార్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ ను ఢిల్లీహైకోర్టు సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. కాగా, ఈ నెల ప్రారంభంలోనే దోషులకు వారం రోజుల గడువును ఇచ్చిన జైలు అధికారులు.. ఈ లోగా వారు క్షమాభిక్ష పిటీషన్ దాఖలు చేసుకోవాలా వద్దా.? అనే అంశంపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మరోవైపు ఈ నెల 19న పవన్ కుమార్ గుప్తా తరపు ఆయన న్యాయవాది దాఖలు చేసిన పిటీషన్ ను ఢిల్లీ హైకోర్టు తోపిపుచ్చింది.

నేరం జరిగన సమయానికి తమ క్లైయింట్ మైనర్ అని.. దీనిని సమీక్షించాలని కోరుతూ ఆయన పిటీషన్ దాఖలు చేశారు. తనకు జువెనైల్ కోర్టు శిక్షను ఖరారు చేయాలని ఆయన కోరగా, ఆ పిటీషన ను న్యాయస్థానం కొట్టివేసింది. గతంలోనే అన్ని అంశాలను పరిశీలించి దోషులుగా నిర్ధారించి శిక్షలను ఖారారు చేసినట్లు న్యాయస్థానం ఉద్ఘాటించింది. ఇదే క్రమంలో అక్షయ్ కుమార్ సింగ్ అనే దోషి దాఖలు చేసిన పిటీషన్ ను సైతం దేశ సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

ఢిల్లీలోని కాలుష్యంతో ఇప్పటికే సగం చావుకు దగ్గరైన తనకు ఉరిశిక్ష నుంచి మినహాయింపు కల్పించాలని.. ఢిల్లీ గాలిని పీలుస్తూనే చస్తామని అక్షయ్ సింగ్ పిటీషన్ దాఖలు చేయగా, అత్యున్నత న్యాయస్థాన త్రిసభ్య ధర్మాసనం దానిని కొట్టివేసింది. అయితే ఈ సందర్భంగా న్యాయస్థాన దర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నలుగురు నిందితులను ఉరి తీయాల్సిందేనని అభిప్రాయపడింది. దోషులపై ఎలాంటి దయ అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ తరుణంలో దోషులు మరోమారు రివ్యూ పిటీషన్లను అఖరి అస్త్రంగా సమర్పించేందుకు సన్నాహలు చేయడం కూడా కీలకంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nirbhaya  Murder  Rape  Supreme Court  gang-rape  mercy petition  curative petition  Tihar jail  crime  

Other Articles