Police reveal shocking facts in Disha accused case ‘దిశ’ నిందితుల షాకింగ్ విషయాలు వెలుగులోకి..!

Cyberabad police reveal shocking facts in disha accused case

Disha, veterinary doctor, veterinary disha, disha case parents, disha parents encounter, disha case accused, cyberabad police, commissioner Sajjanar, mohammad arif, Siva, Navin, Chennakeshavulu, National Human Rights Commission, minors in disha case, minors encounter, NHRC, crimes against women, Telangana, Crime

Telangana police revealed shocking news on the four accused in Disha murder and rape case. According to the reports, police expressed doubt that the accused were also involved in 15 other murder cases. It is said that the accused Arif Ali and Chennakeshavulu majorly involved in the crimes.

‘దిశ’ నిందితుల షాకింగ్ విషయాలు వెలుగులోకి..!

Posted: 12/18/2019 11:32 AM IST
Cyberabad police reveal shocking facts in disha accused case

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసులోని హత్యాచార నిందితులకు సంబంధించిన మరో సంచలనమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వార్తల ఆధారంగానే పోలీసులు వీరిని ఎన్ కౌంటర్ రూపంలో అంతమొందించారా.? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. నిందితులకు సంబంధించిన షాకింగ్ విషయాలు వెలుగులోకి రావడంతో.. ఎన్ కౌంటర్ ఘటన తర్వాత వారి కుటుంబాలకు వచ్చిన సానుభూతిని.. ఈ విషయాలు వెలుగులోకి రావడంతో అవిరైపోయాయి. కేసు విచారణలో ఈ విషయాలను నిందితులు అంగీకరించారని కూడా సమాచారం.

ఇంతకీ ఆ షాకింగ్ విషయాలు ఏంటంటే.. వైద్యురాలు దిశపై అత్యాచారానికి తెగబడడానికి ముందు నిందితులు.. మరో 9 మంది మహిళలపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించినట్టు తెలుస్తోంది. కాగా, ఈ కేసులు వెలుగులోకి వచ్చినా.. వారిపై అనుమానాలు రాకపోవడంతోనే.. దిశపై కూడా అదే రీతిలో టోల్ గేటుకు కూతవేటు దూరంలో సామూహిక హత్యాచారానికి తెగబడినట్టు తెలుస్తోంది. దిశ కేసులో ప్రధాన నిందితుడైన అరీఫ్ ఆరుగురిని హత్య చేయగా, చెన్నకేశవులు ముగ్గురిని అంతమొందించినట్టు చెప్పారు.

ఈ ఘటనలన్నీ మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్‌, కర్ణాటక ప్రాంతాల్లోని హైవేల సమీపంలో చేసినట్టు నిందితులు అంగీకరించినట్టు తెలుస్తోంది. అత్యాచారం అనంతరం హత్య చేసి మృతదేహాలను దహనం చేసినట్టు నిందితులు తమ వాంగ్మూలంలో వెల్లడించినట్టు సమాచారం. నిందితులు చెప్పిన సమాచారం ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆయా ప్రాంతాల్లో మొత్తం 15 ఘటనలు జరిగినట్టు గుర్తించారు. దిశ నిందితుల డీఎన్ఏను మృతి చెందిన వారి డీఎన్ఏతో విశ్లేషిస్తున్నారు. నిందితులకు సంబంధించి కోర్టుకు సమర్పించనున్న చార్జిషీట్‌లో వారు వెల్లడించిన నేరాలకు సంబంధించిన వివరాలను కూడా పొందుపర్చనున్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Disha  veterinary doctor  encounter  gangrape case  mohammad arif  Siva  Navin  Chennakeshavulu  Shamshabad  Telangana  Crime  

Other Articles