Andhra Pradesh may have three capitals: Jagan ‘‘నవ్యాంధ్రకు మూడు రాజధానులు..’’: సీఎం వైఎస్ జగన్ సంచలనం

Andhra pradesh may have three capitals says chief minister ys jagan

Chief Minister, YS Jagan, Capitals, Amaravati, Visakhapatnam, kurnool, Assembly, committee report, executive capital, legislative capital, judicial capital, Andhra Pradesh, Politics

Strongly advocating for decentralised development in the state, Andhra Pradesh chief minister Jagan Mohan Reddy hinted on Tuesday that the state may have three capitals- Vishakhapatnam, Amaravati, Kurnool.

‘‘నవ్యాంధ్రకు మూడు రాజధానులు..’’: సీఎం వైఎస్ జగన్ సంచలనం

Posted: 12/17/2019 07:27 PM IST
Andhra pradesh may have three capitals says chief minister ys jagan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో అనేక ఊహాగానాలకు తావిచ్చిన వైఎస్ జగన్ సర్కార్.. ప్రజల్లో ఉన్న సందిగ్ఘతకు ఎట్టకేలకు సంకేతాలు ఇచ్చింది. రాజధాని అంశంలో రేగిన వివాదాన్ని అమరావతి నుంచి తరలించే సమస్యే ఉత్పన్నం కాదని స్పష్టం చేసిన ప్రభుత్వం.. అధికార వికేంద్రీకరణపై దృష్టి సారించింది. దీంతో నవ్యాంధ్రకు మూడు రాజధానులు వుంటాయన్నట్లు ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్  సంకేతాలను ఇచ్చారు. అయితే ఈ విషయమై కూడా కమిటీని వేశామని వారు సమర్పించిన నివేదిక ఆధారంగానే తాము చర్యలు తీసుకుంటామని అన్నారు.

అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజైన ఇవాళ సాక్ష్యాత్తు అసెంబ్లీలో ప్రసంగించిన ముఖ్యమంత్రి రాష్ట్ర రాజధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ మనకు అవసరమన్న జగన్.. ఆంధ్రప్రదేశ్‌కు బహుశా మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందన్నారు. విశాఖలో సెక్రటేరియట్ నిర్మాణం జరిపితే అదే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావొచ్చన్న సీఎం.. కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చని వ్యాఖ్యానించిన ఆయన ఇకపై కర్నూలు జుడీషియల్ క్యాపిటల్ గా మారే అవకాశాలున్నాయన్నారు. ఇక ఇప్పటివరకు నవ్యాంధ్ర సంపూర్ణ రాజధానిగా భావిస్తున్న అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉండొచ్చన్నారు.

దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయి. ఈ తరహా అభివృద్ధి వికేంద్రీకరణ మనకు అవసరం అన్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు పెద్ద ఖర్చేమీ అవసరం ఉండదన్నారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ఏపీ రాజధానిపై నిర్ణయం తీసుకుంటామని జగన్ తెలిపారు. త్వరలోనే కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. ఏపీ రాజధానిపై జగన్ ఇచ్చిన సంకేతాలు రాజకీయంగా సంచలనంగా మారాయి. చంద్రబాబు అమరావతిని రాజధానిగా అనుకొని.. తన బినామీలతో భూములు కొనిపించారు.

తర్వాతే రాజధానిగా ప్రకటించారని జగన్ ఆరోపించారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి మౌలిక వసతుల కల్పన కోసం 53 వేల ఎకరాలకు లక్షా తొమ్మిది వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుందని చంద్రబాబు నాయుడే చెప్పారు. దీనికి వడ్డీలు ఎంతవుతాయో తెలీదని జగన్ చెప్పారు. ఈ ఐదేళ్లలో మౌలిక వసతుల కల్పన కోసం చంద్రబాబు రూ.5800 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారని జగన్ తెలిపారు. బాండ్లు తనఖా పెట్టి బ్యాంకుల నుంచి ఇందుకోసం రుణాలు తీసుకొచ్చారు. దీని మీద వడ్డీ ఏటా రూ.700 కోట్లు వడ్డీ కడుతున్నామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles