పొగ త్రాగడం మీ ఆరోగ్యానికి హానికరం... మీతో పాటు మీ పక్కనున్న వారికీ కూడా హానికరమే. కొన్నేళ్లుగా ఈ వ్యాఖ్యాన్ని ఎక్కడ పడితే అక్కడ.. కనిపిస్తోంది. ధూమపానరాయుళ్లు మాత్రం ప్యాకెట్ల కొద్దీ సిగరెట్లను కాల్చి.. వారి ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు. ఇక నిన్నమొన్నటి రవకు ఇలాంటి వ్యాఖ్యాలు ఎక్కడ కనబడినా వాటిని కామెడీగా చెరిపేసి.. లేదా అర్థాన్ని మార్చేసి.. జోక్ గా తీసుకునేవారు. ఇక సినిమా ధియేటర్లలో ఈ హెడ్ లైన్ కొంచెం హై లెట్ చేసినా.. ఎవరు పట్టించుకోవడం లేదు. సినిమాలో పాటు ఎప్పుడు మొదలైనా.. బయటకు పరుగులు తీసే పోగరాయుళ్లు.. పాట పూర్తయ్యే సమయానికి సిగరెట్ ఊదేసి లోనికి వచ్చేయడం కూడా మనం గమనిస్తువుంటాం.
ఉమ్మడి అంధ్రప్రదేశ్ లో 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగడం నేరమని.. ఇలా చేసిన వారు చట్టం ప్రకారం శిక్షార్హులు అవుతారని కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. అయితే అప్పట్లో దీనిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే క్రమంలో పోలీసులు ఈ చట్టాన్ని ధూమపానప్రియులకు పరిచయం చేస్తున్నారు. ఎంతగా దీనిపై శ్రద్ద పెట్టినప్పటికీ ఇంకా చాలామంది నిసిగ్గుగా రోడ్లపై సిగరెట్లు తాగడం మానడం లేదు. తాజాగా రోడ్డుపై సిగరెట్ తాగేవారిపై స్థానికులు కూడా కన్నెర చేస్తున్నారు. దీంతో వారు కటకటాలు లెక్కించాల్సి వస్తోంది.
భహిరంగ ప్రదేశాల లో మద్యపానం చేయడం ఎంతటి నేరమో.. అలాగే ధూమపానం చేసినా అదీ నేరమే. ఈ విషయం తెలిసినప్పటికీ కూడా మేడిపల్లి ఎన్ఐఎన్ కాలనీకి చెందిన బాలదీపక్ అనే వ్యక్తి రాత్రివేళ ఆరు బయట హాయిగా సిగరెట్ తాగాడు. దీనితో ఆ కాలనీ వాసులు పెట్రోలింగ్ పోలీసులు కంప్లయింట్ ఇచ్చారు. దీనితో అక్కడికి వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు ఆరు బయట సిగరెట్ తాగే వ్యక్తిని అరెస్ట్ చేసి.. ఎల్బీ నగర్ ఫస్ట్ క్లాస్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగినందుకు ఆ వ్యక్తికి కోర్టు మూడు రోజుల జైలు శిక్ష విధించింది. గతంలో రూ.50 చొప్పున పడిన జరిమానా కాస్తా ఏకంగా మూడు రోజుల జైలు శిక్షగా మారింది. సో.. ధూమపాన ప్రియులు బీ అలర్ట్..
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more