పోటీ ప్రపంచంలో తనను తాము పోటీదారులుగా పేర్కోంటూ నేటి తల్లిదండ్రులు విద్యార్థులపై తీసుకువస్తున్న ఒత్తడి.. దీనికి తోడు ఉపాధ్యాయులు పెడుతున్న హోరు.. వెరసి లేత హృదయాలపై భారీన్ని మోపుతున్నాయి. దీంతో పరీక్షలంటే చాలు చలిజ్వరం వచ్చేసే విద్యార్థులు సంఖ్య కూడా అధికంగానే వుంది. అయితే జ్వరాలు రాకపోయినా ఏదో ఒక ఎత్తుగడ వేసి పరీక్షలను రాయకుండా తప్పించుకోవాలని భావిస్తున్న విద్యార్థులు తమకు అనువైన ఎన్నో ఉపాయాలను కూడా వినియోగిస్తుంటారు. కానీ ఓ విద్యార్థిని మాత్రం ఏకంగా కిడ్నాప్ డ్రామాకే తెరలేపింది. దీంతో పోలీసులు విద్యార్థిని తల్లిదండ్రులకు క్లాస్ తీసుకోవాల్సి వచ్చింది.
అసలే దిశ ఘటనతో విమర్శలు ఎదుర్కోన్న పోలీసులు పూర్తి అప్రమత్తతో వున్న తరుణంలో.. పరీక్షల రాయకుండా తప్పించుకునేందుకు ఓ డిగ్రీ విద్యార్థిని తనను కొందరు యువకులు కిడ్నాప్ చేశారని, అయితే అరగంట తరువాత తన మెడలోని బంగారు చైన్ తీసుకుని వదిలేశారని తన తండ్రితో పాటు వచ్చి పిర్యాదు చేసింది. ఏకంగా ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయానికి వచ్చి పిర్యాదు చేయడంతో.. అధికారి అదేశంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఉరుకులు పరుగులు పెట్టి.. ఏక్కడా ఏ అనవాలు లేక.. ఇదేం కేసురా బాబు అంటూ విషయాన్ని డీసీపీ దృష్టికి తీసుకెళ్లారు.
విషయం అర్థమైన పోలీసు ఉన్నతాధికారి విద్యార్థినిన మరోసారి పిలిచి విచారించడంతో.. తాను వేసిన ప్లాన్ ఫ్లాపైయ్యిందని అర్థమైంది. కేవలం పరీక్షలను రాయడం ఇష్టంలేక కిడ్నాప్ డ్రామా అడానని అమె తెలిపింది. అసలేం జరిగిందంటే.. ఎల్బీనగర్‌కు చెందిన ఓ యువతి 10 రోజుల కిందట తల్లిదండ్రులతో కలిసి ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయానికి వచ్చింది. తాను కాలేజీ నుంచి వస్తుంటే నలుగురు వ్యక్తులు కారులో వచ్చి కిడ్నాప్ చేశారని, అరగంట తర్వాత తన మెడలోని బంగారు చైన్ లాక్కుని వదిలేసి వెళ్లిపోయారని ఫిర్యాదు చేసింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బృందాలుగా విడిపోయి దర్యాప్తును ప్రారంభించారు. యువతి చెప్పిన వివరాల ఆధారంగా అనేక కోణాల్లో విచారణ చేపట్టారు. యువతి చెప్పిన ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించారు. ఎందులోనూ యువతి చెప్పిన కారు కనిపించలేదు. అదే పుటేజీలో యువతి నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో ఆ యువతి పైనే పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో ఆమెను మరోసారి స్టేషన్‌కు పిలిపించి విచారించగా షాకింగ్ విషయాలు చెప్పింది.
డిగ్రీ పరీక్షలు రాయకుండా తప్పించుకునేందుకే కిడ్నాప్ డ్రామా ఆడినట్లు యువతి చెప్పడంతో పోలీసులు ఖంగుతిన్నారు. దీంతో విద్యార్థినిన మందలించి.. ఇలాంటి ఘటనలు నిజంగా జరిగితే వారిది కూడా నాటకమేనని మేము భావించే ప్రమాదముందని.. అలాంటి అవకాశాలకు చాన్స్ ఇవ్వకూడదని ఇకపై జాగ్రత్తగా మసలుకోవాలని హెచ్చరించి ఇంటికి పంపేశారు. అనంతరం ఆమె తల్లిదండ్రులను పిలిపించి కుమార్తె చేసిన నిర్వాకాన్ని చెప్పి.. చదువు పేరుతో విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తే ఇలాంటి పరిణామాలే ఎదురవుతుంటాయని క్లాస్ తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more