Adireddy Bhavani speaks on brands of Liquor మద్యం బ్రాండ్లపై మహిళా ఎమ్మెల్యే ప్రసంగం.. నవ్వులు

Amid collegues laugh tdp woman mla speaks on brands of liquor

Adireddy Bhavani, RamaNaidu, liquor ban, prohibition of Liquor, liquor rates, Liquor brands, AP Assembly, YSRCP MLAs, Laughs in Assembly, Excise Commissions, Revenue source, Andhra Pradesh, Politics

Amid collegue Members of Legislative Assembly laughs, TDP MLA from Rajamundry Adireddy Bhavani speaks on brands of Liquor as a part of prohibition of liquor in Andhra Pradesh. While another TDP MLA Ramanaidu slams Andhra Pradesh government over hike on alcohol rates.

ITEMVIDEOS: మద్యం బ్రాండ్లపై మహిళా ఎమ్మెల్యే ప్రసంగం.. నవ్వులు

Posted: 12/16/2019 01:37 PM IST
Amid collegues laugh tdp woman mla speaks on brands of liquor

వాడీవేడిగా సాగుతున్న నవ్యాంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఇవాళ సభలో మధ్యపాన నిషేధంపై అధికార, విపక్షాల మధ్య రసవత్తర చర్చకు దారితీసింది. అంచెలవారీగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామన్న ప్రభుత్వం.. ద్వంద విధానాలకు తెరతీసిందని టీడీపీ ధ్వజమెత్తింది. రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ విధానంలో అనుసరిస్తున్న తీరు.. అధికార పార్టీ కార్యకర్తలకు, నేతలకు కాసుల పంటగా తయారైందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు విమర్శించారు. మద్యం అమ్మకాలు తగ్గినా.. అదాయం మాత్రం ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేసింది.

ఈ అంశంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భావాణి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూ ప్రచారం చేసి.. ప్రజలకు హామీలిచ్చిన వైసీపీ.. అధికారంలోకి వచ్చిన తరువాత అంచెలువారీగా చేయడం మాట తప్పడం కాదా.? అని ప్రశ్నించారు. కొత్త ఎక్సైజ్ పాలసీ పరిశీలిస్తే.. మద్యపాన విషయంలో ప్రజలకు మాత్రం భ్రమ కల్పిస్తూ.. ఆదాయాన్ని మాత్రం సమకూర్చుకోవడం ప్రభుత్వ ఎత్తగడలా కనిపిస్తోందని విమర్శించారు. దుకాణాల సంఖ్య తగ్గినా.. అమ్మాకాలు మాత్రం అధికంగానే వస్తుందన్నారు. మద్యం ధరలు విపరీతంగా పెరిగాయని అరోపించారు. వైసీపీ కార్యకర్తలకు చెందిన ఇళ్లలోనే దుకాణాలను ఏర్పాటు చేయడంతో వారికి అద్దెలును ఇభ్బడిముబ్బడిగా చెల్లిస్తున్నారని అరోపించారు. ఎక్సైజ్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆలయాలు, పాఠశాల వద్ద కూడా వీటిని ఏర్పాటు చేశారని అమె అరోపించారు. మద్యం సమయాలు దాటిన తరువాత అందులో పనిచేసే ఉద్యోగులే వాటిని బ్లాక్ మార్కెట్ ద్వారా విక్రయిస్తున్నారన్నారు.

ఇంతవరకు బాగానే వున్నా ఇక్కడే అమె చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో నవ్వులు పూయించాయి. ‘‘ఇది వరకు రాష్ట్రంలో చాలా బ్రాండ్స్ వుండేంటూ.. వుండేవి అధ్యక్షా. ఇప్పుడు చాలా తక్కువ వున్నాయని అనేలోపు సభలోని ఎమ్మెల్యేలు నవ్వేశారు. ఇంతలో స్పీకర్ తమ్మినేని సీతారాం.. జోక్యం చేసుకుని నీకెందుకురా తల్లి.. ఆ బ్రాండ్ల విషయం వారికి వదిలేయ్.. వాళ్లు మాట్లాడతారుగా.. అని వ్యాఖ్యానించారు. దీంతో భవాణి కూడా నవ్వుతూనే.. తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రభుత్వానికి కమీషన్ వచ్చే బ్రాండ్స్ మాత్రమే ఇప్పడు విక్రయిస్తున్నారని అమె అన్నారు. ఇక ప్రభుత్వం మధ్యం ధరలను పెంచడంతో గ్రామీణ ప్రాంతాల్లో నాటుసారా విక్రయాలు జోరందుకున్నాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆమె ప్రభుత్వానికి సూచించారు.




If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles